టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఈ టైటిల్ చూడగానే మీకు విచిత్ర సోదరులు చిత్రంలో కమల్ హాసన్ సాంగ్ 'రాజా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. ' అనే పాత తెలుగు పాట గుర్తుకు వస్తుంది కదూ. ఈ చిత్రంలో కమల్ హాసన్ ఓ కార్ మెకానిక్, తన చేతితో ఏ కార్ రిపేర్ చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. అయితే, ఇప్పుడు ఈ సాంగ్ టాటా మోటార్స్‌కి చాలా చక్కగా సూట్ అవుతుంది. టాటా మోటార్స్ చెయ్యి వేస్తే, ఇప్పుడు ఏ కార్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. కంపెనీ ఇటీవల విడుదల చేసిన సరికొత్త కార్లే ఇందుకు అతిపెద్ద నిదర్శనం.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఒకప్పుడు అమ్మకాల పరంగా ఎక్కడో ఉన్న టాటా మోటార్స్ (Tata Motors), ఇప్పుడు దాని రివైజ్డ్ ప్రోడక్ట్ లైనప్‌తో దేశపు మూడవ అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించింది. ఈ బ్రాండ్ త్వరలోనే రెండవ స్థానాన్ని చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ ఇప్పుడు భారతదేశపు అగ్రగామి ఈవీ మేకర్ గా ఉంది. భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించుకుంది. మరి ఈ మొత్తం క్రెడిట్ ఏదైనా ఒక్క ఎలక్ట్రిక్ వాహనానికి మాత్రమే ఇవ్వాల్సి వస్తే, అది ఖచ్చితంగా టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)నే అవుతుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు స్టాండర్డ్ వేరియంట్లో ఇది ఇప్పటికే మంచి పవర్, రేంజ్‌లను కలిగి ఉంది. ఈ మోడల్ లో "మరింత ఎక్కువ" కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో "మ్యాక్స్" (Max) వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్ మరియు ఎక్కువ ఫీచర్లతో ఈ కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) మార్కెట్లోకి వచ్చింది. మరి ఇది నిజంగానే అన్నింటిలో ఎక్కువగా ఉంటుందా..? తెలుసుకునేందుకు మేము ఈ కారుతో కొంత సమయం గడిపాము. నగర వీధుల్లో మరియు హైవేపై నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ని నడిపి చూశాము. మరి ఇది ఎంత ఎలక్ట్రిఫైయింగ్‌గా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - డిజైన్ మరియు స్టైల్

మొదటి చూపులో, స్టాండర్డ్ వెర్షన్ నెక్సాన్ ఈవీకి మరియు ఈ మ్యాక్స్ వేరియంట్‌కి పెద్దగా తేడాలను గుర్తించలేము. నిజానికి, ఇందులో కొత్త డిజైన్ అంశాలు ఏవీ లేవు. టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలుదారులు ఇష్టపడే సుపరిచితమైన డిజైన్ మరియు స్టైలింగ్‌ను కలిగి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ రెండు వేరియంట్ల ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ ఒకేలా ఉంటుంది. అయితే, క్షుణ్ణంగా గమనిస్తే ఈ రెండు వేరియంట్లలో చాలా చిన్నపాటి తేడాలు మాత్రమే కనిపిస్తాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

స్టాండర్డ్ మోడల్‌లో కనిపించే హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ గ్రిల్, దిగువ గ్రిల్‌లోని ట్రై-యారో ఎలిమెంట్‌లు, పొడవాటి రూఫ్ మొదలైనవి అన్నీ ఈ మ్యాక్స్ వేరియంట్లో కూడా అలానే ఉంచబడ్డాయి. టాటా నెక్సాన్ పెట్రోల్/డీజిల్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది కాబట్టి, ఈ వెర్షన్ల నుండి ఎలక్ట్రిక్ వెర్షన్ ను వేరు చయేడానికి టాటా ఇంజనీర్లు నెక్సాన్ ఈవీ ఎక్స్టీరియర్‌లో ఎక్కువగా బ్లూ కలర్ యాక్సెంట్‌లను ఉపయోగించారు. ఇందులో EV బ్యాడ్జ్‌లు కూడా అదే షేడ్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

