5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

ఫ్రెంచ్ ఫ్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో (Renault) ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ట్రైబర్ ఎంపీవీ కారును లాంచ్ చేసింది. చీపెస్ట్ ధరలో 7-మంది వరకు ప్రయాణించే సామర్థ్యంతో రూపొందించిన రెనో ట్రైబర్ ఎంపీవీ కారును తొలిసారిగా జూన్ 2019లో అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. ఆగష్టు 28న ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

విడుదలైన అనతి కాలంలో భారీ విజయాన్ని అందుకుంది. రెనో సంస్థకు ఎంతో కాలంగా అత్యుత్తమ సేల్స్ సాధించిపెడుతున్న రెనో క్విడ్ సేల్స్‌ను కూడా దాటేసింది. కస్టమర్లు ఈ కారును ఇంతగా ఇష్టపడటానికి గల కారణమేంటో తెలుసా..? కేవలం రూ. 5 లక్షల ప్రారంభ ధరతో లభించే 7-సీటర్ ట్రైబర్ కారు మంచిదేనా..? అసలు దీనిని కొనచ్చా.. కొనకూడదా..? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం డ్రైవ్‍స్పార్క్ బృందం రెనో ట్రైబర్ కారును స్వయంగా నడిపి పరీక్షించింది. ఇవాళ్టి ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో ట్రైబర్ లాభనష్టాలు ఏంటో తెలుసుకుందాం రండి...

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

ఫ్రెష్ డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో రెనో ఇండియా ఒక కొత్త మోడల్‌గా ట్రైబర్ ఎంపీవీని ప్రవేశపెట్టింది. ధర తక్కువే అయినప్పటికీ అధునాతన డిజైన్, సరికొత్త ఫీచర్లు మరియు టెక్నాలజీ కారుకు అత్యంత ఖరీదైన ప్రీమియం ఫీలింగ్ తీసుకొచ్చాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కారును చౌక ధరలో ఎంచుకోనే కస్టమర్లే లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చింది.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

డిజైన్ మరియు స్టైలింగ్

రెనో ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇతర కార్లతో పోల్చుకుంటే రెనో ట్రైబర్ పూర్తిగా కొత్త మోడల్. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో అత్యంత ఆకర్షణీయమైన స్టైలింగ్ ఎలిమెంట్స్ మరియు ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి. క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారును డెవలప్ చేసిన సిఎమ్ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద ట్రైబర్ ఎంపీవీ కారును రూపొందించారు. కారు లోపలి వైపున విశాలంగా ఉన్నప్పటికీ 4-మీటర్ల పొడవులోపే ఉండటం రెనో ట్రైబర్ యొక్క మరో ప్రత్యేకత.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

ట్రైబర్ ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ ఎలిమెంట్లు గల అట్రాక్టివ్ ఫ్రంట్ గ్రిల్, మధ్యలో కంపెనీ లోగో, ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ కూడా అత్యంత ధృడంగా కనిపిస్తుంది. బంపర్‌లోనే మధ్యలో సిల్వర్ స్కఫ్ ప్లేట్ ఉన్న ఎయిర్ ఇంటేకర్ ఉన్నాయి. అదనంగా పగటి పూట ఎల్ఈడీ లైట్లు మరియు ప్రీమియం ఫీలింగ్ కలిగించేలా క్రోమ్ స్టైలింగ్స్ ఉన్నాయి.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

ట్రైబర్ ఎంపీవీ సైడ్ డిజైన్ చూస్తే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. బాక్సీ డిజైన్, విశాలమైన విండోలు మరియు ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ ఉన్నాయి. కారు బాడీ చుట్టూ అంచుల వద్ద ప్లాస్టిక్ క్లాడింగ్స్ మరియు 15-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ కారుకు ఎస్‌యూవీ లుక్ తీసుకొచ్చాయి.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

రెనో ట్రైబర్ రియర్ డిజైన్‌కు పెద్ద పీట వేశారు. ఓ పెద్ద సైజు ఎస్‌‌యూవీలా కనబడుతుంది. రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, బ్రేక్ లైట్లు, రివర్స్ గేర్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు అన్నింటినీ ఒకే సెటప్‍‌లో ఇమిడ్చారు.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

