Skoda Slavia ఫస్ట్ లుక్ రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి 'స్కోడా ఇండియా' (Skoda India). కంపెనీ మొదటి నుంచి కూడా దేశీయ మార్కెట్లో అద్భుతమైన సెడాన్‌లను అందిస్తూనే ఉంది. మొదటి సారి స్కోడా ఆక్టావియా (Skoda Octavia) తో రంగప్రవేశం చేసింది. ఆక్టావియా దేశీయ విఫణిలో చాలామందికి ఇష్టమైన సెడాన్. ఇప్పటికి కూడా స్కోడా ఆక్టావియా మంచి ప్రజాదరణ పొందుతూనే ఉంది.

తరువాతి కాలంలో స్కోడా లారా, సూపర్బ్ మరియు ర్యాపిడ్ వంటివి వాటిని విడుదల చేసింది. ఇవన్నీ కూడా మార్కెట్లో తమ వంతు విజయం సాధించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు కంపెనీ మరొక కొత్త సెడాన్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త సెడాన్ పేరు 'స్కోడా స్లావియా' (Skoda Slavia). స్కోడా స్లావియా అనేది స్కోడా రాపిడ్‌కు ప్రత్యామ్నాయం. రాపిడ్ ఒక అద్భుతమైన మిడ్-సైజ్ సెడాన్, అయితే ఈ సెడాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి స్లావియా పుట్టుకొస్తుంది. స్లావియా పేరు చెక్‌లో 'గ్లోరీ' అని అర్థం వస్తుంది.

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్లావియా సెడాన్ ను మేము ఇటీవల సందర్శించాము, ఈ సెడాన్ గురించి మరింత సమాచార ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

Skoda Slavia డిజైన్ అండ్ స్టైల్:

Skoda Slavia చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది చాలా వరకు సాధారణ డిజైన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో క్రోమ్ సరౌండ్‌తో కూడిన సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్ ఉంది. గ్రిల్ సొగసైన హెడ్‌ల్యాంప్‌లతో ఉంటుంది. హెడ్‌ల్యాంప్‌లు స్లావియా యొక్క ఫ్రంట్ ఎండ్‌కు మరింత ఆకర్షణీయమైన డిజైన్ అందిస్తాయి. ఇది ఎల్ఈడీ యూనిట్ మరియు వాటి లోపల ఎల్-ఆకారపు LED DRL లను కలిగి ఉంటుంది.

Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

స్లావియా యొక్క ఫ్రంట్ బంపర్ కొన్ని కట్స్ అండ్ క్రీజెస్ మరియు హానీ కూంబ్ ఎలిమెంట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులోని వృత్తాకార ఫాగ్ ల్యాంప్‌లు హాలోజన్ బల్బ్ ద్వారా శక్తిని పొందుతాయి. అంతే కాకుండా ఫాగ్ ల్యాంప్‌ల దగ్గర ఒక ఇన్వెర్టడ్ ఎల్ షేప్ ఎలిమెంట్ చూడవచ్చు. ఈ సెడాన్ యొక్క బానెట్‌లో కొన్ని క్యారెక్టర్ లైన్‌లు ఉన్నాయి. ఇవి సెడాన్‌ను మరింత అద్భుతంగా చూపిస్తాయి.

Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

స్కోడా స్లావియా యొక్క సైడ్ ప్రొఫైల్‌లో మరిన్ని క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. దిగువ విండో లైన్ క్రోమ్‌లో పూర్తయింది మరియు ఇది C-పిల్లర్ దగ్గర కొద్దిగా బూమరాంగ్ ఆకారంలో ముగుస్తుంది. డోర్ హ్యాండిల్స్‌పై కూడా క్రోమ్ స్ట్రిప్ ఉంది. అదేవిధంగా, రూఫ్‌లైన్ వెనుక వైపు వాలుగా ఉంటుంది మరియు ఇది స్పోర్టి కూపే లాంటి వెనుక భాగాన్ని సృష్టిస్తుంది.

Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

ఇందులో షార్క్ ఫిన్ యాంటెన్నాను కూడా పొందుతుంది. స్కోడా స్లావియా 16 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. మేము యాక్సెస్ చేసిన కారులో డ్యూయల్-టోన్ డైమండ్-కట్ వీల్స్ ఉన్నాయి. స్లావియా సెడాన్ లో మూడు అల్లాయ్ వీల్ ఆప్సన్ ఉంటుందని కంపెనీ తెలిపింది. కావున ఇది మంచి ఆకర్షణీయమైన మరియు అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

Skoda Slavia వేరియంట్స్ మరియు కలర్స్:

స్కోడా స్లావియా మూడు వేరియంట్లలో మరియు ఐదు విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది.

