2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో "కాంపాక్ట్ ఎస్‌యూవీ" (Compact SUV) విభాగం అత్యంత పోటీతో కూడుకున్నది. ఈ విభాగంలో ఏదైనా కారు ఎక్కువ కాలం పాటు మార్కెట్లో స్థిరంగా నిలబడాలంటే, ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా సదరు కారును అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్ల తయారీదారులు ఇతర పోటీదారులతో సమానంగా తమ కార్లను అందించలేనప్పుడు అది మార్కెట్లో పరాజయం పాలయ్యే అవకాశం ఉంది. అందుకే, భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) ఈ సిద్ధాంతాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

మనం గమనించినట్లయితే, మారుతి సుజుకి ఈ ఏడాది అనేక అప్‌డేటెడ్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది. బాలెనో, ఎర్టిగా, ఎక్స్ఎల్6 మొదలైన మోడళ్లను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. ఈ 2022 మోడళ్లన్నీ కూడా రిఫ్రెష్డ్ డిజైన్ మరియు రిఫ్రెష్డ్ ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన మోడల్ కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (గతంలో 'విటారా బ్రెజ్జా' పేరుతో విక్రయించారు). మనం 2016లో చూసిన మొదటి తరం మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2022 మారుతి సుజుకి బ్రెజ్జాకి చాలా తేడా ఉంది. ఈ 6 ఏళ్లలో బ్రెజ్జా ఎన్నో రెట్లు అభివృద్ధి చెందింది మరియు కంపెనీకి కాసుల వర్షం కురిపించింది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

వాస్తవానికి, మారుతి సుజుకి ఎల్లప్పుడూ చిన్న కార్లు మరియు హ్యాచ్‌బ్యాక్‌ల తయారీదారుగానే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కంపెనీ అందించిన జెన్, ఆల్టో, 800, స్విఫ్ట్, రిట్జ్, వ్యాగన్ఆర్ మొదలైన చిన్న కార్లు భారతీయ కుటుంబాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఎస్‌యూవీ విభాగంలో జిప్సీ మరియు గ్రాండ్ విటారా వంటి యుటిలిటీ వాహనాలను తయారు చేయడం ద్వారా మారుతి సుజుకి మంచి అనుభవాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ కంపెనీ ఎప్పుడూ కూడా ఈ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు అనిపించలేదు. మారుతి ఎక్కువగా తక్కువ ధర వద్ద విక్రయించే చిన్న కార్ల పైనే దృష్టి పెట్టింది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

అయితే, భారత మార్కెట్లో ఎస్‌యూవీ ట్రెండ్ సెట్ కావడం మరియు మార్కెట్లోకి కొత్త, పాత కార్ కంపెనీలు ఈ విభాగాలలో విభిన్న ఉత్పత్తులను తీసుకురావడంతో మారుతి సుజుకి కూడా జాప్యం చేయకుండా, ఈ విభాగంలో తన సత్తా ఏంటో చూపేందుకు 2016లో తొలిసారిగా విటారా బ్రెజ్జా (Maruti Suzuki Vitara Brezza) కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. అసలే విశ్వసనీయమైన మారుతి సుజుకి బ్రాండ్, ఆపై అది లో-బడ్జెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కావడంతో కస్టమర్లు ఒక్కసారిగా విటారా బ్రెజ్జా కోసం క్యూ కట్టడం మొదలుపెట్టారు. అలా విటారా బ్రెజ్జా అతి తక్కువ సమయంలోనే ఈ బ్రాండ్‌కి అత్యంత విజయవంతమైన మోడల్‌గా నిలిచింది.

బ్రెజ్జా హిస్టరీని పక్కకి పెట్టి, ఈ కొత్త 2022 మోడల్ లో ఉండే మిస్టరీ ఏంటీ తెలుసుకునేందుకు మేము కొత్త మారుతి సుజుకి బ్రెజ్జాను ఐకానిక్ ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో మరియు మహాబలిపురంలోని సుందరమైన ప్రదేశాల చుట్టూ టెస్ట్ డ్రైవ్ చేశాము. మరి ఈ కొత్త మోడల్‌లో కొత్తగా ఏముందో మీరు కూడా తెలుసుకుందురు రండి.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