ఇంటీరియర్

రెనో ట్రైబర్ కారు లోపలికి వెళ్లామంటే ఓ లగ్జరీ కారులో ఉన్నామనే ఫీల్ వస్తుంది. బ్లాక్/బీజి డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్. సాఫ్ట్-ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉపయోగించి అత్యుత్తమ క్వాలిటీతో డ్యాష్‌బోర్డ్, డ్యాష్‌బోర్డు పొడవుగా ఉన్న దప్పమైన సిల్వర్ ప్యానల్ క్యాబిన్ మొత్తానికి లగ్జరీ ఫీలింగ్ తీసుకొచ్చారు.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కారు కొనే ప్రతి ఒక్కరూ తప్పకుండా కావాలనుకునే ఫీచర్... టచ్‍స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్. అత్యంత ఖరీదైన కార్లతో పోటీపడేలా.. రెనో ట్రైబర్ కారులో ఎకంగా 8.0-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ డిస్ల్పే ఉంది. దీనికి అనుసంధానంగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్ సపోర్ట్ ఇచ్చారు. డిస్ల్పే క్రింది భాగంలోనే క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

రెనో ట్రైబర్ ఎంపీవీలో విశాలమైన క్యాబిన్ మరియు చక్కటి గాలి సరఫరా కలదు, దీనికి అదనంగా విశాలమైన కిటీకిలు కూడా కలిసొచ్చాయి. క్యాబిన్‌లో పలు చోట్ల అదనపు స్టోరేజ్ స్పేస్, లైట్ కలర్ సీట్లు మరియు అప్‌హోల్‌స్ట్రేను కూడా అందించారు.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

క్యాబిన్‌లో రెండవ, మూడవ వరుస సీటింగ్ విషయానికి వస్తే అన్ని రకాల ఎత్తున్న ప్రయాణికులకు సౌలభ్యంగా అత్యంత సౌకర్యవంతంగా సీటింగ్ సదుపాయం కల్పించారు. తల, కాళ్ల వద్ద మంచి స్పేస్‌ ఇచ్చారు. తొడల వద్ద ఇంకాస్త సపోర్ట్ ఇచ్చేలా సీటును కాస్త వెడల్పుగా అందించే ఉంటే బాగుండేది.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

చివర వరుస విషయానికి వస్తే.. దీనిని ప్రత్యేకించి చిన్న పిల్లల కోసం రూపొందించారని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎత్తు కాస్త తక్కువ ఉన్నోళ్లు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఏదేమైనప్పటికీ వెడల్పాటి కిటీకి అద్దాలు, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్‍లో ఉన్న సీట్లు అసౌకర్యం అనే ఫీలింగ్ అస్సలు రానివ్వవు.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

మూడవ వరుస సీట్లను సులభంగా మడిపేయవచ్చు. ఈ ప్రదేశాన్ని లగేజీ స్పేస్‍లా కూడా వాడుకోవచ్చు. చివరి వరుస సీట్లను 50:50 నిష్పత్తిలో ఫ్లాట్‌గా మలుపుకోవచ్చు. దీంతో ఎంత లగేజీనైనా సులభంగా లోడ్ చేసుకోవచ్చు. ఎంపీవీ కార్లలో ఉన్న ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

ఏడు మంది ప్రయాణించే కెపాసిటీతో రెనో ట్రైబర్ ఎంపీవీలో 84-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంది. మూడవ వరుస సీట్లను పూర్తిగా తొలగించేస్తే ఈ లగేజీ స్పేస్‌ను 625-లీటర్లకు పెంచుకోవచ్చు. రెండో వరుస సీటును 60:40 నిష్పత్తిలో మలుపుకుంటే 1000-లీటర్లకు పైగా లగేజీ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

రెనో ట్రైబర్ ఇంటీరియర్ మొత్తంలో అన్ని సీట్లు బ్లాక్ అండ్ లైట్ క్రీమ్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. సీట్లన్నీ కూడా చేతులకు ఇరువైపులా మంచి సపోర్ట్ ఇచ్చాయి. డ్రైవర్ ‌సీటు కూడా ఎంతో సౌకర్యంగా ఉంది. వెనుక సీట్లు కూడా మంచి సౌకర్యంగానే ఉన్నప్పటికీ తొడల వద్ద ఇంకా మెరుగైన సపోర్ట్ ఇవ్వచ్చు.