వేరియంట్‌లు:

 • యాక్టివ్
 • యాంబిషన్
 • స్టైల్
 • Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

  స్కోడా స్లావియా కలర్ ఆప్సన్స్:

  • టోర్నోడా రెడ్
  • కాండీ వైట్
  • కార్బన్ స్టీల్
  • రిఫ్లెక్స్ సిల్వర్
  • క్రిస్టల్ బ్లూ
  • Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   ఇందులో కార్బన్ స్టీల్ కలర్ చాలా క్లాస్ గా మరియు సొగసైనదిగా కనిపిస్తుంది. అయితే టోర్నాడో రెడ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మేము కాండీ వైట్ మరియు రిఫ్లెక్స్ సిల్వర్‌లను వ్యక్తిగతంగా చూడలేకపోయినప్పటికీ, మేము క్రిస్టల్ బ్లూ షేడ్‌ను పూర్తిగా టెస్ట్ చేసాము. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి, ఇది స్కోడా స్లావియాకు ఒక ప్రత్యేకమైన కలర్ అని చెప్పాలి.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   స్కోడా స్లావియా కాక్‌పిట్ అండ్ ఇంటీరియర్:

   స్కోడా కార్లు సాధారణంగా వాటి అద్భుతమైన డిజైన్ మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్‌లకు ప్రసిద్ధి చెందాయి. స్లావియా కూడా దీనికి ఏ మాత్రం మినహాయింపు కాదు. స్లావియా డోర్ ఓపెన్ చేయగానే, మీకు విశాలమైన, డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ మీకు స్వాగతం పలుకుతుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   స్లావియా సెడాన్ లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది స్కోడా కుషాక్ నుండి తీసుకోబడింది, అంతే కాకుండా ఇందులో మ్యూజిక్ మరియు కాల్స్ కోసం కంట్రోల్స్ కలిగి ఉంటుంది. సిల్వర్ కలర్ లో పూర్తి చేసిన స్టీరింగ్ వీల్‌పై ఉన్న ముడుచుకున్న నాబ్‌లు ఈ సెడాన్‌కు ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. ఇది 7-స్పీడ్ DSG తో టాప్-స్పెక్ మోడల్ అయినందున, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉన్నాయి.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   స్లావియా సెడాన్ 8 ఇంచెస్ TFT స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కలిగి ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిస్టెన్స్ టూ ఎంప్టీ, కరెంట్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ఫ్యూయెల్ లెవెల్, ఓడోమీటర్, స్పీడోమీటర్ మొదలైన వాటి సమాచారాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఇది చాలా ఫ్రీమియంగా మరియు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   డ్యాష్‌బోర్డ్ హార్డ్-టచ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది, ఈ డ్యాష్‌బోర్డ్‌లో సెంటర్ స్టేజ్ లో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ కోసం పూర్తి కనెక్టివిటీ సూట్‌ను కూడా పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్కార్ప్లే ఫీచర్లను కలిగి ఉంది. ధ్వని అధిక-నాణ్యత స్పీకర్ల ద్వారా పునరుత్పత్తి చేయబడుతుంది. ఇందులోని టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌లో సబ్-వూఫర్ కలిగి ఉంటుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద సెంటర్ AC వెంట్స్ ఉన్నాయి. వాటి క్రింద ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ ఉంటాయి. AC ని కంట్రోల్ చేయడానికి బటన్‌లు, స్లైడర్‌లు లేదా నాబ్‌లు లేవు, అయితే ఇది పని చేయడానికి హాప్టిక్ టచ్ ప్యానెల్‌ను పొందుతుంది. AC కంట్రోల్ ప్యానెల్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌పై టచ్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకూండా వీటిని ఉపయోగించడం చాలా సులభం.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   సెంటర్ కన్సోల్ ప్రీమియంగా అనిపిస్తుంది మరియు గేర్ లివర్‌కి లెదర్ బూట్ లభిస్తుంది. గేర్ లివర్ చుట్టూ ఉన్న పియానో ​​బ్లాక్ ప్యానెల్ సెడాన్ యొక్క వివిధ విధులను నియంత్రించే కొన్ని బటన్లను కూడా కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ యొక్క రెండు చివర్లలోని AC వెంట్‌లు డ్యాష్‌బోర్డ్, ఇంటిగ్రేటెడ్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. మొత్తానికి ఇది అద్భుతమైన ఇంటీరియర్ కలిగి ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   Skoda Slavia చాసిస్, ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్:

   కొత్త స్కోడా స్లావియా MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అంతే కాకూండా స్కోడా యొక్క ఇండియా 2.0 క్రింద ప్రారంభించబడిన రెండవ ఉత్పత్తి ఈ స్లావియా. ఇది భారతీయ మార్కెట్ కోసం అనుకూలీకరించిన గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

