టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

టాటా మోటార్స్ (Tata Motors)- భారతదేశపు అతి పెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ డివిజన్ అతి త్వరలో మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ కారు కాకపోయినప్పటికీ.. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మంట్లో ఇదే తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ లైనప్‌లో ఇప్పటికే టియాగో ఎలక్ట్రిక్ మరియు టిగోర్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. జనవరి 28, 2020 తేదీన వీటి సరసన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ చేరనుంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం టాటా మోటార్స్ డెవలప్ చేసిన "జిప్‌ట్రాన్" టెక్నాలజీ కింద వచ్చిన తొలి మోడల్ కూడా ఇదే.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు, టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం డ్రైవ్‌స్పార్క్ బృందానికి లభించింది. మేము నిర్వహించిన ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో బెస్ట్ పర్ఫామెన్స్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతి, హ్యాండ్లింగ్, మైలేజ్ మరియు ఫీచర్లు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్లను ఎదుర్కునే సత్తా టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి ఉందా..? ఇవాళ్టి రివ్యూలో తెలుసుకుందాం రండి...

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

డిజైన్ మరియు స్టైల్

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ డిజైన్ పరంగా చూడటానికి అతి త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ తరహాలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ఎక్ట్సీరియర్ మరియు డిజైన్ పరంగా ఎన్నో అప్‌డేట్స్ నిర్వహించి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రీలాంచ్ చేయనున్నారు. ఈ మార్పులన్నీ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్‌లో కూడా వచ్చాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్ చాలా కొత్తగా ఉంది. పాత దానితో పోలిస్తే స్పోర్టివ్ మరియు అగ్రెసివ్ స్టైలింగ్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఇంటీరియర్‌లో కూడా లగ్జరీ మరియు స్పోర్టివ్ ఫీల్ కనిపిస్తుంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఫ్రంట్ డిజైన్ నుండి చూసుకుంటే.. నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అత్యాధునిక హెడ్‌ల్యాంప్స్, పదునైన మరియు పలుచటి స్లీక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ కూడా వచ్చాయి. అయితే ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్స్ రాలేదు. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు కూడా అప్‌డేట్ చేశారు. వీటిని మెయిన్ హెడ్‌ల్యాంప్స్‌లో భాగంగా అందించారు. ఎస్‌యూవీకి అగ్రెసివ్ లుక్ తీసుకొచ్చేందుకు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను X-ఆకారంలో అందించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఇరువైపులా ఉన్న హెడ్‌ల్యాంప్స్‌ను కలుపుతూ మధ్యలో పొడవాటి పియానో బ్లాక్ ఫినిషింగ్ గల ప్లేట్ వచ్చింది. ఈ ప్లేటుకు మధ్యలో టాటా లోగోను అమర్చారు. దీనికి కింది వైపున కుడివైపు ఎలక్ట్రిక్ వెహికల్ అని సూచించే EV బ్యాడ్జింగ్ వచ్చింది. దీనికి కిందగా స్మాల్ గ్రిల్ కూడా వచ్చింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఫ్రంట్ గ్రిల్ చివర్లో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్‌లో విశాలమైన ఎయిర్ ఇంటేకర్ గ్రిల్, దీని మీదనే లైట్ బ్లూ హైలెట్స్ వచ్చాయి. టాటా దీనిని "ఎలక్ట్రిక్ బ్లూ" అని పిలుస్తోంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఫ్రంట్ డిజైన్‌‌లో పియానో బ్లాక్ ఫినిషింగ్ గల బంపర్‌కు కింది వైపునున్న "ఎలక్ట్రిక్ బ్లూ" హైలెట్స్ రియర్ డిజైన్‌లో కూడా వచ్చాయి. ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్‌లో ఎలక్ట్రిక్ బ్లూ సొబగులు చూడవచ్చు. పెద్ద ఎస్‌యూవీ అనే ఫీల్ కలిగించేందుకు ఫ్రంట్ బానెట్‌ను ఫ్లాట్‌గా అందించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సైడ్ డిజైన్ విషయానికి వస్తే, పెద్దగా మార్పులేమీ జరగలేదు. అయితే డోర్ల మీద అద్దాలకు అంచుల్లో దప్పంగా ఉన్న ఎలక్ట్రిక్ బ్లూ కలర్ పట్టీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఎస్‌యూవీ ఫ్రంట్ డోర్ల మీద ఇరువైపులా EV బ్యాడ్జ్ వచ్చింది. టాటా మోటార్స్ నెక్సాన్ ఎలక్ట్రిక్ కోసం కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ అందించింది. 16-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఎస్‌యూవీకి లగ్జరీ ఫీల్ తీసుకొచ్చింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

