Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు
జర్మన్ వాహన తయారీసంస్థ ఆడి తన ఏ 4 సెడాన్ భారత మార్కెట్లో 2008 లో విడుదల చేసింది. అప్పటికే ఏ 4 సెడాన్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన లగ్జరీ సెడాన్లలో ఒకటిగా ఉంది. ఈ సెడాన్ అనేక ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, మంచి పనితీరు కలిగిన ఇంజన్లను కూడా కలిగి ఉంది. ఈ కారణంగా లగ్జరీ కార్ మార్కెట్లో ఆకర్షణీయమైన సెడాన్ గా ఉంది.

ఆడి కంపెనీ ఈ కొత్త సంవత్సరం 2021 లో మళ్ళీ తన ఏ 4 యొక్క ఐదవ తరం సెడాన్ ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ కొత్త ఆడి ఏ 4 దాని డిజైన్, ఇంటీరియర్స్ మరియు ఇంజిన్లకు సూక్ష్మమైన అప్డేట్స్ కలిగి ఉంది.
మేము ఇటీవల ఈ కొత్త ఆడి ఏ 4 సెడాన్ నగరం చుట్టూ మరియు హైవేలలో డ్రైవ్ చేసాము. ఈ కొత్త సెడాన్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

డిజైన్ అండ్ స్టైల్:
కొత్త ఆడి ఏ 4 సెడాన్ యొక్క ఫ్రంట్ డిజైన్‌తో ప్రారంభించినట్లైతే, ఇందులో మీ దృష్టిని ఆకర్షించే మొదటి విషయం, కారుకున్న కొత్త హెడ్లైట్లు. హెడ్లైట్లు చాలా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది పుల్ ఎల్ఈడీ యూనిట్. ఇది చాలా అద్భుతంగా కనిపించే డిఆర్ఎల్ లను పొందుతుంది. ఇవి ఇండికేటర్స్ గా కూడా పనిచేస్తుంది.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

కొత్త ఏ 4 ఇప్పుడు కొంచెం పెద్ద గ్రిల్‌ను కూడా పొందుతుంది. ఇది క్రోమ్ ఇన్సర్ట్లను హారిజాంటల్ లైన్ రూపంలో కలిగి ఉంటుంది. ఈ కారు గ్రిల్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కూడా పొందుతుంది. కానీ ఇందులో 360 డిగ్రీల పార్కింగ్ ఫీచర్ లేదు. కారు యొక్క బంపర్ కూడా అడ్జస్టబుల్ చేయబడింది. కావున ఇది ఇప్పుడు మరింత స్పోర్టిగా కనిపిస్తుంది. కొత్త ఆడి ఎ 4 బంపర్‌పై డమ్మీ ఫాగ్ లాంప్ హౌసింగ్‌ను కలిగి ఉంది.

కారు యొక్క సైడ్ ప్రొఫైల్ గమనించినట్లయితే, కొత్త ఏ 4 ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను ఒకే టోన్‌లో పూర్తి చేస్తుంది. అల్లాయ్ వీల్ డార్క్ పెయింట్ స్కీమ్ ని పొందుతుంది లేదా డ్యూయల్-టోన్ స్కీమ్ పొందగలదని మేము ఆశిస్తున్నాము. ఇది చూడటానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. విండోస్ చుట్టూ మరియు డోర్స్ హ్యాండిల్లో క్రోమ్ ఉంది.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

డోర్ హ్యాండిల్స్ స్టాండర్డ్ డోర్ హ్యాండిల్స్ లాగా కనిపిస్తాయి. కానీ వాటిని ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు, అవి పైకి తెరుచుకుంటాయి. ఇది మంచి స్పర్శను కలిగి ఉంటాయి. ఈ కారు మూడు భాగాలుగా విభజించబడిన లైన్స్ మరియు బాడీ క్రీజులను కూడా పొందుతుంది.

