కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా మోటార్స్ ఇటీవల తమ సరికొత్త సఫారి ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 'సఫారి' భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. టాటా సఫారీ కేవలం ఇప్పుడు పుట్టుకొచ్చింది మాత్రం కాదు, ఇది 1998 నాటిది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా, టాటా సఫారీ చాలా అప్డేట్స్ పొందింది. అయితే ఇది 2019 లో నిలిపివేయబడింది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇప్పుడు, టాటా మోటార్స్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఏడు సీట్ల ఎస్‌యూవీ ఆఫర్ రూపంలో, ఐకానిక్ ‘సఫారి' నేమ్‌ప్లేట్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కొత్త సఫారి మంచి పెర్ఫామెన్స్ మరియు దృఢమైన నిర్మాణం కలిగి ఉంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

2021 టాటా సఫారి బ్రాండ్ యొక్క సరికొత్త ‘ఇంపాక్ట్ 2.0' డిజైన్ కలిగి ఉంది. అంతే కాకుండా ల్యాండ్ రోవర్ యొక్క ప్రఖ్యాత డి 8 ప్లాట్‌ఫామ్ నుండి తీసుకోబడిన వారి ఒమేగా ఆర్కిటెక్చర్‌తో మిళితం చేస్తుంది. కొత్త టాటా సఫారి బ్రాండ్ యొక్క ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో దాని 5 సీట్ల హారియర్ ఎస్‌యూవీపైన ఉంచబడుతుంది. కొత్త టాటా సఫారీ లాంచ్ దేశీయ మార్కెట్లో 2021 ఫిబ్రవరి నెలలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారీ భారత మార్కెట్లో ప్రారంభించటానికి ముందు, టాటా సఫారీ దాని వారసత్వానికి అనుగుణంగా ఉందో, లేదో తెలుసుకోవడానికి మేము సరికొత్త 7 సీట్స్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. మేము కొత్త టాటా సఫారిని బెంగళూరు రోడ్స్ మరియు హైవే మీద డ్రైవ్ చేసాము.. కొత్త టాటా సఫారీ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

డిజైన్ మరియు స్టైలింగ్ :

కొత్త టాటా సఫారి దాని చిన్న ఐదు సీట్ల హారియర్ ఎస్‌యూవీతో సమానమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క ముందు నుండి మొదలుకొని సి-పిల్లర్ వరకు, టాటా సఫారి మరియు హారియర్ రెండూ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. అయితే వీటి మధ్య ఉన్న ఏకైక మార్పు సఫారిలో కనిపించే కొత్త ట్రై-యారో మెష్ గ్రిల్.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

కొత్త సఫారి ఎస్‌యూవీ హారియర్ మాదిరిగానే డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి, దాని క్రింద మెయిన్ జినాన్ హెచ్‌ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి.

టాటా సఫారి అదే మెయిన్ హెడ్‌ల్యాంప్ యూనిట్‌కు దిగువన దాని ఫాగ్ లాంప్స్ కలిగి ఉంది. సఫారి ఫ్రంట్ బంపర్లలో బ్లాక్ క్లాడింగ్ తో వస్తుంది, ఇది సెంట్రల్ ఎయిర్ ఇన్టేక్, దిగువన సిల్వర్ ఫినిషెడ్ స్కిడ్ ప్లేట్ తో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ సైడ్స్ మరియు వెనుక వైపున బ్లాక్ క్లాడింగ్స్ కలిగి ఉంటుంది. టాటా సఫారిలో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్స్, హౌసింగ్ 18-ఇంచ్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ ORVM కవర్లు, క్రోమ్ విండో లైన్ మరియు డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇంతకు ముందు చెప్పినట్లుగానే సి-పిల్లర్ వరకు సఫారి ఎస్‌యూవీ దాని చిన్న 5 సీట్స్ మోడల్స్ కి సమానంగా ఉంటుంది.అయితే హారియర్‌తో పోలిస్తే సఫారిలో ప్రధానంగా గుర్తించదగిన లాంగ్ ఓవర్‌హాంగ్, పెద్ద క్వార్టర్ ప్యానెల్ మరియు నిటారుగా ఉన్న వెనుక భాగం మాత్రమే. ఏడు సీట్ల ఎస్‌యూవీలో ‘సఫారి' ఇన్స్క్రిప్సన్, స్టెప్డ్ రూఫ్‌తో క్రోమ్ ఇన్సర్ట్‌లతో రూప్ రైల్స్ కలిగి ఉంది. ఈ కొత్త సఫారి ఎస్‌యూవీ, దాని యొక్క పాత తరాలకు నివాళి అనే చెప్పాలి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇక ఈ టాటా సఫారీ యొక్క వెనుక వైపుకు వచ్చినట్లైతే ఈ ఎస్‌యూవీ కొత్త బూట్ లిడ్ ని కలిగి ఉంది. కానీ ఇది మునుపటి కంటే నిటారుగా ఉంది, ఎల్‌ఈడీ టైల్ లైట్ అడ్జస్ట్ సెట్‌తో పాటు, గ్లోస్-బ్లాక్ ఫినిష్డ్ ఎలిమెంట్‌తో అనుసంధానించబడి, టాటా లోగోను దాని మధ్యలో కలిగి ఉంటుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