నెక్సాన్ ఎలక్ట్రిక్ రియర్ డిజైన్‌ కూడా అచ్చం నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే ఉంది. స్పల్ప మార్పులతో కూడా అప్‌డేట్స్ మినహాయిస్తే డిజైన్‌ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. ఎలక్ట్రిక్ బ్లూ కలర్ హైలెట్స్ మరియు అప్‌డేటెడ్ టెయిల్ లైట్ సెటప్ కొత్తగా అనిపించాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

లగేజీ డోర్ మీద మధ్యలో పెద్ద అక్షరాల్లో "N E X O N " అనే బ్యాడ్జింగ్ వచ్చింది. టాటా హ్యారియర్ మరియు ఆల్ట్రోజ్ కార్లలో కూడా ఇలాంటి బ్యాడ్జింగ్ గమనించవచ్చు. దీంతో పాటు EV మరియు Ziptron అనే బ్యాడ్జింగ్ ఇరువైపులా వచ్చాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఇంటీరియర్

టాటా నెక్సాన్ ఇంటీరియర్‌లోకి వస్తే, ఎన్నో మార్పుల చేర్పులతో అప్‌డేట్ చేసిన స్టైలిష్ ఇంటీరియర్ కస్టమర్లకు స్వాగతం పలుకుతుంది. నెక్సాన్ ఎలక్ట్రిక్‌లో లెథర్ చక్కగా ఫినిషింగ్ చేసిన స్టీరింగ్ వీల్, దీని మీదున్న ఆడియో కంట్రోల్స్ మరియు ఫోన్ కాల్ ఫంక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

స్టీరింగ్ వీల్‌కు వెనకాలే డిజిటల్ డిస్ల్పే మరియు అనలాగ్ స్పీడో మీటర్ కలిగిన సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ వచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా ఇదే తరహా సెటప్ వచ్చింది. అయితే ఇందులో బ్యాటరీ స్టేటస్, టాకో మీటర్, మిగిలి ఉన్న ఛార్జింగ్‌తో ఎన్నో కిలోమీటర్లు నడుస్తుంది, బ్యాటరీ శాతం, రీజనరేట్ అయిన బ్రేకింగ్ పవర్ వాడకం ఇంకా ఎన్నో వివరాలను ఇది అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

డ్రైవర్ సైడ్ క్యాబిన్ విషయానికి వస్తే, డాష్‌బోర్డు మీద ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. దీనికి తోడు 35 కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన టాటా వారి కనెక్టెడ్ టెక్నాలజీ కూడా వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని మొబైల్ యాప్ ద్వారా ఈ ఫీచర్లను కంట్రోల్ చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కింది వైపునున్న సెంటర్ కన్సోల్ చూస్తే లగ్జరీ కార్లకు ఏ మాత్రం తీసిపోదు. సెంటర్ కన్సోల్ మీద ఏసీ వెంట్స్, వీటి చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ కలర్ హైలెట్స్ వచ్చాయి, క్యాబిన్‌లో కూడా అక్కడక్కా ఈ ఎలక్ట్రిక్ బ్లూ సొబగులు అందించారు. డాష్‌బోర్డ్ మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో ఉంటే, దీనికి పైనా మరియు కింది వైపున బీజీ కలర్ ఫినిషింగ్ వచ్చింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

డాష్‌బోర్డు మీద సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ వచ్చాయి. లగ్జరీ కార్లను తలపించేలా సెంటర్ కన్సోల్ మీద క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్స్, రోటరీ నాబ్స్ మరియు ఫిజికల్ బటన్స్ వచ్చాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

వీటితో పాటు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 12V ఛార్జింగ్ సాకెట్ కూడా కలదు. లోపల కూర్చున్న ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా మధ్యలో దీనిని ఏర్పాటు చేశారు. డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవ్ సిస్టమ్ మార్చుకునేందుకు R, N, D మరియు S అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ వచ్చాయి. వీటిని కూడా సింపుల్‌గా సెలక్ట్ చేసుకునేందుకు రోటరీ డయల్ ఫార్మా‌ట్‌లో అందించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

