2021 Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లను ఎంచుకోవడానికి అనేక ఆప్సన్స్ ఉన్నాయి. ఎందుకంటే దేశీయ మార్కెట్లో SUV లు మరియు మైక్రో SUV లతో పాటు ఈ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సెగ్మెంట్ కార్లు విరివిగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ వాహన తయారీదారు Honda కొత్త Amaze ను తీసుకువచ్చింది.

Honda Amaze మొదటిసారిగా 2013 లో ప్రారంభించబడింది. ఈ సెడాన్ ప్రారంభించినప్పటి నుంచి దేశీయ మార్కెట్లో Maruti Suzuki Dzire, Ford Aspire వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది. Honda Amaze మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు మంచి ధర కూడా కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలతో ముందుకు సాగింది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా Honda కంపెనీ తన Honda Amaze యొక్క సెకండ్ జనరేషన్ కారుని 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. అయితే ఇది 2021 ఆగష్టు 18 న భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యింది. కొత్త Honda Amaze Facelifted మోడల్‌ లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ అలాగే ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా కొంత అప్డేట్ అయ్యింది.

ఇటీవల మేము కొత్త Honda Amaze Facelifted (హోండా అమేజ్ ఫేస్‌లిఫ్టెడ్) సెడాన్‌ను డ్రైవ్ చేసాము. ఇందులోని ఫీచర్స్, పరికరాలు మరియు పర్ఫామెన్స్ వంటి మరిన్ని వివారాలు మీ కోసం ఈ రివ్యూ ద్వారా..

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Honda Amaze డిజైన్ అండ్ స్టైల్:

కొత్త Honda Amaze అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మార్పులు లేదు, కానీ మీరు కొన్ని సూక్షమైన మార్పులను గమనించవచ్చు.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ కారు యొక్క ముందు భాగంలోని అతిపెద్ద మార్పు కొత్త హెడ్‌ల్యాంప్‌. ఇది పునః రూపకల్పన చేసిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, కావున ఇది ప్రొజెక్టర్‌ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ కూడా కలిగి ఉంటుంది. ఇందులోని డిఆర్ఎల్ C ఆకారంలో ఉండటం వల్ల ఇది మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులో త్రీ స్లాట్ గ్రిల్ అవుట్‌గోయింగ్ మోడల్‌లో లాగా పెద్ద సింగిల్-పీస్ గ్రిల్‌ను కలిగి ఉంది. క్రోమ్ స్ట్రిప్ ఇప్పటికీ అలాగే ఉంది. అయితే ఇది ఇప్పుడు కొంత చిన్నదిగా ఉండి, రెండు లోయర్ స్లాట్‌లు కూడా క్రోమ్ ఎలిమెంట్ పొందుతాయి. హోండా లోగో గ్రిల్ మీద చూడవచ్చు. ఫ్రంట్ బంపర్ దిగువన రెండు ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బోనెట్ మరియు బంపర్ స్ట్రైట్ లైన్స్ మరియు ఫ్లాట్ సర్పేస్ కలిగి ఉంటాయి. ఇదే డిజైన్ అన్నివైపులా ఉంటుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు స్టైలిష్ డ్యూయల్ టోన్, 10-స్పోక్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. ORVM ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ కలిగి ఉంది. మిర్రర్స్ పవర్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్. డోర్ హ్యాండిల్స్ క్రోమ్‌లో పూర్తయ్యాయి. ఇవన్నీ కాంపాక్ట్ సెడాన్‌కు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Honda Amaze యొక్క రియర్ ప్రొఫైల్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో సి ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో చిన్న బూట్ లిప్ ఉంది. రియర్ బంపర్ దిగువన క్రోమ్ స్ట్రిప్ ఉంది, కావున ప్రీమియం లుక్ వస్తుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్:

కొత్త Honda Amaze Facelift యొక్క మందపాటి క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌పై టగ్ చేసి ఓపెన్ చేయగానే, మీకు డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ ఇంటీరియర్ స్వాగతం పలుకుతుంది. లోపలి భాగం బీజ్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులోని సీట్లు లేత గోధుమరంగులో ఉంటాయి, అంతే కాకుండా డోర్స్ మరియు డాష్‌బోర్డ్ దిగువ భాగాలు కూడా ఇదే కలర్ లో ఉంటాయి. అయితే ఇందులోని ఎగువ భాగాలు మరియు సెంటర్ కన్సోల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్ మరియు డోర్స్ పై కొంత శాటిన్ సిల్వర్‌ ఫినిషింగ్ చూడవచ్చు.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