2022 మారుతి సుజుకి బ్రెజ్జా - డిజైన్ మరియు స్టైల్

కారు డిజైన్‌పై ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒకవేళ మీకు పాత బ్రెజ్జా డిజైన్‌ నచ్చినట్లయితే, ఈ కొత్త 2022 బ్రెజ్జా డిజైన్ మరింత ఎక్కువ నచ్చే చాన్స్ ఉంటుంది. ఈ కొత్త మోడల్ మునుపటి కన్నా మరింత మజిక్యులర్‌గా కనిపిస్తుంది. దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ, కంపెనీ దీనికి రిఫ్రెష్డ్ లుక్‌ని ఇచ్చేందుకు ప్రయత్నించింది. కారు ఉండే బాడీ లైన్స్ ఇప్పుడు చాలా క్లీన్‌గా కనిపిస్తాయి, స్టైలింగ్‌లో ఇది గతంలో కంటే బాక్సియర్‌గా ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా అన్ని కోణాల నుండి కొత్తదే అయినప్పటికీ, ఇది ముందు వైపు నుండి మరింత సరికొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేయబడిన కొత్త గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు రీప్రొఫైల్ చేయబడిన బంపర్లతో రిఫ్రెష్డ్ లుక్ ని కలిగి ఉంటుంది. దీని హెడ్‌ల్యాంప్ సెటప్ ఇది స్క్వేర్డ్ ఆఫ్ డిజైన్ లాగా కనిపిస్తుంది, కానీ నిశితంగా పరిశీలిస్తే ఇందులో కొన్ని కర్వ్‌లు ఉన్నాయని తెలుస్తుంది. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఖచ్చితంగా అద్భుతంగా కనిపిస్తాయి మరియు దీని హెడ్‌ల్యాంప్‌లు కొత్త గ్రిల్‌లో సజావుగా మిళితం అవుతాయి.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

గ్రిల్ మధ్యలో ఉండే పెద్ద సుజుకి లోగో ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్ లోని ఫాగ్ ల్యాంప్‌లు చిన్నవిగా అనిపిస్తాయి మరియు ఇవి బ్లాక్ క్లాడింగ్‌తో జతచేయబడి ఉంటాయి. ఈ బ్లాక్ క్లాడింగ్ ఫ్రంట్ బంపర్‌ నుండి సైడ్ ప్రొఫైల్‌ వరకు కొనసాగుతుంది. బంపర్ దిగువ భాగంలో ఉండే సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ ముందు భాగానికి మరింత వన్నె తెస్తుంది. సైడ్స్ లో మీ దృష్టిని ఆకట్టుకునేది డ్యూయల్-టోన్ డైమండ్-కట్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్. అయితే, ఇవి టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. లోయర్ వేరియంట్‌లు పెయింటెడ్ వీల్స్ మరియు బేస్ వేరియంట్ స్టీల్ వీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త బ్రెజ్జా వీల్ ఆర్చ్‌లు ఇప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తాయి మరియు ఇది ఎస్‌యూవీకి మరింత మజిక్యులర్ లుక్ ని ఇస్తాయి. బాడీ డిజైన్ లైన్లు చాలా స్ట్రెయిట్‌గా ఉన్నాయి మరియు ఇది బ్రెజ్జాకు బాక్సీ రూపాన్ని ఇవ్వడంలో సహకరిస్తాయి. పైన పేర్కొన్న విధంగా, బ్లాక్ బాడీ క్లాడింగ్ ముందు నుండి సైడ్స్ లో కూడా కొనసాగుతుంది. ఈ మాట్ బ్లాక్ క్లాడింగ్ వీల్ ఆర్చ్‌లపై మందంగా ఉంటుంది మరియు తలుపులపై మరింత మందంగా మారుతుంది. ఇప్పుడు ఇది మరింత మెరుగ్గా కనిపించేలా ఆకృతితో ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త బ్రెజ్జా యొక్క A, B, C మరియు D పిల్లర్స్ అన్ని వేరియంట్‌లలో బ్లాక్-అవుట్ చేయబడ్డాయి, అయితే ZXi మరియు ZXi+ వేరియంట్‌లలో మాత్రమే రూఫ్ బ్లాక్ అవుట్ చేయబడింది. పెయింట్ కలర్ ఆప్షన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ వెనుక భాగం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక ఉండే స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు మరింత సొగసైనవి మరియు సన్నగా ఉంటాయి, అయితే ఈ కొత్త మోడల్ యొక్క టెయిల్ గేట్ పరిమాణం మునుపటి కన్నా తగ్గిపోయింది. అంటే, దీనర్థం లోడింగ్ కోసం డోర్ ఓపెనింగ్ స్థలం మునుపటి కంటే కొంచెం తక్కువగా ఉంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

