టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: కొనవచ్చా...? కొనకూడదా....?

టాటా మోటార్స్ తమ అప్ కమింగ్ ఎస్‌యూవీ నెక్సాన్‌కు ఫస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కల్పించింది. నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ద్వారా నెక్సాన్‌లోని అనుకూల మరియు ప్రతికూల అంశాలను నేటి నెక్సాన్ రివ్యూ కథనంలో..

By Anil

నెక్సాన్ ఎస్‌యూవీ గురించి పరిచయం చేయాలంటే మూడేళ్ల వెనక్కి వెళ్లాలి. సరిగ్గా 2014 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. అప్పటికే ఇండియన్ ప్యాసింజర్ కార్ల విభాగంలో ఎస్‌యూవీలకు మంచి ఆదరణ లభించేది. దీనిని గుర్తించిన టాటా మోటార్స్ కాన్సెప్ట్ దశలో ఉన్న్ నెక్సాన్‌ను ప్రొడక్షన్ దశకు తీసుకొచ్చి ఇప్పుడు విపణిలోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

టాటా మోటార్స్ తమ నెక్సాన్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి, ఇందులోని అనుకూల మరియు ప్రతికూల అంశాలను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ బృందానికి కల్పించింది. ఇవాళ్టి కథనంలో నెక్సా రివ్యూ వివరాలు చూద్దాం రండి...

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

నెక్సాన్ ఎస్‌యూవీని చూసిన తరువాత చాలా మందికి ఓ పట్టాన నచ్చదు. అయితే ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి చాలా ఆలస్యంగా ప్రవేశించింది కాబట్టి ఈ తరహా డిజైన్ తప్పనిసరి. కాంపాక్ట్ ఎస్‌యూవీ, క్రాసోవర్ ఎస్‌యూవీ వంటి సెగ్మెంట్లలో ఉన్న అన్ని మోడళ్లకు ఇప్పుడిది గట్టి పోటీగా నిలిచింది. ప్రధానంగా ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యుత్తమ అమ్మకాలు సాగిస్తున్నమారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్ట్ ఎకోస్పోర్ట్ వంటి ఎస్‌యూవీలను మార్కెట్ నుండి ఎలిమినేట్ సామర్థ్యం నెక్సాన్‌కు ఉంది.

Recommended Video

2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా నెక్సాన్ డిజైన్

ఎస్‌యూవీ సెగ్మెంట్లో నెక్సాన్ విభిన్న డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. టాటా వారి సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఆధారంగా వచ్చిన నెక్సాన్ ఎస్‌యూవీ ముందు భాగం ఉబ్బెత్తుగా ఉంది. టాటా వారి గత ఉత్పత్తుల ఆధారంగా నూతన డిజైన్ లాంగ్వేజ్‌లో నెక్సాన్‌ను అభివృద్ది చేసింది. దీంతో బాక్సీ రూపాన్ని కలిగి ఉంటూనే, అన్ని ట్రెడిషనల్ డిజైన్ లక్షణాలెన్నింటినో కలిగి ఉంది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీలో ఫ్రంట్ డిజైన్ ప్రత్యేకం. ఇప్పటి వరకు ఈ డిజైన్ ఫిలాసఫీలో వచ్చిన టియాగో, టిగోర్, హెక్సా వంటి వాహనాలు ఒకే విధమైన ఫ్రంట్ డిజైన్ కలిగి ఉంటాయి. కండలు తిరిగిన నెక్సాన్ ఎస్‌యూవీలోని ఫ్రంట్ బానెట్ మీద రెండు క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. పెద్ద పరిమాణంలో ఉన్న రెండు హెడ్ ల్యాంప్స్ మధ్యలో హానికాంబ్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ కలదు. హెడ్ ల్యాంప్ క్లస్టర్‌లో కన్ను ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కింది వైపు తెలుగు రంగులో ఉన్న పట్టీ మరియు బంపర్ మీద ఫాగ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, నెక్సాన్ శరీరం మీద ఉన్న విభిన్న రంగులను గుర్తించవచ్చు, ఆకర్షణీయమైన ఫ్లోటింగ్ రూఫ్ టాప్ గ్రే కలర్‌లో మరియు బాడీ మొత్తం ఒకే కలర్‌లో ఉంటుంది. రూఫ్ మరియు బాడీని వేరు చేస్తూ తెలుపు రంగులో ఉన్న పట్టీ కలదు. స్పోర్టివ్ కూపే స్టైల్లో ఉన్న నెక్సాన్ ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ సిరామిక్ పెయింట్ బార్డర్ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. నెక్సాన్‌లో 16-అంగుళాల మెషీన్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ 215/60 ఆర్16 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

నెక్సాన్ రియర్ డిజైన్‌లో ఎక్స్ ఫ్యాక్టర్ ను ఫాలో అయ్యింది. ఎక్స్ ఆకారంలో ఉన్న వైట్ సిరామిక్ ప్లాస్టిక్ స్ట్రిప్‌ రియర్ డిజైన్‌లో కీలకంగా ఉండటంతో X Factor అని వర్ణించడం జరిగింది. పదునుగా రూపొందించిన వెనుక వైపు అద్దం మరియు రూఫ్ టాప్‌కు కొనసాగింపుగా వచ్చిన స్పాయిలర్ ఇందులో ఉంది.

