టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

భారత మార్కెట్లో ప్రముఖ వాహనతయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. టాటా ఆల్ట్రోజ్ బ్రాండ్ యొక్క సరికొత్త 'ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్' (ఆల్ఫా) ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కింద, టాటా తదుపరి అన్ని చిన్న మరియు మధ్యతరహా మోడళ్లను తయారు చేస్తుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఈ టాటా అల్ట్రోజ్ అత్యంత అధునాతన లక్షణాలతో ప్రీమియం క్యాబిన్ కలిగి ఉంది. టాటా అల్ట్రోజ్ కారు బిఎస్ 6 కంప్లైంట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ యొక్క అనుభవం ఏవిధంగా ఉంటుంది అనే విశ్శ్యాన్ని ఏ రోజు మేము ఇక్కడ చెప్పబోతున్నాము. టాటా ఆల్ట్రోజ్ గురించి మరింత సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

డిజైన్ మరియు ఫీచర్స్ :

టాటా మోటార్స్ సంస్థ యొక్క ‘ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్న రెండవ ఉత్పత్తి ఆల్ట్రోజ్. ఇందులో మొదటి ఉత్పత్తి హారియర్ ఎస్‌యూవీ. టాటా అల్ట్రోజ్ కారు యొక్క రూపకల్పన దాని పోటీదారులతో పోలిస్తే మరింత దూకుడుగా అనిపించడమే కాకుండా ఇది మరింత ప్రీమియం అనుభవాన్ని ఇస్తుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ యొక్క ముందు భాగంలో లో బీమ్ కోసం ప్రొజెక్టర్ మరియు హై బీమ్ కోసం రిఫ్లెక్టర్ కలిగి ఉన్న సొగసుగా కనిపించే ఫాగ్ హెడ్‌లైట్ల యూనిట్లను కలిగి ఉంది. అల్ట్రోజ్ యొక్క బంపర్ యొక్క దిగువ భాగంలో ఫాగ్ లైట్ పక్కన ఉంచిన డీఆర్‌ఎల్‌లు తప్ప మిగతా ఎల్‌ఈడీ లైట్ లేదు.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ షార్ప్ లైన్‌లో బోనెట్ కూడా ఉంది, ఇది షార్క్-నోస్ డిజైన్ మరియు బ్లాక్ గ్రిల్‌ను కలిగి ఉంది. కారు యొక్క ముందు వైపు క్రోమ్ గార్నిషింగ్ యొక్క సన్నని స్ట్రిప్ ఉంది, ఇది కారు ముందు నుండి ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా ఆల్ట్రోజ్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది హ్యాచ్‌బ్యాక్‌కు స్పోర్టి వైఖరిని ఇచ్చే టాప్ విండో లైన్‌ను పొందుతుంది. విండో లైన్ వెనుక భాగంలో బ్లాక్ ఫినిషింగ్ ఉంది. టాటా అల్ట్రోజ్‌లో 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ లేజర్-కట్ అల్లాయ్ వీల్స్‌తో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి, ఇవి కారు మొత్తం రూపాన్ని పూర్తి చేస్తాయి.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ వెనుక డోర్ హ్యాండిల్స్ సి-పిల్లర్‌తో అనుసంధానించబడి, హ్యాచ్‌బ్యాక్‌కు శుభ్రమైన మరియు స్పోర్టి ప్రొఫైల్‌ను ఇస్తాయి. డోర్స్ గురించి మరొక విషయం ఏమిటంటే అవి 90 డిగ్రీల వరకు తెరుచుకుంటాయి, ముందు మరియు వెనుక ప్రయాణీకులు లోపలికి ప్రవేశించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ వెనుక ప్రొఫైల్ విషయానికొస్తే కారు సొగసుగా కనిపించే టెయిల్ లైట్ యూనిట్ల సమితిని పొందుతుంది. అవి కూడా బ్లాక్ గా ఉంటాయి. వెనుక భాగంలో పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌లు పుష్కలంగా ఉన్నాయి, మరియు క్రోమ్ ఫినిషింగ్ ఉన్న ఏకైక విషయం బూట్ మధ్యలో ఉన్న ఆల్ట్రోజ్ మరియు టాటా బ్యాడ్జింగ్.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

మొత్తంమీద టాటా ఆల్ట్రోజ్ చాలా అద్భుతంగా కనిపించడమే కాకుండా చాలా స్పోర్టిగా కూడా ఉంటుంది. ఈ కారులో షార్ప్ లైన్స్ మరియు క్రీజులు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా చాలా తక్కువ మొత్తంలో ఉన్న క్రోమ్ దాని స్పోర్ట్‌నెస్‌ను మరింత పెంచుతుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

ఇంటీరియర్ & ఫీచర్స్ :

కారు లోపలికి అడుగు పెట్టగానే మీకు విశాలమైన క్యాబిన్ కనిపిస్తుంది. టాటా అల్ట్రోజ్ యొక్క ఇంటీరియర్‌లో స్థలం పుష్కలంగా ఉంది. టాటా అల్ట్రోజ్ క్యాబిన్ ఇతర టాటా మోడళ్లలో కనిపించని ప్రీమియం-నెస్‌ను అందిస్తుంది. డాష్‌బోర్డ్ ప్రీమియం సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లతో అందించబడింది మరియు సెంటర్ కన్సోల్‌లోని బటన్లు ఆకర్షణీయంగా మరియు ఉపయోగకరంగా ఉంటాయి.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ ఇంటీరియర్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. ఈ సిస్టం లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. డాష్‌బోర్డ్‌లో అబియంట్ లైటింగ్ ఉంటుంది. మౌంటెడ్ కంట్రోల్స్ తో స్పోర్టి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

