టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ కంపెనీ యొక్క బ్రాండ్ న్యూ మోడల్ మరియు కంపెనీ యొక్క మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌‌బ్యాక్. టాటా అల్ట్రోజ్ కారును జనవరిలో 2020లో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల టాటా అల్ట్రోజ్ కారును ఫస్ట్/టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు లభించింది.

ఇవాళ్టి టాటా అల్ట్రోజ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ స్టోరీలో మా డ్రైవింగ్ అనుభవంతో కూడిన కంప్లీట్ రివ్యూతో పాటు అస్సలు దీనిని కొనచ్చో.. కొనకూడదో వివరంగా చూద్దాం రండి..

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా మోటార్స్ సరికొత్త అల్ట్రోజ్ కారును 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 45X పేరుతో కాన్సెప్ట్ వెర్షన్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఆ తర్వాత జరిగిన జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ప్రొడక్షన్ వెర్షన్ అల్ట్రోజ్ కారును ప్రవేశపెట్టి, ఇప్పుడు 2020 జనవరిలో పూర్తి స్థాయిలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ టాటా మోటార్స్ పరిచయం చేస్తున్న మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అంతే కాకుండా, టాటాకు చెందిన "ఆల్ఫా" ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద వచ్చిన మొట్టమొదటి మోడల్ కూడా ఇదే. ఇదే ఫ్లాట్‌ఫ్లామ్ మీద పలు రకాల మిడ్-సైజ్ మోడళ్లను కూడా అభివృద్ది చేయనున్నారు.

టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ డిజైన్ & స్టైలింగ్

టాటా "ఇంపాక్ట్ 2.0" డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా వచ్చిన మొదటి మోడల్ టాటా హ్యారీయర్ కాగా, రెండో మోడల్ టాటా అల్ట్రోజ్. డిజైన్ పరంగా ఇతర మోడళ్లతో పోల్చుకుంటే షార్ప్ డిజైన్, అగ్రెసివ్ లుక్ మరియు ప్రీమియం స్టైల్ దీని సొంతం.

ఫ్రంట్ డిజైన్‌తో మొదలుపెడితే, ముందువైపుకు వాలుగా ఉన్న బానెట్, షార్ప్ డిజైన్, క్లియర్ స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, మధ్యలో చిన్నగా ఉన్న ఫ్రంట్ గ్రిల్‌ కారుకు అత్యంత ఆకర్షణీయమైన రూపాన్నిచ్చాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఫ్రంట్ డిజైన్‌లో గ్రిల్‌కు పైభాగంలో దప్పమైన క్రోమ్ పట్టీ రెండు హెడ్‌ల్యాంప్స్‌ను తాకుతూ మధ్యలో ఉంది. వీటన్నింటి మధ్య క్రోమ్ మెటీరియల్‌తో చేయబడిన టాటా బ్రాండ్ లోగో ఫ్రంట్ డిజైన్ మొత్తాన్నికి ప్రీమియం లుక్ తీసుకొచ్చింది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఫ్రంట్ బంపర్ మీద వీలైనంత ఎత్తులో ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఇంటిగ్రేటెడ్ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ వచ్చాయి. ఇంజన్‌కు సాధ్యమైనంత గాలిని అందించే విధంగా రూపొందించిన అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్‌ను బంపర్‌లో అమర్చారు. ఒక హ్యాచ్‌బ్యాక్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలను ఒక కొత్త శైలిలో ఖరీదైన ఫీలింగ్ తెప్పించేలా అల్ట్రోజ్ ఫ్రంట్ డిజైన్ ఉంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, అప్‌స్వెప్ట్ విండో శైలిని ఇందులో అందించారు. ఫ్రంట్ విండో.. రియర్ విండో కంటే కాస్త తక్కువ ఎత్తులో ఉండటమే దీని ప్రత్యేకత. అంతే కాకుండా వెనుక నుండి వచ్చే వాహనాలను గమనిచండానికి అందించిన సైడ్ మిర్రర్లను కూడా విండో ఎత్తుకు తగ్గట్లుగానే అందించారు. బాడీ కలర్‌తో పాటు పలు బ్లాక్ ఫినిషింగ్ గల డిజైన్ ఎలిమెంట్లు మరియు 16-అంగుళాల స్టాండర్డ్ డ్యూయల్-టోన్ లేజర్ కట్ అల్లాయ్ వీల్స్ హైలెట్‌గా నిలిచాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

