కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

హోండా కార్స్ ఇండియా మొట్టమొదటి సారిగా భారత మార్కెట్లో 1998లో తమ పాపులర్ సిటీ సెడాన్‌ను ప్రారంభించింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత ప్రీమియం సెడాన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన ఈ మోడల్‌లో ఇప్పటి వరకూ అనేక రిఫ్రెష్డ్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా మరోసారి హోండా తమ సరికొత్త 2020 సిటీ సెడాన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్లతో పాటుగా డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లలో మార్పులు చేర్పులు చేసి ప్రవేశపెట్టిన కొత్త 2020 హోండా సిటీ సెడాన్ మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేసింది. మరి ఈ ఫస్ట్ డ్రైవ్‌లో హోండా సిటీ సెడాన్ ఎన్ని మార్కులు దక్కించుకుందో తెలుసుకునేందుకు ఈ సమీక్షను చూద్దాం రండి..!!

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

డిజైన్ మరియు స్టైల్

ఈ కొత్త కారును ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మునపటి వెర్షన్‌కు దీనికి డిజైన్ పరంగా పెద్ద మార్పు కనిపించదు, ఓవరాల్ సిల్‌హౌస్ ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కొత్త 2020 హోండా సిటీ సెడాన్ 4,549 మిమీ పొడవును, 1,748 మిమీ వెడల్పును, 1,489 మిమీ ఎత్తును మరియు 2,600 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ మార్పుల వలన కొత్త హోండా సిటీ మునుపటి వెర్షన్ కన్నా కొంచెం పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఫలితంగా ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ కాస్తంత విశాలంగా మారుతుంది. అయితే, ఈ కొత్త కారు వీల్‌బేస్ మాత్రం ఇదివరకటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

కొత్త హోండా సిటీ ముందు భాగాన్ని గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మరియు L-ఆకారంలో ఉండే ఎల్ఈడి టర్న్ సిగ్నల్‌తో కూడిన పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ (సిరీస్‌లో ఉంచిన తొమ్మిది లైట్లు) ఉంటాయి. చాలా కార్లలో సాధారణంగా డిఆర్ఎల్‌లు డైనమిక్ ఇండికేటర్లుగా పనిచేస్తాయి, కాని కొత్త సిటీ కారులో డిఆర్ఎల్‌లను హెడ్‌లైట్ పైభాగంలో అమర్చారు క్రింది భాగంలో డైనమిక్ ఎల్ఈడి ఇండికేటర్లను ఉంచారు. ఇవి రెండూ కూడా విడివిడిగా పనిచేస్తాయి.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

కొత్త 2020 హోండా సిటీ కారు సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ఎవరి దృష్టినైనా ప్రధానంగా ఆకర్షించే అంశం 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇది డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో లభిస్తాయి. ఈ కారు మొత్తం కొలతలతో పోల్చినప్పుడు చక్రాల పరిమాణం పరంగా ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాగే, సైడ్స్‌లో షోల్డర్ లైన్స్, క్రీజ్ లైన్స్ మరింత స్పోర్టీగా కనిపిస్తాయి, ఇవి ముందు వైపు హెడ్‌లైట్స్ నుంచి మొదలై వెనుక టెయిల్ లైట్స్ వరకూ ఉంటాయి.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

కారుకి మరింత ప్రీమియం లుక్‌ని జోడించేందుకు, అప్ మార్కెట్ ఫీల్‌ను కలిగించేందుకు కారు మొత్తంలో ఎక్కువగా క్రోమ్ గార్నిషింగ్ కనిపిస్తుంది. కొత్త సిటీ సెడాన్ వెనుక వైపున, ఎడమ భాగంలో 'సిటీ' బ్యాడ్జ్ ఉంటుంది, కుడి వైపున వేరియంట్‌తో పాటు ఐ-విటిఇసి / ఐ-డిటిఇసి బ్యాడ్జింగ్ ఉంటుంది. పార్కింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటుగా పార్కింగ్ కెమెరాను కూడా జోడించారు.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

కొత్త సిటీ సెడాన్‌లో ఉపయోగించిన మరో కెమెరా విషయానికి వస్తే, ఇందులో ఎడమచేతి వైపు సైడ్ మిర్రర్ క్రింది భాగంలో అమర్చిన లేన్ మోనిటరింగ్ కెమెరా ఉంటుంది. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్‌గా ఈ కెమెరా యాక్టివేట్ అయ్యే, అటుగా వచ్చే వాహనాలు/ట్రాఫిక్‌ను సెంటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా చేస్తుంది.