వెనుక డోరుపై బ్రెజ్జా బ్యాడ్జ్ ప్రధానంగా కనిపిస్తుంది మరియు సుజుకి లోగో కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. వెనుక బంపర్ దిగువన ఒక సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ ఉంటుంది, దాని పైన రెండు సమాంతర రిఫ్లెక్టర్లు ఉన్నాయి. నంబర్ ప్లేట్ కూడా చాలా బాగుంది. మొత్తం మీద, కొత్త బ్రెజ్జాలో వెనుక భాగంలో ప్రధానమైన డిజైన్ మార్పులు చేయబడ్డాయి. ఓవరాల్ గా చెప్పాలంటే, కొత్త 2022 బ్రెజ్జా మునుపటి కన్నా మరింత స్పోర్టీగా మరియు యూత్‌ఫుల్‌గా ఉండే రిఫ్రెష్ డిజైన్‌ను కలిగి ఉంది. రోడ్డుపై ఈ ఎస్‌యూవీ ఎవ్వరి దృష్టినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

2022 మారుతి సుజుకి బ్రెజ్జా - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

కొత్త 2022 బ్రెజ్జాలోని ఇంటీరియర్ మరియు కాక్‌పిట్ ఇప్పుడు మరింత యూత్‌ఫుల్‌గా మరియు టెక్ లోడెడ్‌గా ఉంటుంది. కొత్త బ్రెజ్జా డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బ్రౌన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. డ్రైవరు ముందు భాగంలో ఉండే స్టీరింగ్ వీల్ డిజైన్ చాలా పరియచం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కంపెనీ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. మారుతి స్విఫ్ట్ మరియు కొత్త 2022 బాలెనో వంటి వాటిలో కూడా ఇదే స్టీరింగ్ వీల్ కనిపిస్తుంది. అయితే, ఇందులో మీరు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లను పొందుతారు మరియు ఫ్లాట్-బాటమ్ డిజైన్‌తో కూడిన సిల్వర్ ఇన్సర్ట్ దీన్ని కొద్దిగా స్పోర్టివ్‌గా చేస్తుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

స్టీరింగ్ వీల్ వెనుక ఫుల్ కలర్ ఎమ్ఐడి డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇందులోని MID వాహనం గురించి అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఇది చూడటానికి చాలా ఫాన్సీగా కనిపిస్తుంది. పాత బ్రెజ్జా కంటే ఈ ఇన్‌స్ట్రుమెంటేషన్ భారీగా మెరుగుపడిందని చెప్పవచ్చు. ఈ MID కి ఎడమవైపు అనలాగ్ టాకోమీటర్ మరియు కుడి వైపున స్పీడోమీటర్ ఉంటాయి. ఎమ్ఐడితో పాటు, డ్రైవర్ హెడ్-అప్ డిస్‌ప్లే ముఖ్యమైన డ్రైవ్-సంబంధిత సమాచారాన్ని కూడా వీక్షించవచ్చు. ఇది నిజంగా ఫ్యాన్సీ స్టఫ్ మరియు ముఖ్యంగా అధిక వేగంతో లాంగ్ డ్రైవ్‌లు చేస్తున్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

ఇక డ్యాష్‌బోర్డ్ మధ్యలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. లో-ఎండ్ వేరియంట్‌లలో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉండగా, టాప్-స్పెక్ ZXi+ వేరియంట్ పెద్ద 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉంటుంది. ఇది Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4 స్పీకర్ మరియు 2 ట్వీటర్ లో కూడిన ARKAMYS ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ ఆడియో సిస్టమ్ నుండి వచ్చే ధ్వని చాలా బాగుంది మరియు ఇందులో ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. ఈ ధర వద్ద దీని కంటే ఎక్కువ ఆశించకూడదు. ఇది ఖచ్చితంగా ఈ రంగంలో పోటీ కంటే మెరుగైనది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