త్రిభుజాకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతూ పోయే తెలుపు ఉన్న రంగులో ఉన్న సిరామిక్ పట్టీని గుర్తించవచ్చు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

350-లీటర్ల కెపాసిటి గల బ్యూట్ స్పేస్ కలదు. లోడింగ్ కాస్త ఎక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ, ఇందులో ఐదు పెద్ద బ్యాగులకు సరిపడా స్పేస్ ఉంది. అధిక స్టోరేజ్ కెపాసిటి కోరుకునే వారు, చివరి వరుస సీటును పూర్తిగే మడిచేస్తే, 690-లీటర్ల వరకు బూట్ స్పేస్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

బాడీ కలర్, రూఫ్ టాప్ కలర్ మరియు అదనపు సిరామిక్ పెయింట్ సొబగులు ఇలా ఒక ఎస్‌యూవీ మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించడం చాలా అరుదు. దీనిని సాధ్యం చేసి చూపింది టాటా.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్

నెక్సాన్ ఇంటీరియర్‌‌లో డిజైన్ మరియు నాణ్యత పరంగా రాజీలేని నిర్మాణాన్ని అందించింది టాటా. డ్యాష్ బోర్డులో మూడు లేయర్స్ ఉన్నాయి. వీటిలో టాప్ లేయర్ డార్క్ గ్రే కలర్‌లో మరియు బీజి కలర్‌లో బాటమ్ లేయర్ ఉంది.

మధ్యలో ఉన్న మరో లేయర్ డ్యాష్ బోర్డ్ ఒక కొననుండి మరో కొనవైపుకు పొడగించబడి ఉన్న మెటాలిక్ గ్రే ఫినిషింగ్‌లో ఉంది. డోర్ హ్యాండిల్స్ కూడా ఇదే కలర్‌లో ఉండటాన్ని గమనించవచ్చు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవర్ మరియు ప్యాసింజర్ లాంగ్ డ్రైవ్‌లో ఎలాంటి అలసట మరియు అసౌకర్యానికి గురికాకుండా అత్యంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఇంటీరియర్‌లోని ముందు భాగాన్ని తీర్చిద్దడం జరిగింది. డ్రైవర్ రోడ్డును క్షుణ్ణంగా వీక్షించేందుకు అడ్జెస్టబుల్ స్టీరింగ్ మరియు సీట్ హైట్ అడ్జెస్ట్ చేసుకునే అవకాశాన్ని టాటా ఇందులో కల్పించింది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

నెక్సాన్ లోని వెనుక వైపు సీటింగ్ ఇద్దరికి విశాలంగానే అనిపించినప్పటికీ, ముగ్గురు పెద్దలు కూర్చోవడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మడివివేసే అవకాశం ఉన్న ఆర్మ్ రెస్ట్ ద్వారా రియర్ సీటింగ్ ఇద్దరికి మాత్రమే వీలవువుతుంది. ఇద్దరి కోసం రెండు హెడ్ రెస్ట్‌లను అందివ్వడం జరిగింది. అయితే వెనువ వరుసలో ముగ్గురు కూర్చుని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ఇబ్బదికరంగా ఉంటుంది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కారులో ఉన్న రియర్ వ్యూవ్ మిర్రర్ ద్వారా వెనుక వైపును గమనిచండానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, కారులోని రియర్ వ్యూవ్ మిర్రర్ అందించిన భాగం ఎక్కువ మందంగా ఉండటం మరియు వెనుక వైపు ఉన్న అద్దం చాలా పొట్టిగా ఉండటం.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్ ఫీచర్లు