దీని సాయంతో ఎడమ వైపు దారి మారే ప్రతిసారి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌ను మొట్టమొదటి సారిగా 10వ తరం హోండా సివిక్ సెడాన్ కారులో ఉపయోగించారు, ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్ని హోండా కార్లలో ఈ ఫీచర్‌ను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా మార్చేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

ఇంటీరియర్స్ మరియు ప్రాక్టికాలిటీ

ఇక కొత్త హోండా సిటీ సెడాన్‌లో ఇంటీయర్స్‌ను గమనిస్తే, ఇందులో అనేక మార్పులు చేర్పులను చూడొచ్చు. హోండా ఇంటీరియర్ డిజైన్ లాంగ్వేజ్‌ను "యాంబీషియస్ బ్యూటీ"ని తలపించేలా ఉంటుంది. అని పిలుస్తోంది. హోండా సిటీలో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. ఇదొక సెమీ డిజిటల్ రూపం వస్తుంది. ఇందులో స్పీడోమీటర్ అనలాగ్ రూపంలో, టాకోమీటర్ డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇందులో సెగ్మెంట్‌లో కెల్లా మొదటి సారిగా జి-మీటర్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు. కార్నరింగ్ ఫోర్సెస్‌ని కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా పెర్ఫార్మెన్స్ కార్లలో ఇలాంటి ఫీచర్లను ఉపయోగిస్తుంటారు.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

ఈ కొత్త కారులో లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్‌ పట్టుకోవటానికి చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. దానిపై అమర్చిన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌ను ఉపయోగించేందుకు చాలా సులువుగా ఉండి, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను యాక్సెస్ చేసేందుకు అనువుగా ఉంటాయి.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

ఇందులోని 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు సెగ్మెంట్-ఫస్ట్ అలెక్సా రిమోట్ వాయిస్ అసిస్ట్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. కారులో ఈ స్క్రీన్‌ని అమర్చిన స్థానం కొద్దిగా వెనుకకు ఉందని మేము భావించాము, అంటే పొడవైన డ్రైవర్లు తెరపై సూర్యుని కాంతిని ఎదుర్కోవలసి రావచ్చు.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

కొత్త హోండా సిటీలో సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో తయారు చేసిన సరికొత్త డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ లభిస్తుంది. క్యాబిన్‌లో బ్రష్డ్ అల్యూమినియంతో పాటు పియానో ​​బ్లాక్ మెటీరియల్‌తో గార్నిష్ చేశారు. డోర్ హ్యాండిల్స్‌లో కూడా కొంత మేర క్రోమ్ గార్నిష్ ఉంటుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

ఈ కారులో సన్‌రూఫ్ కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇందులోని రూఫ్ లైనర్‌ను మ్యాన్యువల్‌గా తెరవవచ్చు లేదా మూసివేయవచ్చు. సన్‌రూఫ్ తెరవడానికి డ్రైవర్ సైడ్ రీడింగ్ లైట్ వద్ద ఓ ఆటోమేటిక్ స్విచ్ కూడా ఉంటుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

కంఫర్ట్ ఫీచర్ల గురించి మాట్లాడితే.. కొత్త సిటీ సెడాన్ సీట్లు మునుపటి కన్నా అద్భుతంగా అనిపిస్తాయి. ఇందులో స్పోర్టీ బకెట్ సీట్స్ ఉంటాయి, ఇందులో మొత్తని కుషనింగ్‌ ఉంటుంది. గంటల తరబడి కారు నడుపుతున్నటికీ ఈ సీట్లలో కూర్చొని నడపడం సౌకర్యంగా అనిపిస్తుంది. ఈ సీటు మమ్మల్ని ఏమాత్రం అలసిపోయేలా చేయదనేది మా అభిప్రాయం. (మరీ సుదీర్ఘ ప్రయాణాల గురించి చెప్పలేము!). ఇందులో మంచి సైడ్ బోల్స్టరింగ్‌ కూడా ఉంటుంది, ఇది డ్రైవర్ కఠినంగా కార్నరింగ్స్ చేసేటప్పుడు స్థిరంగా ఉంచేందుకు సహకరిస్తుంది. ముందు సీట్లు రెండూ మాన్యువల్‌గా పనిచేస్తాయి, వీటి ఎత్తు సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

వెనుక సీటులో ముగ్గురు వ్యక్తులను సులభం, సౌకర్యంగా కూర్చునేలా డిజైన్ చేశారు. పొడవుగా ఉండే ప్రయాణీకులకు సైతం మంచి హెడ్‌రూమ్ మరియు లెగ్‌రూమ్ ఆఫర్ చేసేలా ఈ సీట్లను డిజైన్ చేశారు. ఒకవేళ వెనుక సీటులో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నట్లయితే, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను ఉపయోగించుకుని, దాని కప్‌హోల్డర్ల సాయంతో పానీయాలను కూడా ఉంచవచ్చు. వెనుక సీట్లలోని ప్యాసింజర్ల కోసం ఎయిర్ కండిషనింగ్ వచ్చేలా రియర్ ఏసి వెంట్స్ కూడా ఉంటాయి. కొత్త సిటీ సెడాన్‌లో విశాలమైన బూట్ స్పేస్ కూడా ఉంటుంది, ఇందులో నలుగురికి సరిపడా లగేజ్‌ను సౌకర్యవంతంగా ఉంచవచ్చు.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