మేము టెస్ట్ డ్రైవ్ చేసిన నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే వచ్చింది. నెక్సాన్ ఎలక్ట్రిక్ టాప్ ఎండ్ వేరియంట్లలో లెథర్ ఫినిషింగ్ గల సీట్లు కూడా వచ్చాయి. సీట్లు కూడా ఎంతో సౌకర్యవంతంగా, చక్కటి ప్రయాణ అనుభూతిని కల్పిస్తాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లను మ్యాన్యువల్‌గా మనకు నచ్చిట్లుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అయితే, వీటిని ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే ఫీచర్ అందిస్తే బాగుండేది. సైటింగ్ మరియు డ్రైవింగ్ పొజిషన్లకు అనుగుణంగా చాలా సింపుల్‌గా వీటిని అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

నెక్సాన్ ఎలక్ట్రిక్‌లోని వెనుక వరుస సీట్ల గురించి మాట్లాడితే.. టాటా అద్భుతం చేసిందనే చెప్పాలి. సోఫాలో కూర్చూన్నపుడు కలిగే ఫీల్ ఇందులో ఉంటుంది. తల, కాళ్ల ప్రదేశం విశాలంగా ఉంది, సీట్లలో కూర్చున్నపుడు తొడలకు సీట్లు మంచి సపోర్ట్ ఇచ్చి నొప్పి లేకుండా చేస్తాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

క్యాబిన్ లోపల మధ్యలో ఫ్లోర్ సమాంతరంగా కాకుండా దిమ్మెలాంటి ఆకృతి ఉంటుంది. ఏదేమైనప్పటికీ వెనుక వరుస సీటులో ముగ్గురు ప్యాసింజర్లు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. వెనుక సీట్లకు మధ్యలో ఆర్మ్ రెస్ట్ (చేతులు పెట్టుకునేందుకు) రావడంతో మరింత కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

నెక్సాన్ ఇంటీరియర్ వాడకం విషయానికి వస్తే ఎక్కడా నిరుత్సాహపరచదు. దూర ప్రాంత ప్రయాణాలు లేదా ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నపుడు వీలైనంత ఎక్కువ లగేజ్ కోసం చక్కటి బూట్ స్పేస్ కూడా కల్పించారు. నెక్సాన్ ఎలక్ట్రిక్‌లో 350-లీటర్ల స్పోరేజ్ స్పేస్ కలదు, వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో కిందకు మడిపేస్తే లగేజ్ స్పేస్ మరింత పెంచుకోవచ్చు.

Length (mm) 3994
Width (mm) 1811
Height (mm) 1607
Wheelbase (mm) 2498
Ground Clearance (mm) 205
Boot Space (litres) 350
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

వేరియంట్లు, ముఖ్యమైన ఫీచర్లు మరియు సేఫ్టీ

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది, అవి- XM, XZ+ మరియు XZ+ LUX. అన్ని వేరియంట్లలో కూడా దాదాపు అన్ని ముఖ్యమైన ఫీచర్లతో పాటు సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అందించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

ముఖ్యమైన ఫీచర్లు:

  • పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ గల కీలెస్ ఎంట్రీ
  • మల్టీ డ్రైవింగ్ మోడ్స్
  • ఎలక్ట్రిక్ డిక్కీ డోర్ ఓపెనర్
  • 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
  • 16-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
  • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
  • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్
  • లెథర్ సీట్లు
  • ఆటోమేటిక్ రెయిన్ వైపర్లు
  • టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

    సేఫ్టీ ఫీచర్లు:

    • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు
    • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
    • హిల్ స్టార్ట్ అసిస్ట్
    • హిల్ డిసెంట్ కంట్రోల్
    • రివర్స్ పార్కింగ్ కెమెరా & గైడ్‌లైన్స్
    • సీట్ బెల్ట్ రిమైండర్స్
    • హై-స్పీడ్ వార్నింగ్ అలర్ట్
    • పెడస్ట్రైన్(పాదచారులు) సేఫ్టీ
    • టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      డ్రైవింగ్ అనుభూతి మరియు పర్ఫామెన్స్

