టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

భారత మార్కెట్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి మరియు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి 2019 లో టయోటా మరియు సుజుకి కంపెనీలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా, టొయోటా గ్లాంజాను ప్రారంభించి ఇండియన్ మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి అడుగుపెట్టాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన తరువాత, టయోటా ఇప్పుడు సుజుకి-టయోటా కూటమి నుండి రెండవ ఉత్పత్తి అయిన అర్బన్ క్రూయిజర్‌ను ఆవిష్కరించింది. కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జాపై ఆధారపడింది. ఇది టయోటా గ్లాంజా మాదిరిగా కాకుండా, విటారా బ్రెజ్జా కంటే కొంత భిన్నంగా కనిపిస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

మేము ఇటీవల రెండు రోజులు పాటు టయోటా అర్బన్ క్రూయిజర్‌ను నగరంలో మరియు హైవేపై డ్రైవ్ చేసాము. కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఎక్స్టీరియర్ మరియు డిజైన్ :

టయోటా అర్బన్ క్రూయిజర్ లో చాలా మార్పులు చేయబడ్డాయి. ఇందులో గమనించదగ్గ మొదటిది వాహనం యొక్క ముందు భాగంలో ఉన్న గ్రిల్. టయోటా తన సిగ్నేచర్ రూపకల్పనతో అర్బన్ క్రూయిజర్‌ను ప్రవేశపెట్టింది, ఇరువైపులా వెర్టికల్ క్రోమ్ స్ట్రిప్స్‌తో పాటు గ్రిల్‌లోనే హారిజాంటల్ స్లాట్‌లను కలిగి ఉంది. ఇది ఎస్‌యూవీ ముందు నుండి బోల్డ్ లుక్ ఇస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఈ కారు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో పాటు పుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను పొందుతుంది. ఇవి చాలా ప్రకాశవంతంగా ఉండటం వల్ల వాహనదారునికి మంచి దృశ్యమాతను అందిస్తాయి. ఫాగ్ లైట్ ఉంచడం వల్ల ఇది కొంత బ్రెజ్జాను గుర్తు చేస్తుంది. కానీ టయోటా దాని చుట్టూ కొన్ని క్రోమ్ గార్నిషింగ్ ఇచ్చింది. ఇది కారు యొక్క ప్రీమియం రూపాన్ని మరింత పెంచుతుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

టయోటా అర్బన్ క్రూయిజర్‌ యొక్క సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే ఇది 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ యూనిట్ కలిగి ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి బ్లాక్ క్లాడింగ్ లభిస్తుంది, ఇది తప్ప సైడ్ ప్రొఫైల్‌ లో ఇతర మార్పు లేదు. ఇది ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ తో బ్లాక్-అవుట్ ORVM ను కూడా పొందుతుంది. అర్బన్ క్రూయిజర్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాను కూడా పొందుతుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క వెనుక భాగం, విటారా బ్రెజ్జాలో కనిపించే మాదిరిగానే ఉంటుంది. ఇది టైల్ లైట్, బంపర్ మరియు బూట్‌తో పాటు నడిచే క్రోమ్ స్ట్రిప్ నుండి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్లేట్ పైన ఉన్న క్రోమ్ స్ట్రిప్‌లో ‘అర్బన్ క్రూయిజర్' పేరు కనిపిస్తుంది. ఇందులో పార్కింగ్ సెన్సార్లతో పాటు రియర్‌వ్యూ కెమెరా కూడా ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఇంటీరియర్ మరియు ఫీచర్స్ ;

అర్బన్ క్రూయిజర్ యొక్క లోపలికి అడుగు పెట్టగానే, ఇది విటారా బ్రెజ్జా మాదిరిగానే ఉంటుంది. ఇందులో కేవలం ఒక తేడా గమనించవచ్చు. అది సీటు కవర్ యొక్క కలర్, ఇది మారుతి ఎస్‌యూవీలో కనిపించే దానికి భిన్నంగా ఉంటుంది. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే 'స్మార్ట్ ప్లేకాస్ట్' ద్వారా సెంటర్ స్టేజ్ తీసుకోబడింది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

క్లైమేట్ కంట్రోల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు దిగువన ఉంటుంది, మరియు దానికి డిజిటల్ రీడౌట్ ఉంది, అది నెగెటివ్ బ్యాక్‌లైట్‌ను కలిగి ఉంటుంది. దాని క్రింద రెండు కప్ హోల్డర్స్ మరియు ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