పవర్ మరియు హ్యాండ్లింగ్

సరికొత్త హోండా సిటీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. మేము పెట్రోల్ సివిటి మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లను నడిపాము, అయితే పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌ను మేము డ్రైవ్ చేయలేదు, కాని త్వరలోనే చేస్తాము. పెట్రోల్ వేరియంట్‌లో 1.5-లీటర్ ఐ-విటిఇసి (డిఓహెచ్‌సి) డబుల్ ఓవర్‌హెడ్ కామ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది సిటీ రోడ్లపై నడపటానికి చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. మీరు యాక్సిలరేటర్ పెడల్‌పై అడుగు పెడుతున్నప్పుడు ఇంజిన్ నుండి వచ్చే అధిక రివ్‌లపై స్థిరమైన బజ్ ఉన్నట్లు అనిపిస్తుంది, అయితే, అంత బాధించకపోవచ్చు. కానీ, తక్కువ రివ్స్ వద్ద మాత్రం ఇంజన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

హోండా ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలలో అద్భుతమైన పనితీరును కనబర్చింది. బయటి శబ్ధాన్ని లోనికి రాకుండా ఉంచడంలో ఈ సెడాన్ మెరుగ్గా ఉంటుంది. పెట్రోల్ సివిటి వేరియంట్‌లో మెరుగైన మైలేజ్ కోసం ఇకో డ్రైవింగ్ మోడ్ ఉంటుంది. పరిమిత సమయం ఉన్నందున మేము కారు యొక్క ఖచ్చితమైన మైలేజీని పొందలేకపోయాము, కాని కొత్త సిటీ యొక్క సివిటి వేరియంట్ లీటరుకు 17 నుండి 18 కిమీ వరకు మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. సివిటి వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి, ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత స్పోర్టీగా మారుస్తాయి.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

ఇక డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ ఐ-డిటిఇసి యూనిట్‌ను అమర్చారు. ఇది 100 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆయిల్ బర్నర్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మేము నడిపిన 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కేవలం పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఆప్షనల్‌గా లభిస్తుంది. అధిక టార్క్ అవుట్పుట్ కారణంగా, డీజిల్ వేరియంట్ పెట్రోల్ వేరియంట్ కన్నా స్ట్రాంగ్ మిడ్-రేంజ్‌ని కలిగి ఉంటుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

సాధారణంగా డీజిల్ కార్లు పెట్రోల్ కార్లతో పోల్చినప్పుడు కొంచెం ఎక్కువ క్యాబిన్ నాయిస్‌ని కలిగి ఉంటాయి. అయితే, మేము ఇదివరకు చెప్పినట్లుగానే హోండా ఎన్‌విహెచ్ స్థాయిల విషయంలో చక్కగా పనిచేసిందనే చెప్పాలి. అయినప్పటికీ, ఈ డీజిల్ వేరియంట్‌లో హై రెవ్స్ వద్ద క్యాబిన్‌లో ఇంజన్ శబ్ధం, హమ్మింగ్ సౌండ్ వినిపిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, డీజిల్ మ్యాన్యువల్ వెర్షన్ సిటీ సెడాన్ లీటరుకు 24 కి.మీ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. సమయం తక్కువగా ఉండటం వలన దీని వాస్తవిక మైలేజ్ గణాంకాలను మేము పొందలేక పోయాము.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

ఈ కారులోని సస్పెన్షన్ చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది, ఫలితంగా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి కలుగుతుంది. మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్లపై ఎదురైన అన్న బంప్స్ మరియు డిప్స్‌లను ఈ సస్పెన్షన్లు చక్కగా గ్రహించాయి. స్టీరింగ్ ఇన్‌పుట్ కూడా చాలా సులువుగా అనిపిస్తుంది, కేవలం ఒక్క వేలితో లైను మార్చేంత సులువుగా స్టీరింగ్ ఉంటుంది. హైవేపై స్టీరింగ్ రెస్పాన్స్ మరింత సులువుగా అనిపిస్తుంది.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, సరికొత్త హోండా సిటీ కారులో బెస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ఇందులో హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్, మొత్తం ఆరు ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఎబిఎస్ విత్ ఇబిడి వంటి ఫీచర్లున్నాయి. ఈ కారులో బ్రేక్స్ మమ్మల్ని చక్కగా ఆకట్టుకున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో నైనా కారును సురక్షితంగా నిలపడంలో సహకరించాయి.

కొత్త 2020 హోండా సిటీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - ఫుల్ కార్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గడచిన ఇరవై ఏళ్లలో హోండా సిటీ సెడాన్ భారత మార్కెట్లో అనేక మార్పులను చూసింది. కొత్తగా వచ్చిన ఈ ఐదవ తరం హోండా సిటీ సెడాన్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ కారులో మాకు నచ్చని కొన్ని విషయాలు ఏంటంటే ఇంజిన్ శబ్దం మరియు మృదువైన సస్పెన్షన్. సరికొత్త హోండా సిటీ సెడాన్ ఈ సెగ్మెంట్లోని కొత్త హ్యుందాయ్ వెర్నా, స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, మరియు టొయోటా యారిస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ సెడాన్ అనేక కొత్త ఫీచర్లతో లోడ్ అయినందున, హోండా తమ కొత్త సిటీ సెడాన్ కారును రూ.11.5 నుండి రూ.13 లక్షల మధ్యలో విడుదల చేయవచ్చని మేము భావిస్తున్నాము.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
new 2020 honda city review first drive report details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X