టాటా మోటార్స్ నెక్సాన్ ఇంటీరియర్‌లో 6.5-అంగుళాల పరిమాణం ఉన్న హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్ కలదు. దీనిని డ్యాష్ బోర్డు మీద డ్రైవర్‌కు దగ్గరలో అందివ్వడం జరిగింది. టిగోర్ నుండి సేకరించిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు జెస్ట్ నుండి సేకరించిన స్టీరింగ్ వీల్ ఇందులో కలదు. రియర్ పార్కింగ్ కెమెరా ద్వారా డిస్ల్పేను గమనిస్తూ పార్కింగ్ చేయవచ్చు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్ కలదు. దీని ద్వారా కాల్స్ మాట్లాడటం, మేసేజ్ చదవడం మరియు మనం మెసేజ్ చెబితే అదే టైప్ చేసి సెండ్ చేయడం వంటివి చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ పొందవచ్చు. అతి త్వరలో ఆపిల్ కార్ ప్లే ఫీచర్‌ను కూడా అందిస్తామని టాటా ప్రమాణం చేసింది. ఇంటీరియర్‌లో అత్యుత్తమ ఆడియో సిస్టమ్ కోసం హార్మన్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ కలదు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్యాష్ బోర్డుకు క్రిందుగా ఉన్న సెంటర్ కన్సోల్ గ్లోజీ పియానో బ్లాక్ ఫినిష్ కలర్‍‌లో చూడచక్కగా ఉంది. ఎన్నో కంట్రోల్స్‌తో నిండిన ఈ సెంటర్ కన్సోల్ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌గా ఇందులో అందివ్వడం జరిగింది. సెంటర్ కన్సోల్ నుండి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ కండీషనింగ్‌ను నియంత్రించవచ్చు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా మోటార్స్ నెక్సాన్ ఇంటీరియర్‌లో 31 రకాల యుటిలిటి స్పేస్ కల్పించింది. ఇందులో పెద్ద చిల్ల్ గ్లూవ్ బాక్స్, కప్ హోల్డర్స్ మరియు టాబ్లెట్ ట్రేలను అందివ్వడం జరిగింది. స్టోరేజ్ విషయంలో డోర్లు కూడా కీలకపాత్ర పోషించాయి. గొడుగులను డోర్లలో ఉంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సెంటర్ కన్సోల్ విభాగంలో హ్యాండ్ బ్రేక్ తరువాత లోతైన స్టోరేజ్ స్పేస్ కలదు. మరియు నెక్సాన్‌లో తొమ్మిది స్టోరేజ్ హుక్స్ ఉన్నాయి, ఇంటీరియర్‌లో ఐదు, డిక్కీలో నాలుగు హుక్స్ ఉన్నాయి.

ఇంటీరియర్‌లో రెండు 12వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి(ఇందులో ఒకటి డ్యాష్ బోర్డుకు క్రిందుగా, మరొకటి రియర్ పార్శిల్ ట్రే వద్ద కలదు). ఏ/సి వెంట్స్ మరియు బ్లోయర్ కంట్రోల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా తమ నెక్సాన్ ద్వారా వేరబుల్ డివైజ్‌ను కూడా అందిస్తోంది. దీనిని చేతికి వేసుకోవడం ద్వారా ఎస్‌యూవీ డోర్లను, డిక్కీ డోర్‌ను లాక్ మరియు అన్‌లాక్ చేయడం, డ్రైవర్ కారును స్టార్ట్ మరియు స్టాప్ చేయవచ్చు. వీటన్నింటికి కీ వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. టాటా అందించే వేరబుల్ డివైజ్ చాలు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్‌లోని డ్యాష్ బోర్డు మీద కొన్ని చిన్న పరిమాణంలో ఉన్న బటన్స్ ఉన్నాయి. కొన్ని బటన్స్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. అయితే మన అవసరానికి తగ్గట్లుగా ఆ బటన్లను వినియోగించుకోవచ్చు.

సెంటర్ కన్సోల్ మీద ఉన్న రోటరీ డయల్ టైప్ మోడ్ సెలక్టర్ కాస్తంత పెద్దదిగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇంటీరియర్‌లో ఇది అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అయితే డ్రైవర్‌కు దగ్గరలో ఉన్న ఏ/సి వెంట్స్ పూర్తిగా క్లోజ్ అవ్వడం లేదు. దీంతో ఏ/సి డ్రైవర్ చేతులకు అధికంగా అందుతుంది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

భద్రత

టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది. అంతే కాకుండా ఇంటీరియర్‌లో, డే/నైట్ రియర్ వ్యూవ్ మిర్రర్ మరియు ఇమ్మొబిలైజర్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా నెక్సాన్ ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు...