సైడ్ డిజైన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే మరో అంశం వెనుక డోర్లకు హ్యాండిల్స్ లేకపోవడం. వీటిని అద్దంలోనే కలిసిపోయేలా పైన పక్కవైపుల అందించారు. C-పిల్లర్‌లో కలిసిపోవడంతో కారుకు స్పోర్టివ్ ఫీల్ వచ్చింది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ విషయంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మరో కీలకమైన అంశం.. రియర్ డిజైన్. బ్లాక్ ఫినిషింగ్ గల టెయిల్ లైట్లు, ర్యాప్-అరౌండ్ టెయిల్ లైట్లు, రియర్ డోర్ మొత్తం బ్లాక్ ఫినిషింగ్, మధ్యలో క్రోమ్ అక్షరాలతో వచ్చిన అల్ట్రోజ్ పేరు ఈ కారు లగ్జరీ ఫీల్ తీసుకొచ్చాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్పోర్టివ్ థీమ్‌లో భాగంగా కారుకు వెనుక వైపున అద్దానికి పైభాగంలో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ లైట్లున్న చిన్న రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వచ్చింది. లోగో మరియు టాటా పేరు మినహాయిస్తే మరెలాంటి అదనపు క్రోమ్ సొబగులు ఇందులో రాలేదు.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఇంటీరియర్ మరియు స్వీయఅనుభవం

కారు లోపలికి వెళ్లే ముందు మీకో విషయం చెప్పాలి ఇక్కడ, టాటా అల్ట్రోజ్ కారు డోర్లు 90-డిగ్రీల వరకు బయటకు తెరుచుకుంటాయి. ఈ సెగ్మెంట్లో నాలుగు డోర్లు 90-డిగ్రీల వరకు తెరుచుకునే సౌలభ్యం ఉన్న ఏకైక మోడల్ ఇదే. ప్యాసింజర్లు వీలైనంత త్వరగా బయటికొచ్చేందుకు/లోపలికెళ్లేందుకు సహాయపడతాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ క్యాబిన్ మొత్తం ఓ లగ్జరీ ఇంటీరియర్‌ను తలపిస్తుంది. మరే ఇతర టాటా కారులో చూడనటువంటి నెక్ట్స్ లెవల్ ఫీచర్లు మరియు సౌకర్యాలను అల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కారులో అందించారు. ప్రీమియం సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ గల డ్యాష్‌బోర్డ్, ప్రీమియం ఫీల్ కల్పించే ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే మరియు లగ్జరీ స్టైల్లో ఉండే సెంటర్ కన్సోల్, గేర్‌రాడ్ మరియు బటన్లు వచ్చాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఇంటీరియర్‌లో అందరి దృష్టినీ ఆకర్షించే ముఖ్యమైన ఫీచర్, 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను కూడా సపోర్ట్ చేస్తుంది. కారు లోపలు రకరకాల కాంతినిచ్చే ఆంబియంట్ లైటింగ్ టెక్నాలజీ కూడా డ్యాష్ బోర్డు కలిగి ఉంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

స్పోర్టివ్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మీద ఆడియో మరియు రకరకాల కంట్రోల్స్‌తో కూడిన బటన్స్, చక్కగా లెథర్ ఫినిషింగ్‌ గల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ వంటి ప్రధానమైన ఇతర ప్రీమియం ఫీచర్లు వచ్చాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

స్టీరింగ్ వీల్ వెనుక వైపున్న సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, ఇందులో అనలాగ్ స్పీడో మీటర్ ఉంటే, మిగతా అన్ని రీడింగ్స్ డిజిటల్‌గా ఉంటాయి. టాకో మీటర్, రేంజ్, డిస్టెన్స్-టు-ఎంప్టీ, గేర్ ఇండికేటర్ ఇంకా డ్రైవర్‌కు కావాల్సిన మల్టీ ఇన్ఫర్మేషన్ ఈ డిజిటల్ డిస్ల్పే ఇస్తుంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోనే అత్యంత విశాలమైన కారుగా గుర్తింపు పొందిన టాటా అల్ట్రోజ్ ఫ్రంట్ మరియు రియర్ క్యాబిన్‌లో ప్రయాణికులకు విశాలమైన స్పేస్ సాధ్యమైంది.

విశాలమైన మరియు సౌకర్యవంతమైన సీట్లు, క్యాబిన్ మొత్తం పైభాగంలో ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే ప్రయాణికులకు గొప్ప అనుభూతినిస్తుంది. ముందువైపు కూర్చునే డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేకమైన స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ మరియు కాళ్లను వీలైనంత పొడువుగా చాచుకునేందుకు కావాల్సిన స్పేస్ అందించారు.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