కాగా, ఈ కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో ఉపయోగించిన అల్లాయ్ వీల్స్ డిజైన్ కొత్తగా ఉంటుంది. అయితే, ఇవి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే డ్యూయల్-టోన్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్. కాకపోతే, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లోని ఈ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇప్పుడు మరింత మెరుగైన మరియు స్పోర్టీ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటాయి. ఇందులోని ఇతర ప్రధాన మార్పులను గమనిస్తే, ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు సరికొత్త ఇంటెన్సి-టీల్ కలర్ స్కీమ్ రూపంలో లభిస్తుంది. ఈ కొత్త కలర్ ఆప్షన్ కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌కి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది, స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో ఈ కలర్ ఆప్షన్ ఉండదు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మరో రెండు ఇతర కలర్ ఆప్షన్లలో (ప్రిస్టైన్ వైట్ మరియు డేటోనా గ్రే) కూడా లభిస్తుంది. మొత్తంగా ఈ మూడు కలర్ ఆప్షన్‌లు కూడా డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో లభిస్తాయి. ఈ మ్యాక్స్ వేరియంట్ ఇప్పుడు ఇంటెన్సి-టీల్ స్కీమ్‌లో అత్యుత్తమంగా కనిపిస్తుంది. సాదారణంగానే, టీల్ కలర్ చాలా డీప్‌గా మరియు ఇంటెన్సివ్‌గా ఉంటుంది మరియు ఎస్‌యూవీలోని ఎలక్ట్రిక్ బ్లూ ఎలిమెంట్స్‌తో ఇది గొప్ప వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగానే గొప్పగా కనిపించే నెక్సాన్ ఈవీ, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్ తో మరింత గొప్పగా కనిపిస్తుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

ఎక్స్టీరియర్ మాదిరిగానే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇంటీరియర్లలో కూడా పెద్దగా మార్పులేమీ లేవు. దీని ఓవరాల్ ఇంటీరియర్ లేఅవుట్ స్టాండర్డ్ టాటా నెక్సాన్ ఈవీ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో ప్రధానంగా కనిపించే అతి పెద్ద వ్యత్యాసం, దాని కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్. కంపెనీ ఈ మ్యాక్స్ వేరియంట్‌ను మకరనా బేజ్ కలర్ అప్‌హోలెస్ట్రీతో అందిస్తోంది మరియు దీనిపై ఎలక్ట్రిక్ బ్లూ కలర్ స్టిచింగ్‌ ఉంటుంది. ఈ రెండు కలర్ కాంబినేషన్స్ చూడటానికి ఎలక్ట్రిఫైయింగ్‌గా అనిపిస్తాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