త్రీ స్పోక్ వీల్ లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మౌంటెడ్ కంట్రోల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రైట్ సైడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు క్రూయిస్ కంట్రోల్ సెట్టింగులు కలిగి ఉంటుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

ఈ కారు యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇది సెమీ డిజిటల్ కన్సోల్. ఇది అనలాగ్ స్పీడోమీటర్‌ను కూడా కలిగి ఉంటుంది, మిగిలిన సమాచారంతో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇది డ్రైవర్ టాకోమీటర్, గేర్ ఇండికేటర్, పరిధి మరియు ఇతర సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ ఇంటీరియర్‌లోని ప్రీమియం ఫాబ్రిక్ సీట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకులు కూడా స్లైడింగ్ సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్‌లను పొందుతారు, ఇది మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అడ్జస్టబుల్ తో ఇది మంచి సీటింగ్ స్థానాన్ని కలిగి ఉంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

ఈ కారు వెనుక సీట్ల యొక్క హెడ్‌రూమ్ మరియు లెగ్‌రూమ్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది, ప్రత్యేకించి మీరు 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే ఇది కొంత కఠినంగా ఉంటుంది. వెనుక సీట్లలో సీట్లలో ముగ్గురు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చు. వెనుక ప్రయాణీకులకు సెంటర్ ఆర్మ్‌రెస్ట్ లభిస్తుంది. అంతే కాకుండా వెనుక భాగంలో ఎసి వెంట్స్ కూడా ఉంటాయి.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ కారులో 345-లీటర్ బూట్ స్పేస్ కలిగి ఉంది. ప్రయాణించేటప్పుడు మరియు షాపింగ్ చేసిన తరువాత లగేజ్ ఉంచడానికి మీకు ఎక్కువ స్థలం అవసరమైతే, 60:40 స్ప్లిట్ వెనుక సీటు మడవబడుతుంది, బూట్ స్థలాన్ని 665 లీటర్ల వరకు పెంచుతుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

ఈ కారు సెన్సార్‌లతో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరాను పొందుతుంది. ఇది అనుకూల మార్గదర్శకాలను కూడా కలిగి ఉంటుంది. మార్గదర్శకాలు చాలా ఖచ్చితమైనవి మరియు గట్టి ప్రదేశాలలో పార్క్ చేయడానికి సహాయపడతాయి.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

ఇంజిన్ & హ్యాండ్లింగ్ :

టాటా ఆల్ట్రోజ్ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. టాటా నెక్సాన్ కారులో కూడా అదే ఇంజిన్ వ్యవస్థాపించబడింది. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి పవర్ మరియు 1250 - 3000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

సిటీలో డ్రైవింగ్ చేసేస్తాప్పుడు ఇంజిన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. లైట్-క్లచ్ భారీ ట్రాఫిక్ మధ్య కూడా సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ హైవేలలో మంచి పనితీరును కనబరుస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని గేర్ షిఫ్ట్‌లు మృదువైనవి కావు, డ్రైవర్ త్వరగా ఊహించిన విధంగా గేర్ మార్పులు చేయలేరు.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

ఈ కారు యొక్క డ్రైవ్ మోడ్‌ల విషయానికొస్తే, సిటీ మోడ్‌లో థొరెటల్ స్పందన మంచిగా ఉన్నప్పుడు, ఎకో మోడ్‌లోని కారు నిజంగా నెమ్మదిగా ఉంటుంది. సిటీ మోడ్ రెండు డ్రైవ్ మోడ్‌లలో చాలా అనుకూలమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ యొక్క సస్పెన్షన్ హైవే వేగానికి బాగా సరిపోతుంది. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాలు రోడ్లలో డ్రైవింగ్ కొంత కఠినతరంగా ఉంటుందనే చెప్పాలి. కానీ టాటా అల్ట్రోజ్ కార్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులో ఎబిఎస్ కూడా ఇవ్వబడుతుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ కారు యొక్క ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇందులోని 'ఆల్ఫా' ప్లాట్‌ఫాం, ఇది వేగంపై మంచి నియంత్రణను కలిగి ఉంది. అలాగే ఈ కారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది.

స్టీరింగ్ వీల్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎక్కువ వేగంగా వెళ్ళేటప్పుడు మరియు తక్కియూయువా వేగంలో వెళ్ళేటప్పుడు ఇది చాలా సులభంగా నిర్వహించగలుగుతుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా అల్ట్రోజ్ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనేది చాలామంది వినియోగదారుల ప్రశ్న. టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నగరాల్లో లీటరుకు 14 నుండి 17 కి.మీ మరియు హైవేపై 19 నుండి 22 కి.మీ మధ్య ఉటుంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ ధర ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది అద్భుతమైన ఫ్యామిలీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఈ టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. లోపలి భాగంలో స్థలం పుష్కలంగా ఉంది.

టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో టయోటా గ్లాంజా, హ్యుందాయ్ 20, వోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో సురక్షితమైన ఫ్యామిలీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలనుకునే వారికి టాటా అల్ట్రోజ్ మంచి ఎంపిక అవుతుంది. టాటా అల్ట్రోజ్ ఎన్‌సిఎపి టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ కూడా కైవసం చేసుకుని సురక్షితమైన వాహనాల జాబితాలో నిలిచింది.

Most Read Articles

English summary
Tata Altroz BS6 Diesel Review. Read in Telugu.
Story first published: Wednesday, December 9, 2020, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X