అయితే, ఫ్రంట్ ప్యాసింజర్లకు ఉండే రియర్ సీట్ ప్యాసింజర్ల విషయంలో మిస్ అయ్యిందనే చెప్పాలి. వెనుక సీట్లలో కూర్చునేవారికి వీలైనంత హెడ్ రూమ్, లెగ్ రూమ్ ఉన్నప్పటికీ, 6 అడుగులు ఎత్తున్న వారు కూర్చుంటే కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. వెనుక వైపున ఫ్లోర్ సమాతరంగా రావడంతో ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. రియర్ క్యాబిన్‌లో కూడా ఆర్మ్ రెస్ట్ మరియు ఏసీ వెంట్స్ ఉన్నాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఇంటీరియర్‌లో చివరి అంశం లగేజీ స్పేస్ విషయానికి వస్తే, టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో 345-లీటర్ల బూట్ స్పేస్ (లగేజీ స్పేస్) అందివ్వడం జరిగింది. కారు సైజుకు ఈ స్పేస్ సరిపోతుంది. వెనుక వరుస సీట్లను మడిపిస్తే, లగేజ్ స్పేస్‌ను 665-లీటర్లకు పెంచుకోవచ్చు.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ కొలతలు ఉన్నాయి.

పొడవు (మి.మీ) 3990
వెడల్పు (మి.మీ) 1755
ఎత్తు (మి.మీ) 1523
వీల్ బేస్ (మి.మీ) 2501
గ్రౌండ్ క్లియరెన్స్ (మి.మీ) 165
లేగేజీ స్పేస్ (లీటర్లలో) 345

వేరియంట్లు, కీ ఫీచర్ల మరియు సేఫ్టీ

టాటా అల్ట్రోజ్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో లాంచ్ అయితే ఐదు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. అవి, XE, XM, XT, XZ మరియు XZ (O). ప్రతి వేరియంట్ కూడా పలు తప్పనిసరి ఫీచర్లతో పాటు వేరియంట్ లెవల్ పెరిగేకొద్దీ పలు అరుదైన మరియు ప్రత్యేకమైన ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్‌లోని ప్రధానమైన ఫీచర్లు:

 • మెటల్ ఫినిషింగ్ గల ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్
 • సెంటర్ కన్సోల్ మరియు డ్రైవర్ కాళ్ల వద్ద మూడ్ లైటింగ్
 • 3డీ అప్‌హోల్‌స్ట్రే మరియు ఫ్యాబ్రిక్ సీట్లు
 • 15-లీటర్ల కూల్డ్ గ్లూవ్ బాక్స్
 • ఫ్రంట్ డోర్లలో గొడుగులు పెట్టుకునేందుకు ప్రత్యేకమైన డిజైన్
 • ఇకో & సిటీ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్
 • ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉన్న సైడ్ మిర్రర్లు
 • చేతికి తొడుక్కునే కీ
 • ఫాలో-మి- హెడ్‌ల్యాంప్స్
 • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
 • హార్మన్ 4-స్పీకర్ సిస్టమ్
 • ఫాస్ట్-యూఎస్‌బీ ఛార్జింగ్

మన ఫీల్‌కు నచ్చినట్లుగా మార్చుకునే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్ ఉన్నాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

టాటా అల్ట్రోజ్ సేఫ్టీ ఫీచర్లు:

 • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
 • ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
 • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు
 • రివర్స్ పార్కింగ్ సెన్సార్ & కెమెరా
 • ఆటో హెడ్‌ల్యాంప్స్
 • క్రూయిజ్ కంట్రోల్
 • హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్
 • ఇంజన్ ఇమ్మొబిలైజర్
 • యాంటీ-గ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్
టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఇంజన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ అనుభవం

టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సాంకేతికంగా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. అవి, 1.2-లీటర్ 3-సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ 4-సిలిండర్ల రివోటార్క్ డీజల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్‌ను టియాగో నుండి మరియు డీజల్ ఇంజన్‌ను టాటా నెక్సాన్ నుండి సేకరించారు. రెండు ఇంజన్‌లు భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటిస్తాయి.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

రాజస్థాన్‌లోని జైసల్మీర్ రోడ్ల మీద టాటా అల్ట్రోజ్ కార్లను రివ్యూ చేసే అవకాశం ఇచ్చారు, ఆ సందర్భంలో రెండు కార్లను (పెట్రోల్&డీజల్) నడిపి చూశాము. అల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ విషయానికొస్తే, 1.2-లీటర్ (1197సీసీ) 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. అదే విధంగా 1.5-లీటర్ (1497సీసీ) 4-సిలిండర్ల డీజల్ ఇంజన్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది.