   స్కోడా స్లావియాలో కనిపించే ఇంజన్ మరియు గేర్‌బాక్స్ అన్నీ కూడా స్కోడా కుషాక్ నుండి నేరుగా తీసుకోబడ్డాయి. ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ మరియు మూడు ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. స్కోడా స్లావియాను 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంటుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   ఇందులోని 1.0 లీటర్ త్రీ-సిలిండర్ యూనిట్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113.5 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ మధ్య 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌ను 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ యూనిట్. ఇది ఇది 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి పవర్ మరియు కేవలం 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG కి జత చేయబడి ఉంటుంది. స్కోడా స్లావియా మిస్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన కారుగా అవతరించింది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   Skoda Slavia కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

   Skoda Slavia అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మేము స్కోడా స్లావియాను ఇంకా డ్రైవ్ చేయలేదు, కావున డ్రైవింగ్ పర్ఫామెన్స్ గురించి పూర్తిగా విశ్లేషించలేకపోయాము. అయితే త్వరలో మేము ఈ కొత్త సెడాన్ డ్రైవ్ చేస్తాము. అప్పుడు డ్రైవింగ్ పర్ఫామెన్స్ గురించి పూర్తి సమాచారం అందిస్తాము. అప్పటివరకు వేచి ఉండక తప్పదు.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   స్కోడా స్లావియాలోని అన్ని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. అయితే, ముందు సీట్లలో వెంటిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. వెనుక భాగం కూడా విశాలంగా ఉంటుంది. స్కోడా స్లావియా 2,651 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది, ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా ఉంది మరియు ఇది ప్రయాణీకులకు కావలసినంత లెగ్‌రూమ్ మరియు క్నీ రూమ్ అందుబాటులో ఉంటుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   స్కోడా స్లావియా 1,752 మిమీ వెడల్పు కలిగి ఉంది, ఇది ఈ విభాగంలో అతిపెద్దది కావున, ఇందులో ముగ్గురు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. ఇందులో వెనుక ప్రయాణీకుల కోసం ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ను కూడా పొందుతారు, అదే విధంగా ఇందులో కప్‌హోల్డర్‌లు కూడా ఉన్నాయి. ఇది స్లావియాలోని స్టోరేజీ స్పేస్‌లు మరియు క్యూబీహోల్స్‌ కూడా ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది మరియు సెంటర్ కన్సోల్, డోర్ పాకెట్స్‌లో స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి. వెనుక సీటులో హాచ్ ద్వారా బూట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   స్కోడా స్లావియా 521 లీటర్ల బూట్ స్పేస్‌ను పొందుతుంది. ఇది మరోసారి సెగ్మెంట్‌లో అతిపెద్ద బూట్ స్పేస్ కలిగిన సెడాన్. వెనుక సీటును ఫోల్డ్ చేయవచ్చు. ఇది పూర్తయిన తర్వాత, స్కోడా 1,050 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తుంది. స్కోడా స్లావియా సెడాన్ ఖచ్చితంగా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది, మరియు మంచి ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్ లను అందిస్తుంది కావున వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

   Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

   Skoda Slavia సేఫ్టీ ఫీచర్స్:

   Skoda Slavia అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో

   • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
   • ఏబీఎస్ విత్ ఈబిడి
   • ట్రాక్షన్ కంట్రోల్
   • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
   • హిల్ స్టార్ట్ అసిస్ట్ & హిల్ హోల్డ్ కంట్రోల్
   • యాంటీ-స్లిప్ రెగ్యులేషన్ మరియు మోటార్ స్లిప్ రెగ్యులేషన్‌తో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్
   • రోల్‌ఓవర్ ప్రొటక్షన్
   • ఐసోపిక్స్ సీట్లు
   • Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలో రోజురోజుకి అద్భుతమైన ఫీచర్స్ తో ఎన్నో వాహనాలు విడుదలవుతున్నాయి. ఈ సమయంలో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో స్కోడా స్లావియా విడుదల కానుంది. స్కోడా స్లావియా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ప్రీమియంగా కూడా అనిపిస్తుంది.

    Skoda Slavia రివ్యూ: డిజైన్, ఫీచర్స్ & ఫుల్ డీటైల్స్

    స్కోడా స్లావియా ధర గురించి కంపెనీ ఇప్పటి వరకు అధికారిక సమాచారం విడుదల చేయలేదు. త్వరలో కంపెనీ ఈ సెడాన్ కి సంబంధించిన ధర అధికారికంగా విడుదల చేస్తుంది. స్లావియా భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటీతో పోటీ పడుతోంది. మేము త్వరలో స్లావియాను రోడ్ టెస్ట్ చేస్తాము, అప్పటి వరకు మీరు వేచి ఉండాలి. వాహన ప్రియులు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Skoda slavia telugu review interiors features specs engine performance driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X