డిజైన్ పరంగా చాలా మంది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అయితే ఇంజన్ పరంగా కూడా నెక్సాన్ విషయంలో టాటా వెనక్కి తగ్గలేదు. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

రెండు ఇంజన్‌లలో మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ అందించింది. అవి, ఎకానమి, సిటి మరియు స్పోర్ట్.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టియాగో మరియు టిగోర్ కార్లలో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను నెక్సాన్‌లో అందివ్వడం జరిగింది. మూడు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ 5,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 108.5బిహెచ్‌పి పవర్ మరియు 1,750-4,000ఆర్‌పిఎమ్ మధ్య 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

పెట్రోల్ ఇంజన్ పనితీరు విషయానికి వస్తే, 1800ఆర్‌పిఎమ్ వరకు కాస్త అలసత్వం ప్రదర్శించినప్పటికీ మిడ్ రేంజ్‌లో బెస్ట్ పవర్ మరియు టార్క్ అందుతుంది. అధిక వేగాన్ని అందుకోవాలంటే, యాక్సిలరేటర్ పెడల్‌తో ఇంజన్‌ మీద ఒత్తిడి పెంచాల్సిందే. స్పోర్ట్ మోడ్‌లో 6,000ఆర్‌పిఎమ్ వద్ద స్పీడో మీటర్ లోని ఎర్రటి లైన్స్‌ను టచ్ చేస్తుంది. శబ్దం, కుదుపులు మరియు కఠినత్వాన్ని అదుపుచేయడంలో టాటా ఇంజనీరింగ్ బృందం అధిక శ్రద్ద వహించింది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా నెక్సాన్‌లో సరికొత్త డీజల్ ఇంజన్ అందించింది. 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 3,750ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 108.5బిహెచ్‌పి పవర్ మరియు 1,500 నుండి 2,750ఆర్‌పిఎమ్ మధ్య 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజల్ పనితీరు మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు. మేము డ్రైవ్ చేస్తున్నపుడు 3,500 నుండి 4,500ఆర్‌పిఎమ్ మధ్య గరిష్ట వేగాన్ని అందుకోగలిగింది. నెక్సాన్ డీజల్ ఎలాంటి వేగం వద్దనైనా అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయగలదు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
పరీక్షించిన మోడల్ టాటా నెక్సాన్
ధర అంచనా రూ. 6 నుండి 9.5 లక్షల మధ్య
ఇంజన్ 1198సీసీ మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1497సీసీ నాలుగు సిలిండర్ల డీజల్
గేర్‌బాక్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్
పెట్రోల్ మోడల్ పవర్ మరియు టార్క్ 108.5bhp @ 5,000rpm/ 170Nm @ 1750-4,000rpm
డీజల్ మోడల్ పవర్ మరియు టార్క్ 108.5bhp @ 3,750rpm/ 260Nm @ 1,500-2,700rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 44-లీటర్లు
గ్రౌండ్ క్లియరెన్స్ 209ఎమ్ఎమ్
నెక్సాన్ బరువు 1237కిలోలు(పెట్రోల్ వేరియంట్) మరియు 1305కిలోలు(డీజల్ వేరియంట్)
టైర్లు గుడ్ ఇయర్ 215/60 ఆర్16
టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

తీర్పు

టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీవి యూత్‌ఫుల్ డిజైన్, కొత్త ఇంజన్ ఆప్షన్స్, విశాలమైన క్యాబిన్ మరియు డిక్కీ స్పేస్, మరియు ప్రతి సాధారణ భారతీయుడు కోరుకునే అతి ప్రధానమైన ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లను అందించింది.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా మోటార్స్ వీటన్నింటిని కలుపుకుని నెక్సాన్ ఎస్‌యూవీని ప్రణాళికాబద్దంగా ప్రారంభ వేరియంట్ రూ. 6 లక్షల నుండి టాప్ ఎండ్ వేరియంట్ రూ. 10 లక్షల ధరలతో విడుదల చేస్తే, ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లోకి టాటా నెక్సాన్ ధరకు తగ్గ ప్యాసింజర్ వెహికల్ అని చెప్పవచ్చు. ఈ ధరల శ్రేణిలో విడుదల చేస్తే, మరో ఆలోచన లేకుండా నెక్సాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా నెక్సాన్ మీద డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాన్సెప్ట్ దశలో ఉన్న నెక్సాన్‌కు, ప్రొడక్షన్ దశకు చేరుకున్న నెక్సాన్‌కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇప్పట్లో విభిన్న డిజైన్ శైలిలో టాటా ప్రయోగాలు చేయడం చాలా ప్రశంసించదగ్గ విషయం. అనాదిగా వస్తున్న బాక్స్ ఆకారంలో ఉన్న కాన్సెప్ట్ ఎస్‌యూవీలకు స్వస్తి పలుకుతూ వస్తున్న నెక్సాన్ టాటాకు భారీ విజయం తెచ్చిపెట్టనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: First Drive: Tata Nexon Review - A Rebel In A Boxy World
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X