రెండు ఇంజన్‌లు స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఉన్నాయి. టాటా మోటార్స్ అతి త్వరలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందివ్వనున్నట్లు పేర్కొంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

డ్రైవింగ్ అనుభవం గురించి మాట్లాడితే, రెండు ఇంజన్‌లు బిఎస్-6 రెగ్యూలేషన్స్‌ ప్రకారం రావడంతో పవర్ అవుట్‌పుట్ చాలా బాగుంది. ప్రతి గేర్‌లో కూడా అవసరానికి తగ్గ పవర్ వచ్చింది. హై-వే ప్రయాణంలో అత్యంత సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన డ్రైవింగ్ సాధ్యమైంది. అయితే పెట్రోల్ ఇంజన్ మాత్రం కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌కు ఇంకా కాస్త అధిక పవర్ కావాలి అనే ఫీల్ కలిగించింది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

సిటీ డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఇంజన్ అసలైన పనితీరు బయటపడింది. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ ఉన్న బిజీ సిటీ రోడ్ల మీద కూడా డ్రైవ్ చేసి చూశాము. క్లచ్ ఎంతో తేలకగా ఉండటంతో డ్రైవర్ మీద ఎలాంటి ఒత్తిడి అనిపించదు. సిటీలో ఓవర్ టేకింగ్ విషయంలో కూడా మంచి మార్కులే పడ్డాయి, కానీ హైవే మీద వెళుతున్నపుడు గేర్లు మార్చుకోవడంలో కాస్త ఇబ్బందిగా అనిపించింది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఇండియన్ హైవే రోడ్ల కంటే కాస్త అధిక వేగానికి సెట్ అయ్యే విధంగా అత్యంత మెరుగైన సస్పెన్ష్ సిస్టమ్ టాటా అల్ట్రోజ్‌లో అందించారు, ఎలాంటి స్పీడ్‌నైనా ఇది తీసుకోగలదు నిజానికి విదేశాల్లో ఉండే ఫాస్టే హైవేలకు ఇది ఇంకా సెట్ అవుతుంది. టాటా అల్ట్రోజ్‌లో బ్రేకింగ్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంది.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?
వివరాలు పెట్రోల్ డీజల్
Engine (cc) 1199, 3-cylinder 1497,4-cylinder
Power (bhp) 86 @ 6000rpm 90 @ 4000rpm
Torque (Nm) 113 @3300rpm 200 @ 1250rpm
Transmission 5-MT 5-MT
టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ధర, పోటీ మరియు లభించే రంగులు

టాటా మోటార్స్ అల్ట్రోజ్ కారు ధరలు ఇంకా వెల్లడించలేదు. జనవరి 2020లో మార్కెట్లోకి విడుదలయ్యాక వేరియంట్ల వారీగా ధరల వివరాలు వెల్లడించనున్నారు. టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదలైతే విపణిలో ఉండే మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, వోక్స్‌వ్యాగన్ పోల్ మరియు హోండా జాజ్ వంటి మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది

టాటా అల్ట్రోజ్ కారును ఐదు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, హై స్ట్రీట్ గోల్డ్, స్కైలైన్ సిల్వర్, డౌన్‌టౌన్ రెడ్, మిడ్‌టౌన్ గ్రే మరియు అవెన్యూ వైట్.

టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

ఇతర మోడళ్లతో పోల్చుకుంటే ఏది బెస్టో ఫ్యాక్ట్ షీట్‌లో చూద్దాం రండి...

వివరాలు/మోడల్

టాటా అల్ట్రోజ్

మారుతి బాలెనో హ్యుందాయ్ ఎలైట్ 20
Engine 1.2-Petrol/1.5-Diesel 1.2-Petrol/1.3-Diesel 1.2-Petrol/1.4-Diesel
Power (bhp) 86/90 82/74 82/89
Torque (Nm) 113/200 113/190 113/220
Transmission 5-MT 5-MT/CVT 5-MT/CVT/6-MT
Starting Price (Rs) NA* Rs 5.58 Lakh Rs 5.52 Lakh
టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా అల్ట్రోజ్ ఒక అద్భుతమైన ఫ్యామిలీ కారు, అత్యుత్తమ ఇంటీరియర్ స్పేస్, ఫీచర్లు, సురక్షితమైన సీట్లు, రకరకాల ఫీచర్లు, విశాలమైన లగేజీ స్పేస్, అత్యుత్తమ ఇంజన్ ఆప్షన్లతో ఇద్దరు పిల్లలు ఉండే భార్యాభర్తలకు టాటా అల్ట్రోజ్ బెస్ట్ ఛాయిస్, అంతే కాకుండా లగ్జరీ ఫీచర్లు మరియు ప్రీమియం శైలిలో పవర్‌ఫుల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు కోసం చూసే యువతకు కూడా టాటా అల్ట్రోజ్ ఉత్తమ ఎంపిక అనేది మా అభిప్రాయం!

టాటా అల్ట్రోజ్ టాటా మోటార్స్‌కు భారీ సక్సెస్ తెచ్చిపెడుతుందా..? టాటా అల్ట్రోజ్ కారు గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్‌ ద్వారా మాతో పంచుకోండి!

Most Read Articles

English summary
Tata Altroz First Drive Review: The Brand-New Contender In The Premium Hatchback Segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X