స్టీరింగ్ వీల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కావున వాహనదారునికి మంచి పట్టును అందిస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ సరిగ్గా ఉండటం వల్ల డ్రైవర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా విటారా బ్రెజ్జాలో చూసినట్లుగా ఉంటుంది. ఇది మధ్యలో ఒక MID స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది వాహనం గురించి పూర్తి సమాచారం అందిస్తుంది, మరియు దీనికి ఇరువైపులా టాకోమీటర్ మరియు స్పీడోమీటర్ వంటివి ఉంటాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ యొక్క సీట్ల విషయానికి వస్తే, ముందు వైపు, డ్రైవర్ సైడ్ సీట్ మాత్రమే సీటు హైట్ అడ్జస్టబుల్ మరియు స్టీరింగ్ వీల్ కు టిల్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సీటు మంచి కుషనింగ్ మరియు మంచి అండర్ థాయ్ సఫోర్ట్ అందిస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

రెండవ వరుస సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మంచి బ్యాక్ సఫోర్ట్ ఉంది, అయితే థాయ్ సఫోర్ట్ లేదు. ఏదేమైనా ఐదు పొడవైన ప్రయాణీకులకు కూర్చుని సౌకర్యవంతంగా వెళ్ళడానికి మంచి హెడ్ రూమ్ మరియు లెగ్ రూమ్ అందుబాటులో ఉంది. వెనుక వరుసలో ఎసి వెంట్స్ మరియు ఛార్జింగ్ సాకెట్ లేదు. రెండవ వరుసలో రెట్రెక్టబుల్ ఆర్మ్‌రెస్ట్ ఉంది. ఇది రెండు కప్ హోల్డర్స్ కలిగి ఉంటుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

టయోటా అర్బన్ క్రూయిజర్ 328-లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఉత్తమమైనది కాదు. ఇది 60:40 స్ప్లిట్ కూడా పొందుతుంది. మరింత స్పేస్ కావాలనుకున్నప్పుడు సీటును ఫోల్డ్ చేయడం ద్వారా ఎక్కువ స్థలం పొందవచ్చు.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఇంజిన్ అండ్ హ్యాండ్లింగ్:

టయోటా అర్బన్ క్రూయిజర్‌ అదే పెట్రోల్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇది కాంపాక్ట్-ఎస్‌యూవీ సుజుకి యొక్క మైల్డ్-హైబ్రిడ్ (ఎస్‌హెచ్‌విఎస్) టెక్నాలజీతో జతచేయబడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 104 బిహెచ్‌పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

మేము టయోటా అర్బన్ క్రూయిజర్‌ యొక్క మాన్యువల్ వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. క్యాబిన్ లోపల ఇన్సులేషన్ లెవెల్స్ కూడా బాగున్నాయి, కావున బయటి శబ్దం లోపలికి రాదు.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఇంజిన్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కావున, కారును ముందుకు నడిపించడానికి కొంచెం గ్యాస్ సరిపోతుంది. ఇది మంచి లో ఎండ్ టార్క్ కలిగి ఉంది. మీరు తక్కువ వేగంతో ఎక్కువ గేర్లలో ఉన్నప్పుడు కూడా ఇంజిన్ నిలిచిపోవడానికి అనుమతించదు. ఐదవ గేర్‌లో ఉన్నప్పుడు, గంటకు 40 కి.మీ వేగంతో వెళ్ళడానికి అనుమతిస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

అర్బన్ క్రూయిజర్‌లో సస్పెన్షన్ సెటప్ బ్రెజ్జా మాదిరిగానే ఉంటుంది. ఇది మృదువైన వైపు ఉండటం వల్ల, రైడ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కారు పరిమితికి మించి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మరియు రహదారి ఎగుడుదిగుడుగా ఉంటే వెనుక వైపు పట్టు కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

అర్బన్ క్రూయిజర్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, నగరంలో ఒక లీటరుకు 12.5 నుండి 14 కి.మీ వరకు మైలేజ్ అందించింది. అదే విధంగా హైవేలో ఒకలీటరుకి 15 నుండి 17.8 కి.మీ మధ్య ఉంటుంది. ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్ ఇంజిన్‌ కావున ఈ మైలేజ్ సరైనదే అని చెప్పవచ్చు.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

సరికొత్త అర్బన్ క్రూయిజర్ లేటెస్ట్ స్టైలింగ్ కలిగి ఉండటంతో పాటు, మంచి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ ఆకర్షణీయమైన ధరను కలిగి ఉండటం వల్ల ఎక్కువమందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది సన్‌రూఫ్, ప్లాస్టిక్ యొక్క క్యాలిటీ, మెరుగైన ఇన్సులేషన్ మరియు ఫేస్‌లిఫ్ట్ సమయంలో కంపెనీ కొద్దిగా భిన్నమైన ఇంటీరియర్ థీమ్‌ పొందే అవకాశం ఉంటుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

సరికొత్త అర్బన్ క్రూయిజర్ భారత మార్కెట్లో టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు కియా సోనెట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Toyota Urban Cruiser Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X