కారులోని సీట్లు అన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తాయి మరియు వాటిపై చిల్లులు (వెంటిలేషన్ హోల్స్), ట్రై-యారో డిజైన్‌ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఈ సీట్లపై కూర్చుని ఎంత సేపు ప్రయాణించినా హాయిగా అనిపిస్తాయి. ముందు వైపు డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సీట్లు రెండూ కూడా వెంటిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి మరియు ఈ ఫీచర్ వేసవిలో మంచి హాయిని అందిస్తుంది. వెంటిలేషన్ ఫీచర్ కోసం కంట్రోల్ బటన్స్, సీటు యూనిట్‌లో తలుపుల వైపు ఉంటాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ థీమ్‌లో ఉంటుంది. ఇందులోని బేజ్ అండ్ బ్లాక్ కలర్ మంచి క్లాసీ లుక్‌ని తెచ్చిపెడుతుంది. కారు అంతటా అక్కడక్కడా బ్లూ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. డ్రైవర్ సీటుకి ఎదురుగా లెథర్‌తో చుట్టబడిన పెద్ద స్టీరింగ్ వీల్ ఉంటుంది. దీనిపై స్టిచింగ్ ఎలక్ట్రిక్ బ్లూ కలర్‌లో ఉంటుంది. ఇదొక త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ఇందులో మూడు స్పోక్‌లు కూడా గ్లోసీ బ్లాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. దీనిపై ఆడియో మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫంక్షన్‌ల కోసం స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది కూడా ఎలక్ట్రిక్ బ్లూ ఫినిషింగ్‌తో చాలా అందగా కనిపిస్తుంది. ఇదొక అనలాగ్-డిజిటల్ స్పీడో మీటర్. ఇందులో స్పీడోమీటర్ అనలాగ్‌ రూపంలో ఉంటుంది. కారుకి సంబంధించిన ఇతర సమాచారాన్ని 7 ఇంచ్ ఫుల్ కలర్ TFT స్క్రీన్‌పై చూడవచ్చు. ఈ స్క్రీన్ పై రేంజ్, బ్యాటరీ ఛార్జ్ స్థితి, రియల్ టైమ్ విద్యుత్ వినియోగం, రియల్ టైమ్ రీజనరేషన్ మోనిటరింగ్, రీజెన్ స్థాయి డిస్‌ప్లే, ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్, వివిధ రకాల అలెర్ట్‌లు మరియు నోటిఫికేషన్‌లుకు సంబంధించిన అనేక రకాల సమాచారం ప్రదర్శించబడుతుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

డ్యాష్‌బోర్డ్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇందులోని ఫ్లోటింగ్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది ఆపిల్ కార్‌ప్లే (Apple CarPlay) మరియు ఆండ్రాయిడ్ (Android Auto) కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. కాకపోతే, ఇవి వైరుతో కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి, ఆధునిక కార్ల మాదిరిగా ఇందులో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉండదు. ఇక్కడ ఇదొక్కటే పెద్ద డ్రాబ్యాక్, ఇలాంటి హై-ఫై కారులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ లేకపోవడం విచారకరం.