టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) చాలా కాలంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. టొయోటా బ్రాండ్ కు ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ మోడళ్లు తెచ్చిన పాపులరాటినీ మరే ఇతర మోడల్ తీసుకురాలేకపోయింది. టొయోటా నుండి ఇప్పటి వరకూ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఎలాంటి ఉత్పత్తి అందుబాటులో ఉండేది కాదు. ఈ విభాగంలో చాలా కాలంగా హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో, క్రెటా జోరుకు బ్రేకులు వేసేందుకు టొయోటా ఓ సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేంది.

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తన సత్తా చూపేందుకు టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) పేరిట సరికొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఆషామాషీ ఎస్‌యూవీ కాదు, విభాగంలోనే మైల్డ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌లతో లభించే మొట్టమొదటి మిడ్-సైజ్ ఎస్‌యూవీ. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మేము ఇటీవలే బెంగుళూరు రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేశాము.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

మరి, భారత మార్కెట్లో ఈ జపనీస్ ఎస్‌యూవీ, కొరియన్ ఎస్‌యూవీని ఢీకొట్టగలదా..? హైరైడర్ నిజంగానే 'హై' గా ఉంటుందా..? దీని హైబ్రిడ్ ఇంజన్ పనితీరు ఎలా ఉంది..? మార్కెట్లో ఇది టొయోటాకి గేమ్ ఛేంజర్ అవుతుందా..? మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ డీటేల్డ్ రివ్యూలో తెలుసుకుందాం రండి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - ఎక్స్టీరియర్స్

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ను మొదటిసారిగా ముందు నుండి చూసేవారు, అది కియా కారెన్స్ అని పొరపాటు పడే అవకాశం ఉంటుంది. చిన్నపాటి ట్వీక్స్ తప్పించి ఈ రెండు మోడళ్లు ముందు వైపు నుండి ఒకేరకమైన డిజైన్ శైలిని కలిగి ఉంటాయి. సరే, ఆ విషయం అటుంచి, టొయోటా హైరైడర్ విషయానికి వస్తే, ఇప్పటి వరకూ మనం చూసిన మారుతి బాలెనో-టొయోటా గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా-అర్బన్ క్రూయిజర్ వంటి క్లోనింగ్ మోడళ్ల మాదిరిగా కాకుండా, టొయోటా ఈసారి హైరైడర్ విషయంలో కొత్తగా ప్లాన్ చేసింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

అదేంటంటే, టొయోటా తమ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ను పూర్తిగా స్క్రాచ్ నుండి డెవలప్ చేసింది, ఇందులో ఉపయోగించిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కూడా పూర్తిగా టొయోటాకు చెందినదే. అంతేకాదు, ఈ కారును ఇదివరకటిలా మారుతి సుజుకి ఫ్యాక్టరీలలో కాకుండా, టొయోటా తమ బెంగుళూరు ఫ్యాక్టరీలో స్వయంగా తయారు చేస్తోంది. ఇలా తయారు చేసిన కారునే, తిరిగి మారుతి సుజుకి సంస్థకు "గ్రాండ్ విటారా" పేరుతో విక్రయిస్తోంది (అది వేరే విషయం అనుకోండి).

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

ఇక అర్బన్ క్రూయిజర్ పరిచయాన్ని పక్కకు పెట్టి, దాని డిజైన్ శైలిని పరిశీలిస్తే, ఇప్పటి వరకూ మనం చూసిన టొయోటా కార్లకు ఈ కొత్త టొయోటా కారుకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న బలమైన పోటీని గట్టిగా ఎదుర్కునేందుకు టొయోటా తమ హైరైడర్ ఎస్‌యూవీని కూడా అంతే బలమైన రోడ్ ప్రజెన్స్‌తో డిజైన్ చేసింది. ఈ ఎస్‌యూవీ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్‌లో కనిపించే బలమైన క్రీజ్ లైన్లు కారుకి మంచి మజిక్యులర్ లుక్‌ని తెచ్చిపెడుతాయి. అందుకే, చాలా మంది దీనిని మినీ ఫార్చ్యూనర్‌గా పిలుస్తుంటారు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు ఎల్ఈడి హెడ్‌లైట్లు అన్నీ కూడా ఒకే హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో అమర్చబడి ఉంటాయి. ఈ రెండు హెడ్‌లైట్లు కూడా ఇరు వైపులా క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడినట్లుగా ఉంటాయి మరియు ఈ క్రోమ్ స్ట్రిప్ కి మధ్యలో టొయోటా బ్యాడ్జ్ ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్ కి ఎగువ భాగంలో ఉండే పియానో బ్లాక్ ఇన్‌సెర్ట్ పై ఈ క్రోమ్ స్ట్రిప్స్ అంటించబడి ఉంటాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