      ఇండియన్ మార్కెట్లో అందరినీ ఆకట్టుకునే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అందించేందుకు టాటా మోటార్స్ చాలానే కష్టపడింది. సరికొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో టాటా వారి అత్యాధునిక జిప్‌ట్రాన్ డ్రైవ్ సిస్టమ్ అందించింది. ఇందులోని 30.2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ 95kw సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌కు విద్యుత్‌ సరఫరా చేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 128బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కేవలం 9.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 122కిమీలు ఉన్నట్లుగా టాటా వెల్లడించింది. ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్ ఇస్తుంది. అయితే, రియర్ డ్రైవింగ్ కండీషన్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫుల్-ఛార్జింగ్ మీద 275-290కిమీల మధ్య మైలేజ్ ఇచ్చింది.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో స్టాండర్డ్ హోమ్-ఛార్జింగ్ సిస్టమ్ వచ్చింది, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 8 గంటల సమయం పడుతుంది. అయితే, ఫాస్ట్-ఛార్జర్ ద్వారా కేవలం గంట వ్యవధిలో 20%-80% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

      ఇవీ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ టెక్నికల్ వివరాలు.. ముఖ్యమైన ప్రశ్న ఇక్కడుంది.. అసలు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ డ్రైవింగ్ ఫీల్ ఉంది..?

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      యాక్సిలరేషన్ పెడల్ మీద బలం ప్రయోగించడంతో మొదలు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ తక్షణమే అద్భుతమైన పవర్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ కారు కావడంతో టార్క్ కూడా చక్రాలకు క్షణాల్లో చేరిపోతుంది.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో గేర్లు ఉండవు, పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మీదనే నడుస్తుంది. అందుకోసం రెండు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ అందించారు. ఈ రెండు మోడ్స్ మధ్య తేడా చాలా ఈజీ గుర్తించవచ్చు. నార్మల్ మోడల్‌లో యాక్సిరేషన్ నిశ్శబ్దంగా ఉంటూ.. చక్కటి పవర్ ఔట్‌పుట్ వస్తుంది.

      రోటరీ డయల్‌ను నార్మల్ నుండి స్పోర్ట్ మోడ్‌కు మార్చగానే.. పవర్ మరియు టార్క్ వెంటనే చక్రాలకు అందుతుంది. పవర్ డెలివరీ విషయంలో పెట్రోల్/డీజల్ ఎస్‌యూవీలను తలదన్నేలా టాటా మోటార్స్ అద్భుతం చేసిందని చెప్పాలి.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారీ లిథియం-అయాన్ బ్యాటరీ సెటప్ వచ్చింది. కారుకు మధ్యలో వీటిని అమర్చారు. రెగ్యులర్ నెక్సాన్‌తో పోలిస్తే నెక్సాన్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ 40మిమీ వరకు తక్కువగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 290మిమీల నుండి 205మిమీలకు తగ్గించారు. అయినా కూడా పోటీలో దీన్ని తలదన్నే మోడల్ లేదంటే నమ్మండి.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌‌ను IP67-గుర్తింపు పొందిన స్టీల్‌తో కవర్ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ ఎల్‌యూవీని ఎన్నో పరిస్థితుల మధ్య పలు రకాల రోడ్ల మీద ఎన్నో అంశాల పరంగా పరీక్షించారు.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      హ్యాండ్లింగ్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ అత్యంత విలువైన షార్ప్ స్టీరింగ్ అనుభూతినిచ్చింది. స్టీరింగ్ వీల్ పనితీరు పరంగా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుకు మంచి మార్కులు పడ్డాయి. హైవే మీద హైస్పీడులో ఉన్నపుడు దీని స్టీరింగ్ వీల్ పనితీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సిటీ డ్రైవింగ్‌లో స్టీరింగ్ చాలా తేలికగా అనిపించింది. కఠినమైన మలుపుల్లో కూడా ఎంతో సులభంగా తప్పించుకోవడంలో బాగా హెల్ప్ చేసింది.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      గురుత్వాకర్షణ శక్తి కూడా తక్కువగా ఉండటంతో మలుపుల్లో హై-యాక్సిలరేషన్ చేస్తున్నపుడు కూడా కారు స్థిరంగానే ముందుకు వెళుతుంది. అయితే బాడీ రోల్ అవుతుందనే ఫీల్ అక్కడక్కడా అనిపించింది. ఇందులోని సస్పెన్ హైవేలకు బాగా సరిపోతుంది అయితే సిటీ ట్రాఫిక్ కండీషన్స్‌లో చాలా హార్డ్‌గా ఉంది. దీంతో కుదుపులు ప్యాసింజర్ల వరకూ చేరుతాయి.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బ్రేకింగ్ సిస్టమ్ అద్భుతం, ముందు చక్రాలకు డిస్క్ బ్రేకులు మరియు వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు అందించారు. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      నెక్సాన్ ఎలక్ట్రిక్‌లోని NVH (నాయిస్, వైబ్రేషన్స్, హార్స్‌నెస్) లెవల్స్ సంతృప్తికరంగానే ఉన్నాయి. టైర్ నుండి వచ్చే శబ్దం క్యాబిన్‌లోకి వస్తుంది. ఇది మినహాయిస్తే మరెలాంటి సౌండ్స్ ఇందులో వివిపించవు. డ్రైవింగ్‌లో గరుకుతనం మరియు వైబ్రేషన్స్ లెవల్స్ దాదాపు తక్కువే.