ఇదే టచ్‌స్క్రీన్ 360-డిగ్రీ కెమెరా నుండి వచ్చే చిత్రాలను కూడా ప్రదర్శిస్తుంది. ఇందులో డ్రైవర్ అనేక కెమెరా యాంగిల్స్‌ను ఎంచుకోవచ్చు మరియు ఇది నెక్స్ట్ జనరేషన్ సుజుకి కనెక్ట్ కనెక్టివిటీ సూట్‌తో కూడా వస్తుంది. పార్కింగ్ మరియు రివర్సింగ్ సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద ఏసి వెంట్స్ మరియు వాటి కింద క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. కొత్త బ్రెజ్జాలో టెంపరేచర్ మరియు ఫ్యాన్ వేగం కోసం స్విచ్‌లు మరియు వాటి మధ్యలో చిన్న LCD డిస్ప్లే యూనిట్ ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

సెంటర్ కన్సోల్‌ మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కి కనెక్ట్ చేయడానికి USB స్లాట్‌లు ఉంటాయి. ఈ USB పోర్ట్‌ల క్రింద వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఈ కారును టెస్ట్ చేసే సమయంలో ఈ ఫీచర్ మాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. సెంటర్ కన్సోల్ యొక్క మిగిలిన భాగం గేర్ లివర్ మరియు హ్యాండ్‌బ్రేక్‌తో చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ విభాగం ప్రారంభంలో పేర్కొన్నట్లుగా, కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా యవ్వనమైన మరియు ఆధునికమైన, ఇంకా పరిణతి చెందిన ఇంటీరియర్‌ను కలిగి ఉంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

2022 మారుతి సుజుకి బ్రెజ్జా - కంఫర్ట్ మరియు ప్రాక్టికాలిటీ

కంఫర్ట్ మరియు ప్రాక్టికాలిటీ విషయంలో మారుతి సుజుకి ఇప్పటి వరకూ అత్యుత్తమైన కార్లను అందిస్తూ వచ్చింది. కాబట్టి, ఈ విషయంలో మారుతి సుజుకి బ్రెజ్జా గురించి ప్రత్యేకించి నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇవి రెండూ ఈ ఎస్‌యూవీ యొక్క బలమైన పాయింట్లు అనొచ్చు. ప్రజలు కొత్త బ్రెజ్జాతో జీవించడం చాలా సులభం, దీనిని డ్రైవ్ చేయడం సులభం. అందుకే ఇది చాలా ఎక్కువ సంఖ్యలో విక్రయించబడింది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త 2022 బ్రెజ్జా పాత మోడల్ మాదిరిగానే చాలా ఆచరణాత్మకమైనది మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులోని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు ఎక్కువ గంటల పాటు డ్రైవ్ చేసినా అలసట అనిపించదు. మారుతి సుజుకి తమ కొత్త బ్రెజ్జాను 'సిటీ-బ్రెడ్' ఎస్‌యూవీగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఈ కొత్త బ్రెజ్జాలో ఉన్నవారు మాత్రం సులభంగా ఎక్కువ దూరం ప్రయాణించగలరు. కేవలం ఫ్రంట్ సీట్లలోనే కాదు వెనుక సీట్లలో కూడా కంఫర్ట్ బాగానే ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

వెనుక ప్రయాణీకులకు తగినంత స్థలం ఉంది. హెడ్‌రూమ్ చాలా బాగుంది మరియు లెగ్ రూమ్ కూడా అంతే బాగుంది. వెనుక ప్రయాణీకులకు థై సపోర్ట్ మరింత మెరుగ్గా ఉండవచ్చు, అయితే మరీ ఫిర్యాదు చేసేంత ఏమీ లేదు. వెనుక సీట్లలో కప్‌హోల్డర్‌లతో కూడిన ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ ఉంటుంది. కారులో నలుగురు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫీచర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

అలాగే, వెనుకవైపు ఉన్న ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్ మరియు వారి స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్‌లు ఉంటాయి. ప్రాక్టికాలిటీ పరంగా చూస్తే, ఇందులోని స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు HUD (హెడ్-అప్-డిస్‌ప్లే) అనేవి చాలా ఆచరణాత్మకమైనవి మరియు రోజువారీ ఉపయోగకరంగా ఉండే రెండు ప్రధాన ఫీచర్లుగా చెప్పవచ్చు. గ్లోవ్‌బాక్స్‌లో మంచి స్థలం ఉంది మరియు డోర్ పాకెట్స్ కూడా నిల్వ స్థలాన్ని కలిగి ఉన్నాయి. సీట్‌బ్యాక్ పాకెట్‌లు మరియు ముందు సీట్ల వెనుక హుక్‌ కూడా ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