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఇక ఈ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ దిగువ భాగాన్ని గమనిస్తే, అక్కడ సెంట్రల్ AC వెంట్‌లు ఉంటాయి మరియు ఇవి కూడా వాటి చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌ను కలిగి ఉంటాయి. ఇది డాష్‌బోర్డ్ పొడవునా నడిచే గ్లోస్ బ్లాక్ ప్యానెల్ లోపల సెట్ చేయబడి ఉన్నట్లుగా ఉంటుంది. ఇక దానికి దిగువన గమనిస్తే, అక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్ బటన్స్ ఉంటాయి. అయితే, ఈ నాబ్‌లను ఉపయోగించి చేసిన ఏవైనా మార్పులు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పైనే ప్రదర్శించబడతాయి. సాధారణ కార్లలో మాదిరిగా ఆటోమేటిక్ ఏసి కోసం ప్రత్యేకమైన చిన్నపాటి ఎల్‌సిడి డిస్‌ప్లే ఈ కారులో కనిపించదు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఏసి కంట్రోల్స్ క్రింద వివిధ ఫంక్షన్‌లను నిర్వహించే కొన్ని బటన్‌లు కూడా ఉన్నాయి. ఇందులో వాహనాన్ని లాక్/అన్‌లాక్ చేయడం, ఛార్జర్‌ని దాని సాకెట్ నుండి అన్‌ప్లగ్ చేయడం, హిల్-డీసెంట్ కంట్రోల్‌ని యాక్టివేట్ చేయడం లేదా డియాక్టివేట్ చేయడం వంటి పనుల కోసం కొన్ని బటన్స్ ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో, 12V చార్జింగ్ సాకెట్, అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం USB పోర్ట్ ఉంటాయి. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్‌లో హైలైట్ నిలిచే ఫీచర్ ఏంటంటే, దాని జ్యువెల్ గేర్ నాబ్. ఈ గేర్ నాబ్‌ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఉపయోగిస్తున్నప్పుడు మంచి అనుభూతిని అందిస్తుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ జువెల్ గేర్ నాబ్‌లో ఓ చిన్న సైజు గుండ్రటి డిస్‌ప్లే యూనిట్ కూడా ఉంటుంది, ఈ యాక్టివ్ డిస్‌ప్లే యూనిట్ ఓ మంచి ప్రీమియం అనుభూతిని జోడిస్తుంది. ఇది మీరు పార్క్, రివర్స్, న్యూట్రల్ మరియు డ్రైవ్ మోడ్‌లకు మారిన ప్రతిసారీ యానిమేషన్‌తో కూడిన ఫుల్ కలర్ డిస్‌ప్లేను ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా, ఇది ప్రతి ఒక్కరికి వేర్వేరు కలర్ ఆప్షన్లను కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తుంది మరియు ఇది చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది. ఈ గేర్ నాబ్ పక్కనే ఎకో మరియు స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌ల కోసం ప్రత్యేకమైన బటన్‌లు కూడా ఉంటాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఈ గేర్ నాబ్ వెనుక రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పెంచడానికి లేదా తగ్గించడానికి అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఆటో హోల్డ్ ఫంక్షన్‌లను పెంచడానికి కంట్రోల్స్ కూడా ఉంటాయి. అలాగే, మీరు మీ స్మార్ట్‌ఫోన్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు మరొక ఫోన్‌ను ఉంచడానికి స్లాట్‌ను కూడా పొందుతారు. డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఆర్మ్‌రెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఆర్మ్‌రెస్ట్ క్రింది భాగంలో స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. మొత్తమ్మీద టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇంటీరియర్ చాలా క్లాసీగా, సొగసైనదిగా మరియు అదే సమయంలో యవ్వనంగా కనిపిస్తుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్