అంతే కాకుండా వెనుకవైపు రూప్ మౌంటెడ్ స్పాయిలర్ దాని మధ్యలో ఎల్‌ఈడీ స్టాప్ లైట్‌ కలిగి ఉంటుంది. అయితే బూట్ నంబర్ ప్లేట్ క్రింద మధ్యలో ఉంచబడిన ఒకే ‘సఫారి' బ్యాడ్జింగ్‌ను అందుకుంటుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

మొత్తంమీద టాటా సఫారి మంచి డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఇది దాని మునుపటి మోడల్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ తో ముందుకు వెళ్తుంది. టాటా సఫారి దాని పొడవైన ఓవర్‌హాంగ్ మరియు అప్‌డేట్ చేసిన స్టైలింగ్‌తో, రహదారిపై కమాండింగ్ ఉనికిని అందిస్తుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఇది దాని వినియోగదారులచే ప్రశంసించబడుతుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇంటీరియర్స్, ఫీచర్స్ మరియు ప్రాక్టికాలిటీ:

కొత్త టాటా సఫారీ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇక్కడ మళ్ళీ టాటా సఫారి తన ఐదు సీట్ల మోడల్ మాదిరిగానే ఒక లేఅవుట్‌తో ముందుకు తీసుకువెళుతుంది. సఫారి ఎస్‌యూవీ హారియర్ మాదిరిగానే ఫీచర్స్, ఎక్విప్‌మెంట్ మరియు టెక్నాలజీతో వస్తుంది. ఏదేమైనా, ఈ ఏడు సీట్ల సఫారీ ఇప్పుడు డాష్ బోర్డు మరియు క్యాబిన్ చుట్టూ సాఫ్ట్-టచ్ మెటీరియల్‌ను కలిగి ఉంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా మోటార్స్ సఫారి ఇంటీరియర్‌లపై కొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. డాష్‌బోర్డ్ స్మూత్ టచ్ నాప్ప లేయర్ లో, ‘ఆష్‌వుడ్' ట్రిమ్ సిగ్నేచర్ కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్, లెదర్ తో చుట్టబడి ఉంటాయి. డాష్‌బోర్డ్‌లో, ఎసి వెంట్స్ చుట్టూ మరియు స్టీరింగ్ వీల్‌పై సిల్వర్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ క్యాబిన్ లోపల ప్రీమియం రూపాన్ని మరియు అనుభూతిని కలిగిస్తాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారిలోని సీట్లు ప్రీమియం బెనెక్ కాలికో ఓస్టెర్ వైట్ పెర్ఫోర్టెడ్ లెదర్ ఆఫోల్స్ట్రే లో పూర్తయ్యాయి. పెద్ద విండోస్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న తెల్లని ఆఫోల్స్ట్రే, మూడవ వరుసలో ఉన్నవారితో సహా ప్రయాణీకులందరికీ క్యాబిన్‌కు లైటింగ్ అందించడమే కాకుండా చాలా మంచిఅనుభూతిని కలిగిస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