5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

రెనో ట్రైబర్ ఎంపీవీ కొలతలు

Length (mm) 3990
Width (mm) 1739
Height (mm) 1643
Wheelbase (mm) 2636
Ground Clearance (mm) 182
Boot Space (litres) 84*
5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

వేరియంట్లు మరియు ఫీచర్లు

రెనో ట్రైబర్ ఎంపీవీ కొనే కస్టమర్లు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. వేరియంట్లు. రెనో ట్రైబర్ ఎంపీవీ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, RXE, RXL, RXT మరియు RXZ. అన్ని వేరియంట్లలో కూడా బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి. కానీ వేరియంట్ లెవల్ పెరిగే కొద్దీ కొన్ని అదనపు ఫీచర్లు వచ్చాయి. అందులో...

  • ప్రొజెక్టర్ హెడ్‍‌ల్యాంప్స్
  • పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు
  • ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ వ్యూవ్ మిర్రర్స్
  • ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
  • ఎలక్ట్రిక్ టెయిల్ గేట్
  • పుష్-బటన్ స్టార్ట్/స్టాప్
  • రెండు, మూడో వరుస సీట్లకు ఏసీ వెంట్స్
  • డ్రైవర్ సైడ్ ఆటోమేటిక్‌గా అప్ అండ్ డౌన్ చేసే అద్దం
  • స్మార్ట్ యాక్సెస్ కార్డ్
  • మూడు వరుసల్లో ఉన్న సీట్లకు 12వోల్ట్ సాకెట్
  • 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

    రెనో ట్రైబర్ సేఫ్టీ ఫీచర్లు

    సేఫ్టీ పరంగా భారత ప్రభుత్వం తప్పనిసరిగా అమల్లోకి తీసుకొచ్చిన ప్రమాణాలను పాటిస్తూ అన్ని కీలక సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించారు. అవి..

    • నాలుగు ఎయిర్ బ్యాగులు(RXZ వేరియంట్లో మాత్రమే)
    • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
    • లోడ్ లిమిటర్/ప్రిటెన్షనర్
    • హైస్పీడ్ అలర్ట్
    • రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • పాదచారుల భద్రత కోసం ప్రత్యేక ఫీచర్
    • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
    • ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్
    • రియర్ వ్యూవ్ కెమెరా (RXZ వేరియంట్లో మాత్రమే)
    • 5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      ఇంజన్ వివరాలు

      రెనో ట్రైబర్ ఎంపీవీ కేవలం ఒక్క పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది. ఇందులోని 1.0-లీటర్ మూడు సిలిండర్ల 999సీసీ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 92ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎనర్జీ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది.

      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      డ్రైవింగ్ అనుభవం

      ట్రైబర్‌లోని పవర్ ఫుల్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అత్యంత చురుకైనది. ఇంజన్ స్పీడ్ 3000rpm దాటితే మరింత పవర్ లభిస్తుంది. ట్రైబర్ కోసం 1.0-లీటర్ ఇంజన్‌ను కాస్త ఎక్కువ పవర్ ఇచ్చేలా ట్యూనింగ్ చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో తేలికగా వెళుతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. డ్రైవ్ చేస్తున్నంత సేపూ ఇంజన్ సౌండ్ వినపడుతూనే ఉంటుంది.

      నిజానికి 5 మంది ప్యాసింజర్లు ప్రయాణించడానికి ఈ ఇంజన్ సరిపోతుంది. కానీ ఇది ఎంపీవీ కావడంతో, దీనికి కొసరుగా అత్యధిక లగేజీ స్పేస్ కూడా అందివ్వడంతో స్పీడ్ పెంచుకునేందుకు మొదట్లో యాక్సిలరేషన్ ఎక్కువగానే చేయాల్సివచ్చింది.

      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కొన్నిసార్లు ఎక్కువగా కుదుపులకు గురైనట్లు అనిపిస్తుంది. ఇంజన్ ‌పవర్‌కు అనుగుణంగా స్పీడ్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకు మాటిమాటికీ గేర్లు మార్చాల్సి వస్తుంది. రెనో ట్రైబర్‌లో త్వరలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందిస్తామని ప్రకటించారు.