ఇటీవలి కాలంలో వచ్చిన అన్ని ఆధునిక టాటా కార్లు కూడా కంఫర్ట్ మరియు ప్రాక్టికాలిటీ విషయంలో ది బెస్ట్‌గా ఉంటున్నాయి. కాబట్టి, ఈ విషయంలో టాటా నెక్సాన్ ఈవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కారులో లపల సౌకర్యాన్ని పెంచే అనేక లక్షణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది వెంటిలేటెడ్ సీట్లు. బయటి వాతావరణం నిజంగా వేడిగా ఉన్నప్పుడు, ఈ ఫీచర్ వారికి ఓ లైఫ్ సేవర్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఈ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సీట్ల నాణ్యత మరియు అన్ని వైపులా కుషనింగ్ అద్భుతంగా ఉంటుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

కారు వెనుక భాగంలోని సీట్లు కూడా గొప్ప బ్యాక్ సపోర్ట్‌తో పాటు అండర్-తై సపోర్ట్‌ను కలిగి ఉండి ప్రయాణీకులకు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. కారులో లెగ్‌రూమ్, క్నీరూమ్ మరియు హెడ్‌రూమ్‌లకు కొరతే లేదు. వెనుక వైపు మీరు కప్ హోల్డర్‌లతో కూడిన ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ను పొందుతారు. వెనుకవైపు ఉన్న ప్రయాణీకుల కంఫర్ట్ కోసం సెంటర్ కన్సోల్ అమర్చబడిన రియర్ ఏసి వెంట్స్ ఉంటాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ముందు వైపు ఉండే గ్లోవ్‌బాక్స్ చాలా విశాలంగా ఉంటుంది, ఇందులో చాలా వస్తువులను నిల్వ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ ఛార్జర్‌ను ఉంచడానికి, టాటా ఇంజనీర్లు కప్ హోల్డర్‌లను తీసివేశారు. అయితే, ఈ కప్ హోల్డర్లు ఇప్పుడు డోర్‌ పాకెట్స్ లో ఉంటాయి. డోర్ ప్యానెల్‌లలో లోతైన పాకెట్‌లు ఉంటాయి, ఇవి కేవలం వాటర్ బాటిళ్లను ఉంచడానికి మాత్రమే కాకుండా, ఇతర చిన్న వస్తువులను స్టోర్ చేసుకునేందుకు మంచి నిల్వ స్థలాన్ని కలిగి ఉంటాయి.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ బూట్ స్పేస్ స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కన్నా తక్కువగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం ఇందులో పెరిగిన బ్యాటరీ ప్యాక్. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కొంత బూట్ స్పేస్‌ని త్యాగం చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఇది బెస్ట్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుందనే చెప్పొచ్చు. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మొత్తంగా 350 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. వెనుక సీట్లను మడుచుకోవడం ద్వారా దీనిని పెంచుకునే అవకాశం ఉంటుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - పవర్‌ట్రెయిన్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పేరుకి తగినట్లుగానే దాని స్టాండర్డ్ వేరియంట్ కన్నా అన్ని విషయాల్లో గరిష్టంగా ఉంటుంది. మ్యాక్స్ బ్యాటరీ, మ్యాక్స్ పవర్, మ్యాక్స్ రేంజ్ మరియు మ్యాక్స్ పెర్ఫార్మెన్స్‌తో ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఇది స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో ఉపయోగించిన 30.2kWh బ్యాటరీ ప్యాక్ కంటే 10.3kWh పెద్దది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

పెరిగిన బ్యాటరీ సామర్థ్యం కారణంగా బ్యాటరీ పొడవు మరియు వెడల్పు కూడా పెరుగుతుంది. అలాగే, కారు బరువు కూడా అదనంగా దాదాపు 70 కిలోగ్రాములు పెరుగుతుంది. అలాగే, ఈ పెరిగిన పవర్ ప్యాక్ కారణంగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఇప్పుడు స్టాండర్డ్ వేరియంట్ కన్నా ఎక్కువ పవర్ మరియు టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. మ్యాక్స్ వేరియంట్లో ముందు యాక్సిల్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 143bhp శక్తిని మరియు 250Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే 14bhp మరియు 5Nm ఎక్కువ.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్ యొక్క మ్యాక్స్ పవర్ మరియు టార్క్‌ల కారణంగా కారు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. టాటా మోటార్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త వేరియంట్ కేవలం 9 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగాన్ని గంటకు 140 కిలోమీటర్లకు యాంత్రికంగా పరిమితం చేశారు. అయితే, మేము ఈ కారును నడిపినప్పుడు, Nexon EV Maxని దాని క్లెయిమ్ చేసిన టాప్ స్పీడ్‌కు దగ్గరగా నడపలేదు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

మేము ఈ మ్యాక్స్ వేరియంట్‌ను టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలో ఓ రెండు సార్లు మాత్రమే హార్డ్ యాక్సిలరేషన్ పరుగులు చేసాము. ఈ కారు యొక్క రియల్ టైమ్ రేంజ్‌ను పరీక్షించే దిశలో భాగంగా మేము దీనిని ఎక్కువ సమయం వేగంగా నడపలేకపోయాము. అయినప్పటికీ, అవసరమైనప్పుడల్లా గంటకు గరిష్టంగా 80 కిమీ వేగంతో డ్రైవ్ చేయగలిగాము. నిజం చెప్పాలంటే, ఇలాంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కొనుగోలు చేసే కస్టమర్లు వాటి టాప్ స్పీడ్ మరియు క్విక్ యాక్సిలరేషన్ వంటి విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - రేంజ్ టెస్ట్