బూట్ స్పేస్ పరంగా, కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా వెనుక భాగంలో గణనీయమైన 328 లీటర్ల స్థలాన్ని కలిగి ఉంది. లగేజ్ కోసం మరింత అధిక స్థలం కావాలనుకునే వారు వెనుక సీటును మడతపెట్టడం ద్వారా దీనిని గణనీయంగా పెంచుకోవచ్చు. బ్రెజ్జా భారతీయ మార్కెట్లో చాలా ఆచరణాత్మక మోడల్ గా కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన ఈ 2022 మోడల్ కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

2022 మారుతి సుజుకి బ్రెజ్జా - ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

మారుతి సుజుకి డీజిల్ కార్లను తయారు చేయడం నిలిపివేసిన తర్వాత ఇప్పుడు బ్రెజ్జా కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. అయితే, ఇందులో మైల్డ్-హైబ్రిడ్ సెటప్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ ఇప్పుడు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా కొత్తగా పరిచయం చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కొత్త మారుతి సుజుకి బ్రెజ్జాకు శక్తినిచ్చే ఇంజన్ పాతదే అయినప్పటికీ, కంపెనీ దీనిని కొత్త సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ మరియు బ్యాటరీ అసిస్ట్ ఉన్నాయి.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

ఇదొక 1,463 సీసీ కె15సి డ్యూయెల్ జెట్ డ్యూయెల్-వివిటి ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 101.6 బిహెచ్‌పి శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 136.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో కూడా ఇదే ఇంజన్‌ను చూడొచ్చు. కొత్త బ్రెజ్జాలోని ఈ ఇంజన్ ఇప్పుడు తక్కువ NVH (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలతో మృదువైన డ్రైవ్‌ను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ ఐడిల్‌గా ఉన్నప్పుడు దాని ఇంజన్ ఆపివేయబడిందని భావించేలా చేస్తుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త 2022 బ్రెజ్జా పాత మోడల్ కంటే కొంచెం వేగంగా వేగవంతం అవుతుంది మరియు ప్రతి గేర్‌లో ఈ అనుభూతి లభిస్తుంది. డ్రైవింగ్ చేయడానికి ఇదొక అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్‌యూవీ. మేము మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లు రెండింటినీ టెస్ట్ డ్రైవ్ చేశాము. మాన్యువల్ గేర్‌బాక్స్ తేలికపాటి క్లచ్‌ను కలిగి ఉంది మరియు ఇది పట్టణ పరిస్థితులలో డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో కూడా ఇది సౌకర్యంగానే అనిపించింది. ఇందులో గేర్ లివర్ చాలా తేలికగా ఉంటుంది మరియు గేర్ త్రోలు కూడా సులభంగా ఉంటాయి.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ విషయానికి వస్తే, సాధారణంగా టార్క్ కన్వర్టర్ ఇంజన్‌లు పెద్ద ఇంజన్‌లతో బాగా పనిచేస్తాయి. అదే ఉద్దేశ్యంతో, కొత్త 2022 బ్రెజ్జాలో ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మెరుగ్గా ఉండేదని మేము భావించాము. అయితే, మేము ఊహించిన దానికంటే ఈ కొత్త గేర్‌బాక్స్ పనితీరు చాలా బాగా అనిపించింది. మీరు ఈ గేర్‌బాక్స్‌ను మాన్యువల్ మోడ్‌లోకి కూడా స్లాట్ చేయవచ్చు మరియు గేర్‌లను మార్చడానికి స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించవచ్చు. ఇది గేర్‌బాక్స్ లాగ్‌ను కొంత వరకు నయం చేస్తుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

రైడ్ మరియు హ్యాండ్లింగ్ విషయానికి వస్తే, ఇక్కడా చాలా పెద్ద మార్పులేవీ లేవు. స్టీరింగ్ చాలా తేలికగా ఉంటుంది మరియు పట్టణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీని అద్భుతమైన టర్నింగ్ రేడియస్ కారణంగా ఇరుకైన ప్రదేశాలలో కూడా సులువుగా టర్న్ చేయవచ్చు. ఇది మునుపటి విటారా బ్రెజ్జా మాదిరిగానే అదే సస్పెన్షన్ మరియు బ్రేక్‌ల సెటప్‌ను ఉపయోగిస్తుంది. సస్పెన్షన్ చాలా మృదువైనదేమీ కాదు. అయితే, మొరటుగా ఉండే రోడ్లపై అంతే మొరటుగా దూసుకుపోతుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