ఫ్రంట్ బంపర్ పెద్ద హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్ ను కలిగి ఉంటుంది. ఈ గ్రిల్ లోనే ఎయిర్ ఇన్‌టేక్ కూడా ఉంటుంది. ముందు నుండి చూసినప్పుడు ఈ గ్రిల్ కారు ఫ్రండ్ డిజైన్ మొత్తాన్ని ఆక్రమించినట్లుగా కనిపిస్తుంది. బంపర్ కి ఎగువ భాగంలో ఇరువైపులా క్రోమ్ సరౌండిగ్ తో కూడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ ఉంటుంది మరియు దిగువ భాగంలో గ్రే కలర్ ఇన్‌సెర్ట్ ఉంటుంది, ఇది చూడటానికి స్కిడ్ ప్లేట్ లాంటి లుక్‌ని ఇస్తుంది. మొత్తమ్మీద, ఫ్రంట్ ప్రొఫైల్‌లో కనిపించే క్రీజ్ లైన్స్ మరియు బానెట్‌పై ఉండే బాడీ లైన్స్ తో టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ చక్కటి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉండి, మొదటి చూపులోనే మీ దృష్టిని ఆకట్టుకునేలా ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

సైడ్ నుంచి చూసినప్పుడు ఇక్కడ ప్రధానంగా అందరి దృష్టిని ఆకట్టుకునేది దాని స్టైలిష్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అని చెప్పొచ్చు. కొద్దిగా ఉబ్బినట్లుగా ఉండే వీల్ ఆర్చ్‌లు, వాటిపై ఉండే సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, బ్లాకవుట్ చేయబడిన A, B, C పిల్లర్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ లో ఉండే సైడ్ మిర్రర్స్, విండో లైన్ క్రింది భాగంలో ఉండే క్రోమ్ స్ట్రైప్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఫ్లోటింగ్ డ్యూయెల్ టోన్ రూఫ్ లైన్ మొదలైన హైలైట్స్ ఈ హైరైడర్ లో కనిపిస్తాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

ఇక వెనుక భాగంలో, టొయోటా బ్యాడ్జ్‌ని కలిగి ఉన్న క్రోమ్ బార్ మరియు దాని ద్వారా కనెక్ట్ చేయబడినట్లుగా ఉండే స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ ని అంటిపెట్టుకుని ఉండే స్పాయిల్ మరియు అందులోని హై-మౌంట్ బ్రేక్ లైట్, రియర్ బంపర్ లో నిలువుగా అమర్చిన రివర్సింగ్ లైట్స్ మరియు బంపర్ దిగువ భాగంలో ఉండే ఫాక్స్ స్కిడ్ ప్లేట్ లతో ఇది వెనుక వైపు నుండి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్ మాదిరిగానే రియర్ ప్రొఫైల్ కూడా బలమైన క్రీజ్ లైన్స్ మరియు కట్స్‌తో మంచి రోడ్ ప్రజెన్స్‌ని కలిగి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - ఇంటీరియర్స్