డాష్‌బోర్డ్‌లో అందరి దృష్టిని ఆకర్శించేవి ఏసీ వెంట్. ఇవి ఎత్తుగా ఉంచబడి ఉండటమే కాకుండా, ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. దాని కింద 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెబ్‌లింక్ వంటి ఫీచర్‌లతో లోడ్ చేయబడింది. మీ స్మార్ట్‌ఫోన్‌ని ఈ సిస్టమ్‌కి కనెక్ట్ చేయడం చాలా సులభం.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొత్తం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్సన్స్ అందిస్తుంది. డిజిపాడ్ 2.0 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మీ ఇన్‌కమింగ్ టెక్స్ట్ మెసేజ్‌లను కూడా చదవగలదు. ఇది మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నావిగేషన్‌కు అనుకూలంగా ఉంటుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులో క్లైమేట్ కంట్రోల్స్ మరియు ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ అన్ని కూడా ఇన్ఫోటైన్‌మెంట్ క్రింద ఉంచబడ్డాయి. అయితే ఇందులోని కంట్రోల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. హజార్డ్ లైట్ల కోసం బటన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పక్కన కాకుండా ఇబ్బందికరమైన స్థితిలో ఉంచబడింది, కానీ స్పెషల్ గా కనిపిస్తుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

స్టీరింగ్ వీల్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ కోసం స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లతో వస్తుంది. ఇది గట్టి ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది, కానీ ఇది లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్‌ని కోరుకుంటున్నాము. ఇన్‌స్ట్రుమెంటేషన్ డిజిటల్ అనలాగ్ కన్సోల్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ఫ్యూయెల్ లెవెల్, డిస్టెన్స్ టు ఎంప్టీ, ట్రిప్ మీటర్స్ మరియు ఓడోమీటర్ యొక్క సమాచారాన్ని MID స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

Honda Amaze Facelift ప్రయాణీకుల మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.ఇందులోని సీట్లు ఫాబ్రిక్‌తో అలంకరించబడ్డాయి, అయితే కంపెనీ Amaze టాప్-స్పెక్ వేరియంట్‌లోని సీట్ల కోసం మరింత ప్రీమియం మెటీరియల్స్‌ ఉపయోగించవచ్చు.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులోని డ్రైవర్ సీటు హైట్ అడ్జస్టబుల్ పొందుతుంది. ముందు సీట్లు చెప్పుకోదగ్గ సౌకర్యవంతమైనవి కాదు, అయినప్పటికీ కొంత అనుకూలంగా ఉంటాయి. వెనుక సీట్లలో లెగ్ రూమ్ సరిపోతుంది, కానీ మేము మెరుగైన తై సపోర్ట్ కోరుకుంటున్నాము. హెడ్ ​​రూమ్ అద్భుతంగా ఉండటం వల్ల ప్రయాణ సమయంలో కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ వెనుక సీటులోని మధ్యలో ఉన్న ప్రయాణీకుడు సుదీర్ఘ ప్రయాణాలలో కొంచెం అసౌకర్యంగా ఉండే అవకాశం కూడా ఉంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Honda Amaze Facelift కొన్ని క్యూబిహోల్స్ మరియు స్టోరేజ్ స్పేస్‌లను కలిగి ఉంటుంది. ఇక ఇందులోని బూట్ స్పేస్ విషయానికొస్తే, Honda Amaze 420-లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Dimensions Honda Amaze Facelift
Length 3,995mm
Width 1,695mm
Height 1,498mm
Wheelbase 2,470mm
Boot Space 420 litres
Ground Clearance 165mm
Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇంజిన్ పర్ఫామెన్స్ అండ్ డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

కొత్త 2021 Honda Amaze పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ i-Vtec ఇంజిన్ కాగా, మరొకటి 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

మేము 1.2-లీటర్ i-Vtec ఇంజిన్ కారుని డ్రైవ్ చేసాము. ఇది 88 బిహెచ్‌పి మరియు ఇది 110 ఎన్ఎమ్ టార్క్‌ అందించింది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇక డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులోని మాన్యువల్ వేరియంట్ 98.6 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. అదేవిధంగా సివిటి వేరియంట్ 78.9 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

మేము టెస్ట్ డ్రైవ్ కోసం పెట్రోల్ వేరియంట్ అందుకున్నాము. CVT యొక్క పవర్ డెలివరీ చాలా సరళమైనది, కావున మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ కారులో డ్రైవింగ్ మోడ్‌లు లేవు, కానీ మీరు గేర్‌బాక్స్‌లో D మరియు S మోడ్‌లను పొందుతారు. డి మోడ్‌లో, గేర్లు త్వరగా మారతాయి, క్లస్టర్‌పై పాప్ అప్ అయ్యే ఒక ECO ఇండికేటర్ ఉంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