రైడ్ చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు దీని క్రెడిట్‌లో ఎక్కువ భాగం సీట్లకే వెళ్తుంది. మేము ఈ రివ్యూలో ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇది సెగ్మెంట్‌లో అత్యుత్తమ హ్యాండ్లర్ ఏమీ కాదు మరియు ఇది కార్నర్స్ చుట్టూ తిరగడానికి ఉద్దేశించబడలేదు. మారుతి సుజుకి బ్రెజ్జా ఒక సిటీ-బ్రెడ్ ఎస్‌యూవీ మరియు ఆ విధమైన వినియోగానికే ఇది ఉత్తమమైనదిగా ఉంటుంది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త బ్రెజ్జా తగిన బ్రేకింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది మరియు బ్రేకింగ్ పనితీరు కూడా బాగానే ఉంది. ఇందులో ముందువైపు డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అన్నింటికి మించి, మారుతి సుజుకి బ్రెజ్జా లాంగ్ డ్రైవ్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే ఇందులో మీరు పట్టణ ప్రాంతాల్లో చాలా సరదాగా ఉంటారు.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

సేఫ్టీ మరియు ముఖ్యమైన ఫీచర్లు

సేఫ్టీ విషయంలో కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా 2016లో వచ్చిన మొదటి తరం మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కంటే చాలా సురక్షితమైనది. ఇప్పుడు ఇది అవసరమైన అన్ని ఫీచర్లతో లభిస్తుంది.

కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సేఫ్టీ ఫీచర్లు:

- హెడ్-అప్ డిస్ప్లే

- 360-డిగ్రీ కెమెరా

- డ్రైవర్ మరియు కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లు

- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

- హిల్ హోల్డ్ అసిస్ట్

- సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు

- సుజుకి-టెక్ట్ బాడీ

- ఇంజన్ ఇమ్మొబిలైజర్

- ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు

- ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కొత్త మారుతి సుజుకి బ్రెజ్జాలో ముఖ్యమైన ఫీచర్లు:

- 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

- ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే

- ఫుల్-కలర్ ఎమ్ఐడి

- ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

- వెనుక సీటులో ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి పోర్ట్

- ఎలక్ట్రిక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్

- స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

కలర్ ఆప్షన్లు

సింగిల్-టోన్ కలర్స్:

- బ్రేవ్ ఖాకీ

- స్ప్లెండిడ్ వెండి

- సిజ్లింగ్ రెడ్

- ఎక్సౌబరెంట్ బ్లూ

- పెరల్ ఆర్కిటిక్ వైట్

- మాగ్మా గ్రే

డ్యూయెల్-టోన్ కలర్స్:

- స్ప్లెండిడ్ సిల్వర్ విత్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌

- సిజ్లింగ్ రెడ్ విత్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్

- బ్రేవ్ ఖాకీ విత్ ఆర్కిటిక్ వైట్ రూఫ్

2022 మారుతి సుజుకి బ్రెజ్జా టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త డిజైన్, కొత్త ఫీచర్స్‌తో మరింత కొత్తగా..

చివరిగా ఏం చెబుతారు?

మొదటి తరం మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత, వినియోగం మరియు సౌకర్యాల యొక్క ఖచ్చితమైన కలయికను కలిగి ఉంది. ఈ కాంబినేషన్ వల్లనే ఇది అంతకుముందు భారీ స్థాయిలో అమ్ముడుపోయింది. ఇప్పుడు, అదే కాంబినేషన్‌తో వచ్చిన కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా కూడా మునుపటి మాదిరిగానే విజయపథంలో సాగిపోతుంది మరియు ఇంకా పెద్ద సంఖ్యలో విక్రయించబడే అవకాశం ఉంది. కొత్త బ్రెజ్జా ఇప్పుడు మంచి స్టైలింగ్‌తో మరియు టెక్ లోడెడ్ ఫీచర్లతో ఖచ్చితంగా ఎవ్వరినైనా ఆకట్టుకుంటుందనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
New 2022 maruti suzuki brezza test drive review design comfort safety features engine specs and driving impressions
Story first published: Wednesday, July 6, 2022, 13:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X