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో బలమైన మరియు అంతే ప్రీమియం అయిన ఎస్‌యూవీని అందించాలనే ఉద్దేశ్యంతో టొయోటా ఈ కారుని వెలుపల మాత్రమే కాకుండా లోపలి వైపు కూడా చాలా అందంగా మరియు అంతే విలాసవంతంగా తీర్చిదిద్దింది. డోర్ ఓపెన్ చేయగానే మీకు టొయోటా హైరైడర్ లోని డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ థీమ్‌ ఇంటీరియర్ స్వాగతం పలుకుతుంది. చాలా కార్లలో కనిపించే బోరింగ్ బేజ్ కలర్ ఇంటీరియర్ మాదిరిగా కాకుండా, కంపెనీ ఇందులో బ్రౌన్ కలర్ ఇంటీరియర్ ను ఎంచుకోవడం స్వాగతించదగిన విషయం.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

కారు క్యాబిన్ లోపల ప్రతిచోటా సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ కనిపిస్తాయి మరియు ఇందులోని పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ క్యాబిన్ ను చాలా విశాలంగా కనిపించేలా చేస్తుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లోని డ్యాష్‌బోర్డ్ అనేక లేయర్లతో చాలా సంక్లిష్టంగా కనిపిస్తుంది, అయినప్పటికీ ఇది ప్రత్యేకంగానే ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ లో కుడివైపున డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు మధ్య బాగంలో పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నట్లుగా ఉంటాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

హైరైడర్ లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది మరియు Android అలాగే iOS యూజర్ల కోసం వాయిస్ అసిస్టెంట్‌ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్క్రీన్ 360-డిగ్రీ కెమెరాకు అవుట్‌పుట్ స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. డోర్ ట్రిమ్స్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ పై మ్యాట్ సిల్వర్ ఫినిష్డ్ యాక్సెంట్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి మరియు ఇవి క్యాబిన్ యొక్క స్టైలింగ్ ను పెంచడంలో సహకరిస్తాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

ఈ కారులో రిమోట్ ఇగ్నిషన్ ఆన్/ఆఫ్, రిమోట్ ఏసి కంట్రోల్స్, డోర్ లాక్/అన్‌లాక్, స్టోలెన్ వెహికల్ ట్రాకర్ మరియు ఇమ్మొబిలైజర్ వంటి అనేక అధునాతన కనెక్టింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. యూజర్లు వీటన్నింటిని టొయోటా యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు మరియు కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించి కూడా కంట్రోల్ చేయవచ్చు. క్యాబిన్ లోపల స్టోరేజ్‌కి కూడా ఎక్కడా ఢోకా లేదు, నాలుగు డోర్లపై వాటర్ బాటిళ్లను ఉంచుకునేందుకు స్టోరేజ్ స్థలం, పెద్ద గ్లవ్ బాక్స్ మరియు డీప్ డోర్ పాకెట్స్‌తో కొన్ని క్యూబీ హోల్స్ కూడా ఉన్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

ఫీచర్ రిచ్ ఎస్‌యూవీ అయిన టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఒకవేళ మీకు క్యాబిన్‌లో మరింత స్టోరేజ్ అవసరమైతే 60:40 స్ప్లిట్‌తో రిక్లైనింగ్ రియర్ సీట్లు, 255 లీటర్ బూట్‌ స్పేస్, , హెడ్స్ అప్ డిస్‌ప్లే, పాడిల్ షిఫ్టర్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెనుక ప్రయాణీకుల కోసం ఏసి వెంట్‌లు మరియు USB పోర్ట్‌లు, యాంబియంట్ లైటింగ్ మరియు ట్రంక్ కోసం బూట్ లైట్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

అన్నింటికన్నా ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, టొయోటా తమ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫ్యూచర్ రెడీ సేఫ్టీ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉంచడం కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - స్పెసిఫికేషన్లు

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగానే టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒక హైబ్రిడ్ ఎస్‌యూవీ మరియు ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో రెండు రకాల హైబ్రిడ్ పవర్‌ట్రైన్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది మైల్డ్-హైబ్రిడ్ యూనిట్, రెండవది స్ట్రాంగ్-హైబ్రిడ్ యూనిట్. టొయోటా వీటిలో మైల్డ్-హైబ్రిడ్ యూనిట్‌ను తమ భాగస్వామి అయిన మారుతి సుజుకి నుండి తీసుకోబడింది. కాగా, సెల్ఫ్-చార్జింగ్ టెక్నాలజీతో కూడిన స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను టొయోటా క్యామ్రీ నుండి తీసుకోబడింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