      నెక్సాన్ సాంకేతిక వివరాలు

      Electric Motor

      3-Phase Permanent Magnet
      Battery 30.2kWh Lithium-ion
      Power (bhp)

      128
      Torque (Nm)

      245
      Transmission Automatic
      Range (km)

      312
      0-100km/h

      9.9 seconds (Claimed)
      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      ధర, రంగులు మరియు లభ్యత

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, టీల్ బ్లూ (మేము టెస్ట్ డ్రైవ్ చేసిన మోడల్, ఫోటోల్లో చూడవచ్చు), గ్లేసియర్ వైట్ మరియు మూన్‌లైట్ సిల్వర్. టాటా మోటార్స్ దీని ధరలు ఇంకా వెల్లడించలేదు. అయితే నెక్సాన్ ఎలక్ట్రిక్ ధరలు రూ. 15 లక్షల నుండి రూ. 17 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ పూర్తి స్థాయిలో విడుదలైతే, దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇండియా మొత్తం అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. కచ్చితంగా ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు టాటా అఫీషియల్ వెబ్‌సైట్లో చూడవచ్చు.

      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      పోటీ మరియు ఫ్యాక్ట్స్

      కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్. ప్రస్తుతానికైతే దీనికి సరాసరి పోటీనిచ్చే మోడల్ ఏదీ లేదు. అయితే ఇటీవల మార్కెట్లోకి విడుదలైన హ్యుందాయ్ కోనా మరియు అతి త్వరలో రానున్న ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ మోడళ్లకు పోటీనిస్తుంది.

      Model/Specifications నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్
      Electric Motor 3-Phase Permanent Magnet 3-Phase Permanent Magnet
      Battery 30.2kWh Li-ion 44.5kWh Li-ion
      Power (bhp) 128 141
      Torque (Nm) 245 353
      Price (estimated) Rs 15 - 17 Lakh Rs 20 - 25 Lakh
      టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ రివ్యూ: సింగల్ ఛార్జింగ్‌తో 312కిమీల మైలేజ్

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      టాటా మోటార్స్ ఇండియన్ కస్టమర్ల కోసం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఎలక్ట్రిక్. సిటీ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేసిన టాటా నెక్సాన్ హైవే అవసరాలకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. రోజులో 300కిమీల లోపు ప్రయాణించే కస్టమర్లు డైలీ అవసరాలకు నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు. పెట్రోల్/డీజల్ నింపాల్సిన పనిలేదు కాబట్టి రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి.. దీనికి తోడు పర్యావరణాన్ని కూడా కాపాడినవారు అవుతారు.

      బాగా నచ్చిన అంశాలు:

      • తక్షణమే స్పందించే ఇంజన్ మరియు అద్వితీయమైన పవర్ అవుట్‌పుట్ (ప్రత్యేకించి స్పోర్ట్ మోడ్‌లో)
      • సౌకర్యవంతమైన వెనుక సీట్లు
      • రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ పనితీరు
      • నచ్చనివి:

        • సిటీలో సస్పెన్షన్ సిస్టమ్ (కాస్త గట్టిగా ఉంది, స్మూత్ సస్పెన్షన్ ఉంటే బాగుండు)

Most Read Articles

English summary
Tata Nexon EV Review (First Drive): India’s First All-Electric Compact-SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X