కొత్త టాటా సఫారీ యొక్క సీట్ల విషయానికి వస్తే, ఇందులో రెండు సీట్ల కాన్ఫిగరేషన్లలో ఎస్‌యూవీని అందిస్తున్నారు. ఇందులో రెండవ వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లతో ఆరు సీట్ల వెర్షన్ లేదా బెంచ్ సీట్లతో ఏడు సీట్ల వెర్షన్ ఉన్నాయి. రెండు వేరియంట్లు, అయితే, మూడవ వరుసలో బెంచ్ సీట్లను ప్రామాణికంగా కలిగి ఉంటాయి. మూడు వరుసల సీట్లు ఒకే ప్రీమియం లెదర్ ఆఫోల్స్ట్రే లో పూర్తవుతాయి. ఇవన్నీ వాహనదారునికి చాలా మంచి అనుభూతిని కలిగిస్తాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే రెండూ వెంటిలేషన్ పర్ఫామెన్స్ ను కోల్పోతాయి. డ్రైవర్ సీటు ఎలక్ట్రానిక్ హైట్ మరియు లంబర్ సఫోర్ట్ అడ్జస్టబిలిటీ తో వస్తుంది. ముందు మరియు రెండవ వరుస సీట్లు ప్రయాణీకులందరికీ మంచి హెడ్‌రూమ్ మరియు లెగ్‌రూమ్‌ను కూడా అందిస్తాయి. రెండవ వరుసలోని బెంచ్ మరియు కెప్టెన్ సీట్లు రెండూ అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తాయి, మంచి అండర్-థాయ్ సఫోర్ట్ కూడా అందిస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

రెండవ వరుసలోని బెంచ్ సీట్లు వన్-టచ్ టంబుల్ ఫంక్షన్‌తో వస్తాయి, కానీ ఎసి వెంట్స్ కోల్పోతాయి. మూడవ వరుస సీట్లు కొంచెం ఇరుకైన అనుభూతి కలిగిస్తాయి. ఈ వరుసలో లెగ్‌రూమ్ మరియు అండర్ థాయ్ సఫోర్ట్ తో పిల్లలకు, ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌లలో బాగా సరిపోతుంది. మూడవ వరుసలో ఎసి వెంట్స్ ఉన్నాయి, వాటితో పాటు అనేక స్టోరేజ్ స్పేస్, మొబైల్ హోల్డర్లు మరియు ఛార్జింగ్ సాకెట్లు వంటివి కూడా ఉన్నాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారి హారియర్ నుండి అదే 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ముందుకు వెళ్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోని టచ్ ఆపరేషన్ పెద్ద మరియు సరళమైన లేఅవుట్‌తో ప్రతిస్పందిస్తుంది, ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆపరేట్ చేయడం సులభం చేస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

సఫారిలోని ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ బ్రాండ్ యొక్క ఐఆర్ఎ కనెక్టెడ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది మొదట టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బోలో ప్రారంభమైంది. ఐఆర్ఎ టెక్నాలజీ లొకేషన్ బేస్డ్ సర్వీస్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, రిమోట్ వెహికల్ కంట్రోల్, సేఫ్టీ ఫీచర్స్ మరియు గేమిఫికేషన్ నుండి అదనపు కార్యాచరణలను అందిస్తుంది. టచ్ స్క్రీన్ వాయిస్ అసిస్ట్ తో వస్తుంది. ఇది హిందీ, ఇంగ్లీష్ మరియు హింగ్లిష్ భాషలలో 70 కి పైగా ఆదేశాలను అర్థం చేసుకోగలదు.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారి కనెక్టెడ్ ఫీచర్స్ తో పాటు, ఇతర పరికరాలతో నిండి ఉంది. వీటిలో ఎక్కువ భాగం దాని 5-సీట్ల మోడల్ నుంచి తీసుకువెళ్ళబడ్డాయి. వీటిలో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ (ఆడియో మరియు కాల్ ఫంక్షనాలిటీల కోసం) వంటివి ఉన్నాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

కొత్త సఫారిలో మరొక ముఖ్యమైన మార్పు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ను చేర్చడం. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ను చేర్చడం ఇప్పుడు టాటా మోటార్స్‌కు కన్సోల్‌లో స్థలాన్ని ఖాళీ చేయడానికి అనుమతించింది. దాని స్థానంలో ఎక్కువ కప్ హోల్డర్లను జోడించింది. సఫారి 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మూడవ వరుసకు ఎసి వెంట్స్ ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇక టాటా సఫారి యొక్క ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీలో స్టోరేజ్ స్పేసేస్, క్యూబి ఏరియాస్ మరియు కప్ హోల్డర్లు పుష్కలంగా ఉన్నాయి. రెండవ మరియు మూడవ వరుస ప్రయాణీకులకు 12V-సాకెట్లు, USB ఛార్జింగ్ పోర్టులతో సహా మల్టిపుల్ ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారిలో మూడవ వరుస సీట్లు 50:50 స్ప్లిట్‌తో వస్తాయి. అయితే ఇందులో ఉన్న ఏడు సీట్ల వెర్షన్‌లో రెండవ వరుస సీట్లు 60:40 సీట్ల స్ప్లిట్‌తో అందించబడతాయి. సఫారిని వేర్వేరు సీట్ల ఫోల్డ్డింగ్ కాన్ఫిగరేషన్స్ తో ఉపయోగించవచ్చు. ఏదేమైనా, రెండవ మరియు మూడవ వరుస సీట్లు రెండూ ముడుచుకొని ఉండటంతో, ఎస్‌యూవీ గరిష్టంగా 1658 లీటర్ల లగేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్ :