మారుతి సుజుకి అందించే 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ గురించి అందరికీ తెలిసినదే, మారుతి సుజుకి ఇప్పటికే అనేక మోడళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. పేరుకు తగినట్లుగానే ఈ ఇంజన్ పనితీరు కూడా చాలా మైల్డ్ గానే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌తో కూడిన ఈ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 101.65 బిహెచ్‌పి పవర్ ను మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

ఇక అసలైన మరియు బలమైన పవర్‌ట్రైన్, అదేనండి టొయోటా యొక్క స్వంత 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ ఇంజన్, ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు సెల్ఫ్ చార్జింగ్‌తో కూడిన పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మేము టెస్ట్ డ్రైవ్ చేసింది కూడా ఈ బలమైన హైబ్రిడ్ వేరియంట్‌నే. కేవలం పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 91.1 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 79.1 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

అయితే, హైరైడర్‌కు లీటరు ఇంధనంపై 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఫిగర్‌ను అందించడం కోసం, ఈ హైబ్రిడ్ ఇంజన్ యొక్క అవుట్‌పుట్ ను కేవలం 114 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ ముందు చక్రాలకు శక్తిని పంపిణీ చేసే e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కోసం వెతికినా మీకు లభించదు. ఇక కొలతల విషయానికి వస్తే, హైరైడర్ 4,365 మిమీ పొడవు, 1,795 మిమీ వెడల్పు మరియు 1,645 మిమీ ఎత్తు మరియు 2,600 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉండి, 1,755 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డ్రైవింగ్ ఇంప్రెషన్స్

పైన చెప్పినట్లుగా, మేము అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను మాత్రమే టెస్ట్ డ్రైవ్ చేశాము. ఈ కారుతో టొయోటా అధిక మైలేజీని క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, రియల్ వరల్డ్ డ్రైవింగ్ కండిషన్స్‌లో కంపెనీ పేర్కొన్న మైలేజ్ ఫిగర్ (సుమారు లీటరుకు 28 కిలోమీటర్లు)ను సాధించడం పూర్తిగా అసాధ్యమనే చెప్పాలి. ఈ బలమైన హైబ్రిడ్ కారు మీ ఫ్యూయెల్ ట్యాంక్ లోని ఇంధనాన్ని ఖచ్చితంగా "గుటకాయ స్వాహా" చేస్తుంది. దురదృష్టవశాత్తూ, మా ఈ 'ఫస్ట్ డ్రైవ్'లో ఉన్న టైమ్ లిమిట్ కారణంగా, టొయోటా పేర్కొన్న మైలేజ్ ఫిగర్‌ను మేము ఖచ్చితంగా పరీక్షించలేకపోయాము.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

అయితే, ఈ టెస్ట్ డ్రైవ్ సమయంలో మేము గుర్తించిన విషయం ఏంటంటే, టొయోటా హైరైడర్ ఇంధనాన్ని "తక్కువ"గా వినియోగించేందుకు వీలుగా కంపెనీ దాని ఇంజన్‌ను కూడా "తక్కువ"గా ట్యూన్ చేసింది. యాక్సిలరేటర్‌పై కాలు మోపినప్పుడు మీకు కూడా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. హైరైడర్‌ను ఎకో మరియు నార్మల్ మోడ్‌లు రెండింటిలోనూ, మీరు యాక్సిలరేటర్‌ను ఎంత గట్టిగా నొక్కినప్పటికీ, దాని ప్రతిస్పందన మాత్రం చాలా నీరసంగా అనిపిస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