ఇక ఈ కారు యొక్క వెనుక వైపుకు వెళ్లేకొద్దీ సొగసైన ఎల్ఇడి టైల్లైట్ల యొక్క కొత్త సెట్ ను కలిగి ఉండటం వల్ల చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బంపర్ యొక్క దిగువ భాగంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ చుట్టూ క్రోమ్ గార్నిషింగ్ కూడా ఉంది. మొత్తంమీద, ఆడి సరికొత్త ఏ 4 యొక్క వెలుపలి భాగం చాలా అద్భుతంగా ఉంటుంది.
MOST READ:ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

ఇంటీరియర్ మరియు ఫీచర్స్:
కొత్త ఆడి ఏ 4 సెడాన్ యొక్క లోపలికి అడుగు పెట్టగానే అద్భుతమైన క్యాబిన్ మీకు స్వాగతం పలుకుతుంది. ఆడి ఎ 4 ఇప్పుడు క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇది డాష్‌బోర్డ్, డోర్స్ మరియు ఇతర భాగాలలో సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లను పొందుతుంది. సెంటర్ స్టేజ్ లో 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది.

ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లోని టచ్ సాఫ్ట్ గా ఉంటుంది, అంతే కాకుండా ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్క్రీన్‌ను తాకిన ప్రతిసారీ దానికి 'క్లిక్' అనే ధ్వని ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను కలిగి ఉంది. ఇది వాహనం గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది.
MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

కొత్త ఏ 4 సెడాన్ లో 12.1 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనిని ‘వర్చువల్ కాక్‌పిట్' అని కూడా పిలుస్తారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని ప్రదర్శనను డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు దానిపై మ్యాప్‌ను చూడాలనుకుంటే, స్టీరింగ్ వీల్‌లోని 'వ్యూ' బటన్ సహాయంతో, మ్యాప్‌లను ప్రదర్శించడానికి మొత్తం స్క్రీన్‌ను పొందవచ్చు.

స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి ఉండటం వల్ల మంచి పట్టుని అందిస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ సరైన క్రమంలో ఉంచబడతాయి. డ్రైవర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా సులభంగా నావిగేట్ చెయ్యడానికి సహాయపడుతుంది.

ఆడి ఏ 4 సెడాన్ యొక్క సీట్ల విషయానికి వస్తే, ఇందులో ఉన్న సీట్లు ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీతో చుట్టబడి ఉంటుంది. ముందు రెండు సీట్లు 12 వే అడ్జస్టబుల్ చేయగలవు కాని డ్రైవర్ వైపు మాత్రమే సీట్ మెమరీ ఫంక్షన్‌ను పొందుతాయి. సీట్లు మంచి సైడ్ బోల్స్టర్లను అందిస్తాయి, ఇవి హెడ్‌రెస్ట్‌లను కూడా పొందుతుంది.

మేము రెండు రోజులు పాటు ఈ కారుని డ్రైవ్ చేసాము, డ్రైవింగ్ సమయంలో ఇందులో ఉన్న సీట్లు ఏ మాత్రం అలసిపోనివ్వకుండా చేస్తాయి. ఇక రెండవ వరుస సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. రెండవ వరస సీట్లు ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. మూడవ వ్యక్తి కూర్చున్నట్లయితే మధ్యలో ఉన్న ట్రాన్స్మిషన్ టన్నెల్ కారణంగా సుదీర్ఘ పర్యటనలో కొంత ఇబ్బందిగా ఉంటుంది.

రెండవ వరుసలో స్పెషల్ లాక్ మరియు కీ సిస్టమ్ ఉంది, దీని ద్వారా సీటు యొక్క ఫోల్డ్ విధానం పరిమితం చేయవచ్చు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్, అందువల్ల ఎవరైనా లోపలికి వెళ్ళడానికి ట్రంక్ తెరిచేందుకు ప్రయత్నిస్తే, వారు సీటును మడతపెట్టి క్యాబిన్లోకి ప్రవేశించలేరు.

కొత్త ఏ 4 సెడాన్ పెద్ద బూట్ కలిగి ఉంది. కావున నలుగురి లగేజ్ కూడా ఇక్కడ సులభంగా ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా స్థలం కావాలనుకుంటే రెండవ వరుసను మడిచి ఎక్కువ లగేజ్ స్పెస్ పొందవచ్చు. కానీ ఈ కారులో ఎలక్ట్రానిక్ బూట్ లేదు, కానీ బూట్ లిడ్ ఓపెన్ చేయడానికి మరియు క్లోస్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.