టాటా సఫారి అదే 2.0-లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజిన్‌తో ముందుకు తీసుకువెళుతుంది. ఇది హారియర్ ఎస్‌యూవీకి శక్తినిస్తుంది. ఇంజిన్ యొక్క లేటెస్ట్ బిఎస్ 6 కంప్లైంట్ వెర్షన్ 168 bhp మరియు 350 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో జతచేయబడుతుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇంజిన్ 2WD సిస్టం ద్వారా చక్రాలకు శక్తినిస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్‌తో సహా వేరియంట్లు ఏవీ ఐచ్ఛిక 4WD సిస్టమ్‌తో రావు. ‘సఫారి' నేమ్‌ప్లేట్‌తో ఉన్న మునుపటి మోడల్స్ అన్ని 4WD సిస్టం కలిగి ఉన్నాయని మరియు ఆఫ్-రోడర్‌లు సామర్థ్యం ఉన్నాయని పరిగణనలోకి తీసుకుంటే ఇది నిరాశపరిచింది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారిలోని ఇంజిన్ మంచి శక్తిని అందిస్తుంది. ఇది చాలా మృదువైనదిగా అనిపిస్తుంది. పవర్ డెలివరీ సింపుల్ గా ఉంటుంది. హారియర్‌తో పోలిస్తే సఫారి యొక్క అదనపు బరువు ఖచ్చితంగా ఇంజిన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏదేమైనా, ఏ సమయంలోనైనా ఇంజిన్ మందగించినట్లుగా లేదా తక్కువ శక్తితో ఉన్నట్లు అనిపించదు.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

సఫారిలో మిడిల్ రేంజ్ అద్భుతమైనది, పెద్ద ఎస్‌యూవీని ఎటువంటి ఒత్తిడి లేకుండా ట్రిపుల్ నెంబర్ వేగంతో సజావుగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. హై ఎండ్ వైపు మంచి శక్తి కూడా ఉంది, అయితే, కారు మధ్య శ్రేణిలో చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఇంజిన్ అన్ని విధాలా మంచి శక్తిని అందిస్తుంది. ఇది హైవే మీద అద్భుతమైన పర్ఫామెన్స్ చూపిస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మృదువైనది, ఇది సులభమైన మరియు ఫాస్ట్ గేర్ షిఫ్ట్ కి అనుమతిస్తుంది. గేర్లు ఎటువంటి కుదుపు లేకుండా సులభంగా స్లాట్ అవుతాయి. గేర్‌బాక్స్‌లో షార్ట్ త్రోలు ఉన్నాయి, ఇది లైట్ క్లచ్‌తో కలిపి, నగరంలో కూడా గేర్ షిఫ్ట్‌లను సులభంగా పని చేస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారి యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లు రెండూ వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లతో అందించబడతాయి. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్ మోడ్స్. ఈ మూడింటి మధ్య గుర్తించదగిన వ్యత్యాసం లేకపోలేదు. ఎకో మరియు సిటీ మోడ్ మెరుగైన ఇంధన వ్యవస్థను అందించడానికి ట్యూన్ చేయబడినప్పటికీ, స్పోర్ట్ మోడ్ పేరుకు తగినట్లుగానే మంచి డ్రైవింగ్ ఫీచర్ అందిస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