టాటా నెక్సాన్ ఈవీలో రేంజ్ చాలా ముఖ్యమైనది. స్టాండర్డ్ వేరియంట్ రేంజ్ విషయంలో కస్టమర్లు కాస్తంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ నేపథ్యంలో, కంపెనీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రేంజ్‌ను గరిష్టంగా 100 కిలోమీటర్లకు పైగా పెంచింది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ARAI ధృవీకరించబడినట్లుగా పూర్తి చార్జ్ పై 437 కిలోమీటర్ల టెస్ట్-రేంజ్ ను అందిస్తుంది. అయితే, వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో ఇది భిన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు మేము ఈ మ్యాక్స్ వేరియంట్‌ను చార్జింగ్ పూర్తిగా తగ్గే వరకూ నడిపి చూశాము.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

మేము బయలుదేరినప్పుడు, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ దాని బ్యాటరీలో 98 శాతం ఛార్జ్ కలిగి ఉంది మరియు ఈ చార్జ్‌తో ఇన్‌స్ట్రుమెంటేషన్‌పై ప్రదర్శించబడిన రేంజ్ 407 కిలోమీటర్లుగా ఉంది. మేము ఈ కారుతో హైవేపై ప్రయాణించాము మరియు రోజంతా వివిధ వాతావరణాలలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరీక్షించాము. అలాగే, మేము ఈ కారును గరిష్టంగా 80 కిమీ వేగం వద్ద క్రూయిజ్ కంట్రోల్‌ను సెట్ చేసి, కొన్ని ఓపెన్ రోడ్లపై నడిపి చూశాము. హైవేపై ఈ కారు ఎలాంటి సందేహం లేకుండా ముందుకు సాగిపోయింది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

అలాగే, రద్దీగా ఉండే స్టాప్ అండ్ గో ట్రాఫిక్ లోనూ మరియు రంగనాతిట్టు పక్షుల అభయారణ్యం పరిసరాలలోనూ ఈ ఎలక్ట్రిక్ కారును నడిపాము. ఈ కారుకి అమర్చిన MRF వాండరర్ ఎకోట్రెడ్ టైర్లు చిన్నపాటి ఆఫ్-రోడింగ్ విషయంలో కూడా మంచి పట్టును కనబరిచాయి. అలా ఈ ఎలక్ట్రిక్ కారులో చార్జింగ్ నెంబర్ 10 శాతానికి పడిపోయే సరికి మేము ఊరంతా చుట్టి చివరకు బెంగుళూరుకు చేరుకున్నాము. అప్పటి మేము కవర్ చేసిన దూరం 300 కిలోమీటర్లు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఆ సమయంలో బ్యాటరీ SOC 10 శాతానికి పడిపోయింది. ఇది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 10 శాతం వద్ద ఉండే లింప్ హోమ్ మోడ్‌ను అనుభవించడానికి మాకు వీలు కల్పించింది. ఈ మోడ్‌లో, థ్రోటల్ స్పాంజి లాగా మృదువుగా మారుతుంది మరియు ఈ ఎస్‌యూవీని వేగవంతం చేయడానికి వెనుకాడుతుంది. కారు ముందుకు వెళ్లాలంటే మీరు నిజంగా పెడల్‌ను నేల చేరే వరకూ నొక్కాల్సి ఉంటుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ టెస్ట్ డ్రైవ్ ప్రక్రియ ముగిసే సమయానికి మేము సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 309.7 కిలోమీటర్లను చుట్టాము. ఆ సమయంలో Nexon EV Max అప్పటికీ దాని బ్యాటరీలో 10 శాతం మిగిలి ఉంది. ఈ 10 శాతం మరియు లింప్ హోమ్ మోడ్ ద్వారా సెట్ చేయబడిన పనితీరు పరిమితులతో, అదనంగా 30-40 కిలోమీటర్లు కవర్ చేయవచ్చని మేము అంచనా వేస్తున్నాము. అంటే, ఇప్పుడు మనం హైపర్‌మైలింగ్ ద్వారా 309.8 కిలోమీటర్లు సాధించామని చెప్పవచ్చు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