S మోడ్‌లో, కారు ఎక్కువ సేపు గేర్‌ను కలిగి ఉంటుంది, అంతే కాకుండా త్రాటల్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. మునుపటి తరం మోడల్ మాదిరిగానే, 2021 హోండా అమేజ్ కూడా పాడిల్ షిఫ్టర్‌ను పొందుతుంది.కొత్త అమేజ్‌ మంచి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కావున ఎటువంటి రహదారిలో అయినా సజావుగా ముందుకు సాగుతుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులో ఇన్సులేషన్ కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ మీరు CVT యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కినప్పుడు, ఇంజిన్ నుండి నిరంతరం శబ్దం వస్తుంది. కావున కొంత చికాకు కలుగుతుంది. అయితే NVH లెవెల్స్ ఖచ్చితంగా మెరుగ్గా ఉండవచ్చు. స్టీరింగ్ వీల్ తేలికగా ఉంటుంది మరియు ఇన్‌పుట్‌లకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అయితే, స్మూత్ సస్పెన్షన్ సెటప్ కారణంగా, మీరు స్టీరింగ్ వీల్‌ని గట్టిగా నొక్కితే, కారు వేగం పెరుగుతుంది.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇక కొత్త Honda Amaze యొక్క మైలేజ్ విషయానికి వస్తే, మేము ఈ కారుని తక్కువ సమయం మాత్రమే డ్రైవ్ చేసాము, కావున ఖచ్చితమైన గణాంకాలను వెల్లడించలేకపోయాము. కానీ మాన్యువల్ మరియు CVT లో పెట్రోల్ వెర్షన్ లీటరుకు 18 కిమీ అందిస్తుందని, అదేవిధంగా డీజిల్ ఇంజిన్ మాన్యువల్ వేరియంట్ 24 కిమీ కంటే ఎక్కువని మరియు సివిటి 21 కిమీ అందించగలదని కంపెనీ తెలిపింది. అయితే మేము త్వరలో ఈ మోడల్ ని రోడ్ టెస్ట్ చేస్తాము. అప్పుడు ఖచ్చితమైన గణాంకాలను వెల్లడిస్తాము.

Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Honda Amaze సేఫ్టీ ఫీచర్స్:

Honda Amaze అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో

 • డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు
 • ఆటోమేటిక్ హెడ్‌లైట్ కంట్రోల్
 • రియర్ పార్కింగ్ కెమెరా
 • ఏబీఎస్ విత్ ఈబిడి
 • ఐసోఫిక్స్ మౌంట్‌లు
 • ఇంజిన్ ఇమ్మొబిలైజర్
 • Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  Honda Amaze కీ ఫీచర్లు:

  ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు

  7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్

  స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

  వాయిస్ కమాండ్

  క్రూయిజ్ కంట్రోల్

  ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్స్

  Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  Honda Amaze వేరియంట్స్:

  Honda Amaze మూడు ట్రిమ్ స్థాయిలలో విక్రయించబడింది.

  Honda Amaze వేరియంట్లు:

  • E
  • S
  • VX
  • 'E' వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది, కానీ S మరియు VX వేరియంట్‌లను మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో పొందవచ్చు.

   Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

   Honda Amaze కలర్ ఆప్షన్స్:

   • మెటోరాయిడ్ గ్రే మెటాలిక్
   • రేడియంట్ రెడ్
   • ప్లాటినం వైట్ పెర్ల్
   • లూనార్ సిల్వర్ మెటాలిక్
   • గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
   • మేము గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ కలర్ కారుని డ్రైవ్ చేసాము. ఇది రోడ్డుపై చూపరులను ఎంతగానో ఆకర్షించింది.

    Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

    Honda Amaze ప్రైస్:

    వేరియంట్స్ & ప్రైస్

    Variants Petrol Diesel
    E MT ₹6.32 lakh ₹8.66 lakh
    S MT ₹7.16 lakh ₹9.26 lakh
    S CVT ₹8.06 lakh NA
    VX MT ₹8.22 lakh ₹10.25 lakh
    VX CVT ₹9.05 lakh ₹11.15 lakh
    Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

    ప్రత్యర్థులు మరియు ఫ్యాక్ట్ చెక్:

    భారతదేశంలో కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లకు మంచి పోటీగా ఉంది. కావున దేశీయ మార్కెట్లో Honda Amaze కారు Maruti Suzuki Dzire, Tata Tigor, మరియు Ford Aspire వంటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

    Specifications Honda Amaze Maruti Dzire Tata Tigor Ford Aspire
    Engine 1.2-litre Petrol / 1.5-litre Turbo-Diesel 1.2-litre Petrol 1.2-litre Petrol 1.2-litre Petrol / 1.5-litre Turbo-Diesel
    Power 88bhp / 98bhp 88.5bhp 84.5bhp 95bhp / 99bhp
    Torque 110Nm / 200Nm 113Nm 113Nm 119Nm / 215Nm
    Transmission 5-speed Manual / CVT 5-speed Manual / 5-speed AMT 5-speed Manual / 5-speed AMT 5-speed Manual
    Prices Rs 6.32 lakh to Rs 11.15 lakh Rs 5.98 lakh to Rs 9.02 lakh Rs 5.64 lakh to Rs 7.81 lakh Rs 7.28 lakh to Rs 8.73
    Honda Amaze రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    Honda Amaze వెంటనే మీ దృష్టిని ఆకర్షించదు. కానీ ఇది వినియోగదారుల విశ్వసనీయతకు మరియు తక్కువ ఖర్చుతో నిర్వహించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ హోండా అమేజ్ మునుపటి కంటే చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే కొత్త Honda Amaze అత్యంత ఖరీదైనది. అయితే, ఇది ఇప్పుడు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

Most Read Articles

English summary
New honda amaze review design specs performance interiors features other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X