ఇంజిన్ యొక్క పవర్ డెలివరీ కూడా మూడు మోడ్‌ల మధ్య గణనీయంగా మారుతుంది. సిటీ మరియు ఎకో మోడ్‌లో పవర్ డెలివరీ కొంత సరళంగా ఉన్నప్పటికీ, నగరం మరియు హైవే పరిస్థితులలో మెరుగైన ఇంధన వ్యవస్థను అనుమతిస్తుంది. ‘స్పోర్ట్' మోడ్ తక్షణమే రెస్పాండ్ అవుతుంది. చిన్న త్రాటల్ ఇన్‌పుట్‌లు కూడా మంచి అభిప్రాయాన్ని అందిస్తాయి. గేర్ షిఫ్టులు కూడా ఆలస్యం అవుతాయి, ఇది టాటా సఫారికి మరింత దూకుడుగా మరియు స్పోర్టి డ్రైవింగ్ లక్షణాన్ని ఇస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారీ యొక్క ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ కలిగి ఉంది. గేర్ షిఫ్ట్‌లు కారును గట్టిగా నెట్టివేసినప్పుడు కూడా మారడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది, ఇది సరదాగా-డ్రైవ్ చేయడానికి కొంత ఆటంకం కలిగిస్తుంది. అయితే, కారు స్పోర్ట్ మోడ్‌కు మారినప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా మెరుగుపడుతుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

సస్పెన్షన్, బ్రేక్స్ అండ్ హ్యాండ్లింగ్ :

టాటా సఫారి పెద్ద ఎస్‌యూవీ, అయితే, కంపెనీ 7 సీట్ల ఎస్‌యూవీలో మంచి స్థిరత్వం మరియు నిర్వహణను అందించగలిగింది. స్టీరింగ్ వీల్ మంచి రెస్పాన్స్ కలిగి ఉంటుంది మరియు మంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది. స్టీరింగ్ అధిక వేగంతో మెరుగ్గా ఉండేది, ఇది ఎస్‌యూవీని మరింత కఠినంగా నెట్టడానికి డ్రైవర్ యొక్క విశ్వాసాన్ని బాగా మెరుగుపరుస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

టాటా సఫారీ పెద్దది అయినప్పటికీ, సాపేక్షంగా అధిక వేగంతో ప్రయాణించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సఫారి యొక్క సస్పెన్షన్ కొంచెం మృదువైన వైపు ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

టాటా సఫారి యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రేకులు మంచి ప్రతిస్పందనను అందిస్తాయి. ఈ కారణంగా ఇది పెద్ద ఎస్‌యూవీ అయినప్పటికీ వెంటనే నిలిపివేయడానికి అనుమతిస్తుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

వేరియంట్స్, కలర్స్ మరియు ప్రైస్:

భారతదేశంలో ఒకసారి ప్రవేశపెట్టిన టాటా సఫారి ఆరు వేరియంట్లలో అందించనుంది. అవి XE, XM, XT, XT +, XZ మరియు XZ + వేరియంట్లు. సఫారి యొక్క XM, XZ మరియు XZ + మిడ్ మరియు టాప్-స్పెక్ వేరియంట్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించబడతాయి. మిగిలిన మూడు వేరియంట్స్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడతాయి.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

స్టాండర్డ్‌గా అన్ని వేరియంట్‌లు రెండవ వరుసలో బెంచ్ సీట్లతో వస్తాయి. కెప్టెన్ సీట్లతో టాప్-స్పెక్ ఎక్స్‌జెడ్ + వేరియంట్‌తో అందిస్తారు.

భారతదేశంలో ఒకసారి ప్రారంభించిన టాటా సఫారి మూడు కలర్ అప్సన్స్ తో అందించబడుతుంది. అవి రాయల్ బ్లూ, ఓర్కస్ వైట్ & డేటోనా గ్రే. అయితే ప్రస్తుతానికి ఈ ఎస్‌యూవీ ధర తెలియదు కానీ, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే సమయంలో ఈ ఎస్‌యూవీ ధర నిర్ణయించాల్సి ఉంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

కాంపిటీషన్స్ మరియు ఫాక్ట్ చెక్ :

భారత మార్కెట్లో ఒకసారి ప్రవేశపెట్టిన టాటా సఫారి దాని ఐదు సీట్ల హారియర్ పైన ఉంటుంది. టాటా సఫారి దేశీయ మార్కెట్లో ఎంజి హెక్టర్ ప్లస్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 500 లతో పాటు రాబోయే 7 సీట్ల హ్యుందాయ్ క్రెటా మరియు 7 సీట్ల జీప్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

టాటా సఫారి ఇప్పుడు భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా ఉంటుంది. నేడు ఆధునిక యుగంలో వాహనదారులు ఊహిస్తున్న దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. అంతే కాకుండా ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఏది ఏమైనా టాటా సఫారీ మళ్ళీ తన పేరుని ఖచ్చితంగా నిలబెట్టుకోగలదు.

Most Read Articles

English summary
Tata Safari First Drive Review. Read in Telugu.
Story first published: Sunday, January 31, 2021, 17:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X