      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      రెనో ట్రైబర్ ఎంపీవీ అసలైన పనితీరు రైడ్ హ్యాండ్లింగ్‌లో బయటపడింది. ట్రైబర్ స్టీరింగ్ ఎంతో తేలికగా.. అంతే వేగంగా స్పదిస్తుంది. అత్యంత కఠిమైన ట్రాఫిక్, ఇరుకైన రోడ్లు మరియు హైవేల్లో సులభంగా స్టీరింగ్ చేయగలిగాం.

      రెనో ట్రైబర్ సౌకర్యవంతమైన మరియు ఒత్తిడి లేని డ్రైవింగ్ ఫీల్ కలిగిచింది ఆ నమ్మకంతోనే ఎలాంటి వేగం వద్దనైనా ఎలాంటి భయం లేకుండా దర్జాగా యాక్సిలరేటర్‌కు పనిచెబూతూనే ఉంటాం. అత్యుత్తమ సస్పెన్షన్ సిస్టమ్ ఇవ్వడంతో ప్రతి ప్రయాణాన్ని ఎంతో కంఫర్ట్‌గా మలిచింది. బ్రేక్స్ విషయానికి వస్తే ఎలా హెవీ బ్రేకింగ్ నుండి సింపుల్ బ్రేకింగ్ వరకు గొప్ప నమ్మకాన్నిస్తుంది.

      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      ఇంజన్ వివరాలు

      Engine 1.0-litre petrol
      Power (bhp) 70
      Torque (Nm) 92
      Transmission 5MT/AMT
      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      ధర, పోటీ మరియు కొన్ని నిజాలు

      రెనో ట్రైబర్ ఎంపీవీ ప్రారంభ వేరియంట్ RXE ధర రూ. 4.95 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ RXZ ధర రూ. 6.95 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. రెనో ఇండియయై లైనప్‍లో ఎంపీవీ కింద వచ్చిన ట్రైబర్ కారు మార్కెట్లో ఉన్న డాట్సన్ గో+ మరియు మారుతి సుజుకి ఎర్టిగా మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      ఏ కారు బెస్ట్?

      స్పెసిఫికేషన్స్/మోడల్

      రెనో ట్రైబర్ డాట్సన్ గో+

      మారుతి ఎర్టిగా

      ఇంజన్

      1.0-litre Petrol 1.2-litre Petrol 1.5-litre Petrol (BS-VI)
      పవర్ (బిహెచ్‍పి)

      70 67 104
      టార్క్ (ఎన్ఎమ్)

      92 104 138
      ట్రాన్స్‌మిషన్

      5MT 5MT 5MT/4AT
      ప్రారంభ ధర*

      Rs 4.95 Lakh Rs 3.86 Lakh Rs 7.55 Lakh

      *అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

      5 లక్షలకే 7-సీటర్ రెనో ట్రైబర్: కొనచ్చా.. కొనకూడదా..?

      చివరగా.. రెనో ట్రైబర్‌ కారుపై మా అభిప్రాయం!

      రెనో ఇండియన్ మార్కెట్లోకి నిలదొక్కుకోవడానికి చేసిన ట్రైబర్ కారు ప్రయత్నం చాలా గొప్పది. రెనో ట్రైబర్ కాంపాక్ట్ ఎంపీవీ అత్యుత్తమ రైడ్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. శక్తివంతమైన మరియు చురుకైన పెట్రోల్ ఇంజన్ కూడా సంతృప్తినిస్తుంది. రోజువారీ అవసరాల నుండి సరదాగా చేసే లాంజ్ జర్నీ వరకు అన్ని రకాల ప్రయాణాలకు ప్రత్యేకించి ఫ్యామిలీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది.

      5 నుండి 6.5 లక్షల ధరల రేంజ్‌లో ప్రస్తుతం హ్యాచ్‍బ్యాక్ కార్లు మాత్రమే లభిస్తున్నాయి. ఈ ధరలో 7-మంది వరకు ప్రయాణించే ఎంపీవీ రావడంతో కస్టమర్లు కూడా రెనో ట్రైబర్ కారు మీద ఎక్కువ ఆసక్తికనబరుస్తాయి.

Most Read Articles

English summary
Renault Triber First Drive Review — The Budget Friendly MPV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X