రీజనరేషన్ ఎల్లప్పుడూ గరిష్టంగా ఉన్నప్పుడు థ్రోటల్ ఇన్‌పుట్‌లు మరియు బ్రేకింగ్ కనిష్టంగా ఉంచబడ్డాయి. మేము ఎకో మోడ్‌లో మాత్రమే డ్రైవ్ చేసాము మరియు ఎయిర్ కండిషనింగ్ కేవలం ఐదు కిలోమీటర్ల వరకు ఉపయోగించలేదు. సాధారణ డ్రైవింగ్ పరిస్థితుల్లో అయితే, మేము ఈ రేంజ్ 300 కిలోమీటర్ల మార్క్ కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నాము మరియు ఇది దాదాపు 270 కిలోమీటర్ల వాస్తవ పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ మ్యాక్స్ లో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి. వీటిలో ఎకో, సిటీ మరియు స్పోర్ట్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్‌లో ఇది బ్యాలెన్స్డ్ గా ఉండి, ఎక్కువ మైలేజీని అందిస్తుంది. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ కోసం సిటీ మోడ్ ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని స్పోర్ట్స్ మోడ్ పనితీరును పెంచుతుంది కానీ బ్యాటరీని మాత్రం వేగంగా ఖాలీ చేసేస్తుంది. మీరు ఈ మోడ్‌కి మారినప్పుడు స్క్రీన్‌పై ఉన్న రేంజ్ వెంటనే 30 కిలోమీటర్ల మేర పడిపోతుంది. కాబట్టి, స్పోర్ట్స్ మోడ్ వాడేటప్పుడు పారాహుషార్.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఈ మ్యాక్స్ వేరియంట్లో నాలుగు రీజెన్ సెట్టింగ్‌లు ఉంటాయి. దీనిని పూర్తిగా ఆఫ్ చేయవచ్చు మరియు గరిష్ట స్థాయి రీజనరేషన్ కలిగి ఉన్న దానిని 3 వరకు తీసుకెళ్లవచ్చు. ఈ 3 వస్థాయిలో రీజెన్ సృష్టించిన బ్రేకింగ్ చాలా బలంగా ఉన్నందున మీరు నిజంగా ఒకే పెడల్‌తో డ్రైవ్ చేయవచ్చు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ - రైడ్ మరియు హ్యాండ్లింగ్

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లోని రైడ్ క్వాలిటీ దాదాపుగా పరిపూర్ణంగా ఉంటుంది. దాని సస్పెన్షన్ మృదువుగా ఉండి, గుంతలు మరియు స్పీడ్‌బంప్‌లను సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. పెద్ద బ్యాటరీ ద్వారా జోడించబడిన అదనపు 100 కిలోగ్రాముల బరువకు అనుగుణంగా కంపెనీ దాని సస్పెన్షన్ సెటప్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ అదనపు బరువును నిర్వహించడానికి దానిలోని స్ప్రింగ్‌లు కొంచెం గట్టిగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి, క్యాబిన్ లోపల చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మోటారు నుండి ఎటువంటి శబ్దం వస్తున్నట్లు అనిపించదు. ఒకవేళ మీరు అధిక వేగం వద్ద ఏదైనా శబ్ధం వింటున్నారు అంటే, అది మీ కారు టైర్లు చేసే శబ్ధం కావచ్చు. స్టీరింగ్ వీల్ పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది, బరువుగా ఉంటుంది మరియు తక్కువ/ఎక్కువ వేగాల వద్ద మంచి కంట్రోల్‌ని ఇస్తుంది మరియు ఇది డ్రైవర్ విశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం మీద, కొత్త Tata Nexon EV Max ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ SUV, మరియు దీనిని నడపడం కూడా నిజంగా అద్భుతమైన అనుభవంగా ఉంటుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - ఛార్జింగ్