అయితే, పవర్ మోడ్‌లో ఇది ఆమోదయోగ్యమైన స్థాయిలకు చేరుకుంటుంది. ఇకపోతే, ఈవీ మోడ్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఇది మీరు ఒక పూర్తి ఎలక్ట్రిక్ కారును నడుపుతున్న అనుభూతిని అందిస్తుంది. బ్యాటరీ రీజెన్ మోడ్ హైరైడర్‌లో వన్-పెడల్ డ్రైవింగ్‌ను సాధ్యం చేస్తుంది, ఇది కొన్నిసార్లు మ్యాజిక్‌లా అనిపిస్తుంది. అలాగే, ఇందులోని ఇ-సివిటి గేర్‌బాక్స్ పనితీరు కూడా చాలా వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ, మీరు వినోదం కోసం ఇలాంటి ఆటోమేటిక్ కారును కొనాలనుకుంటే, ఇది తప్పకుండా మిమ్మల్ని నిరాశపరుస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లో వెనుక బూట్ స్పేస్‌లో బలమైన మరియు బరువైన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ వేరియంట్‌లో పెరిగిన బరువును బ్యాలెన్స్ చేయడం కోసం హైరైడర్ వెనుక వైపు గట్టి సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుది. ఈ ఎస్‌యూవీని అధిక వేగంతో (అతి వేగం ప్రమాదకరం) రఫ్ ప్యాచ్‌ల మీదుగా నడిపినప్పుడు, ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చున్న వారికి కుదుపుగా అనిపిస్తుంది. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ చాలా బాడీ రోల్‌ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది, కాబట్టి కార్నర్స్ లో దీనిని చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

స్టీరింగ్ వీల్ మారుతి సుజుకి విడిభాగాల నుండి తయారు చేయబడింది, అయితే, ఇది టొయోటా బ్రాండ్‌తో విలక్షణమైన అనుభూతిని కలిగి ఉంటుంది. తక్కువ వేగంతో, స్టీరింగ్ తేలికగా అనిపిస్తుంది, ఇది నగర డ్రైవింగ్ పరిస్థితులలో సహాయపడుతుంది. అయితే, అధిక వేగంతో నడుపుతున్నప్పుడు స్టీరింగ్ వీల్ మన చేతుల్లో కొంచెం ఎక్కువ బరువుగా ఉన్నట్లు ఉండే బాగుండనేది మా అభిప్రాయం.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

హైరైడర్‌లోని అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి ఈబిడితో కూడిన ఏబిఎస్ తో కలిసి మంచి బ్రేకింగ్ పనితీరును అందిస్తాయి. బ్రేక్ పెడల్ కూడా ఎక్కువ ట్రావెల్‌ను కలిగి ఉండకుండా, ఆపరేట్ చేయడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు అయినప్పటికీ, దీని క్యాబిన్ లోపల ఉన్న NVH (నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్) స్థాయిలు అత్యుత్తమంగా ఉంటాయి. ప్రత్యేకించి ఈ కారును ఈవీ (ఎలక్ట్రిక్) మోడ్‌లో నడుపుతున్నప్పుడు మీకు బయట నుండి ఏ శబ్ధాలు వినిపించవు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. హైబ్రిడ్ మ్యాజిక్ ఉంది, కానీ ఇంజన్‌లో దమ్ లేదు..!

చివరిగా ఏం చెబుతారు?

ఓవరాల్‌గా టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఈ విభాగంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఎస్‌యూవీలోని విలక్షణమైన ఫీచర్ మరియు దాని ప్రధాన USP (యునిక్ సెల్లింగ్ పాయింట్) స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్. ఇంజన్ పనితీరుతో సంబంధం లేకుండా అధిక మైలేజ్ కోరుకునే వారు తప్పకుండా ఈ ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు. కానీ, పవర్ ప్యాక్డ్ పంచ్‌తో కూడిన ఇంజన్ మరియు ఫన్-టూ-డ్రైవ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే వారు మాత్రం హైరైడర్‌కు దూరంగా ఉంటేనే మంచిదనేది మా అభిప్రాయం. హైరైడర్ ధర మరియు డెలివరీ సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota urban cruiser hyryder test drive review design features engine specs and first drive impressi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X