ఇంజిన్ మరియు హ్యాండ్లింగ్ :
సరికొత్త ఆడి ఎ 4 సెడాన్ 2.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 188 బిహెచ్పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ (డిఎస్జి) తో జతచేయబడింది. ఇది వేగవంతమైన షిఫ్టులను కలిగి ఉంటుంది. కొత్త ఏ 4 కారు కేవలం 7.5 సెకన్లలోపు 0 నుండి 100 కి.మీ వరకు వేగవంతం కాగలదు.

ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. అవి ఎఫిషియన్సీ, కంఫర్ట్, డైనమిక్ మరియు ఇండివిజువల్ మోడ్స్. ఎఫిషియన్సీ మోడ్‌లో స్టీరింగ్ తేలికగా ఉంటుంది మరియు థొరెటల్ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాని ఇంధనాన్ని ఆదా చేస్తుంది. కంఫర్ట్ మోడ్‌లో, స్టీరింగ్ మరియు థొరెటల్ రెస్పాన్స్ కొద్దిగా మెరుగుపడుతుంది. వాహనదారులు ఈ మోడ్ లో నగరం చుట్టూ నడపమని మేము సలహా ఇస్తున్నాము.

డైనమిక్ మోడ్‌లో, థొరెటల్ రెస్పాన్స్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఈ మోడ్ లో స్టీరింగ్ గట్టిపడుతుంది మరియు ఈ మోడ్‌లో కారు యొక్క గరిష్ట సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు. గేర్‌బాక్స్, మరోవైపు, డి మరియు ఎస్ మోడ్‌ను కలిగి ఉంది. డి మోడ్‌ను సాధారణంగా నగరం మరియు హైవే డ్రైవింగ్ కోసం ఉపయోగించవచ్చు. అయితే గేర్‌బాక్స్ ఉత్తమంగా పనిచేయాలని మీరు కోరుకున్నప్పుడు ఎస్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. ఈ మోడ్‌లో, కారు కొంచెం ఎక్కువ రెవ్ రేంజ్ వరకు గేర్లను కలిగి ఉంటుంది.

కారు వేగంగా వెళ్లాలనుకున్నప్పుడు, పాడిల్ షిఫ్టర్లు నిజంగా ఉపయోగకరంగా ఉంటాయి మరియు మీరు మాన్యువల్ మోడ్‌లో అకస్మాత్తుగా డౌన్‌షిఫ్ట్ చేయవలసి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఏ4 లో సస్పెన్షన్ సెటప్ కొంచెం మృదువైనగా ఉంటుంది. ఇది ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆడి ఏ 4 యొక్క మైలేజ్ విషయానికి వస్తే, నగరంలో ఇది ఒక లీటరుకు 7.4 కి.మీ నుండి 9.2 కిమీ. మేము అతితక్కువకాలం ఈ సెడాన్ ని ఉపయోగించడం వల్ల మేము హైవే డ్రైవ్ చేయలేకపోయాము. కానీ హైవే పై లేటరుకి 12 నుండి 14 కి.మీ మైలేజ్ అందిస్తుందని మేము ఆశిస్తున్నాము.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
కొత్త ఆడి ఎ 4 సెడాన్ ధరలు రూ. 42 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతుంది. ఇది లగ్జరీ విభాగంలో ఇది అంత ఖరీదైనది కాదు. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.

ఈ కొత్త ఆడి ఏ 4 సెడాన్ లో హెడ్స్ అప్ డిస్ప్లే , వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి కొన్ని అదనపు ఫీచర్స్ అందించాలని మేము భావిస్తున్నాము. కొత్త ఆడి ఎ 4 సెడాన్ ఈ 2021 నూతన సంవత్సరంలో బ్రాండ్ నుండి విక్రయించబడుతున్న మొదటి ఉత్పత్తి. ఇది భారత మార్కెట్లో సరికొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్ఇ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.