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీతో ఈ మ్యాక్స్ వేరియంట్‌ను ప్రత్యేకంగా ఉంచే మరొక అంశం దీని చార్జింగ్ సెటప్. ఈ వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఇప్పుడు రెండు రకాల ఛార్జర్‌లను ఎంచుకోవచ్చు. వీటిలో ఒకటి 3.3kW ఛార్జర్, ఇది స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఈ ఛార్జర్ తో మ్యాక్స్ వేరియంట్ యొక్క పెద్ద బ్యాటరీ ప్యాక్ ను చార్జ్ చేయడానికి సుమారు 15-16 గంటల సమయం పడుతుంది.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

అయితే, కస్టమర్లు ఇక్కడ మరింత వేగవంతమైన కొత్త 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. వేగవంతమైన ఛార్జింగ్ సమయం కోరుకునే వారి కోసం, టాటా మోటార్స్ ఈ కొత్త AC ఫాస్ట్ ఛార్జర్‌ను విడుదల చేసింది. ఈ 7.2kW ఛార్జర్ తో కేవలం 5-6 గంటల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. అదే 50kW DC ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంటే, ఈ ఎలక్ట్రిక్ కారును గంటలోపే 0-80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - సేఫ్టీ ఫీచర్లు:

- రీఇన్‌ఫోర్స్డ్ స్టీల్ స్ట్రక్చర్

- ఈబిడితో కూడిన ఏబిఎస్

- బ్రేక్ అసిస్ట్

- IP67 రేటెడ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్

- హిల్ హోల్డ్ అసిస్ట్

- హిల్ డిసెంట్ కంట్రోల్

- ఆటో హోల్డ్

- పానిక్ బ్రేక్ హజార్డ్ లాంప్స్

- ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్

- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - కీలక ఫీచర్లు:

- ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

- 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

- అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

- రియర్ ఏసి వెంట్స్

- ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు

- బిల్ట్-ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్

- యాక్టివ్ డిస్‌ప్లేతో కూడిన జ్యువెల్ గేర్ నాబ్

- ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM)

- వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - వేరియంట్‌లు, ధరలు:

- నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+: రూ. 17.74 లక్షలు (3.3kW ఛార్జర్)

- నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+: రూ. 18.24 లక్షలు (7.2kW ఛార్జర్)

- నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+ Lux: రూ. 18.74 లక్షలు (3.3kW ఛార్జర్)

- నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+ Lux: రూ. 19.24 లక్షలు (7.2kW ఛార్జర్)

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ - కలర్ ఆప్షన్లు:

- ఇంటెన్సి-టీల్

- డేటోనా గ్రే

- ప్రిస్టిన్ వైట్

టాటా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా.. కొత్త 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' (Nexon EV Max) రివ్యూ

చివరిగా ఏం చెబుతారు..?

టాటా మోటార్స్ తమ సరికొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌తో తాము అనుకున్నది సాధించింది. ఇది ప్రతి విషయంలో వినియోగదారులకు "మ్యాక్స్" (గరిష్ట) అనుభూతిని అందిస్తుంది. వాడుకలో ఉన్న అన్ని ఫీచర్లతో కలిపి ఈ కారు యొక్క రియల్-టైమ్ రేంజ్ గరిష్టంగా 270 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మ్యాక్స్ వేరియంట్ అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది కాబట్టి, ఇది భారతదేశంలో అత్యంత ఆచరణాత్మక ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా నిలుస్తుంది. మొదట్లో దీని ధర చాలా ఎక్కువగానే అనిపిస్తుంది, అయితే, దీర్ఘకాలంలో ఇది అందించే ప్రయోజాలను చూస్తే ఈ ధర ఖచ్చితంగా తక్కువే అనిపిస్తుంది. కాబట్టి, ధరకు తగిన విలువను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Tata nexon ev max test drive review real world range and driving impressions
Story first published: Tuesday, May 17, 2022, 9:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X