టయోటా యారిస్ రివ్యూ: సిటీ, సియాజ్ మరియు వెర్నా కంటే మెరుగైనదేనా...?

టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోని సి-సెగ్మెంట్లోకి యారిస్ కారును విడుదలకు సిద్దం చేసింది. అంతర్జాతీయ విపణిలో లభించే ఈ మోడల్‌ను తొలిసారిగా దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

By Anil Kumar

టయోటా భారత మార్కెట్ కోసం సిద్దం చేసిన తమ తొలి సి-సెగ్మెంట్(మిడ్ సైజ్ సెడాన్) సరికొత్త యారిస్ కారును మేము టెస్ట్ డ్రైవ్ చేశాము

మరి టయోటా యారిస్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ కార్లను కాకుండా కస్టమర్లు యారిస్‌ను ఎంచుకునేలా ఆకట్టుకుంటుందా....? అసలు ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లతో పోలిక ఉందా... లేకపోతే అంతకు మించి పరిజ్ఞానం దీని సొంతమా...? ఇలాంటి ఎన్నో సందేహాలకు నివృత్తితో పాటు టయోటా యారిస్ గురించి మరియు దాని తీరు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి యారిస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూద్దాం రండి.

టయోటా యారిస్ రివ్యూ

టయోటా భారత మార్కెట్ కోసం సిద్దం చేసిన తమ తొలి సి-సెగ్మెంట్(మిడ్ సైజ్ సెడాన్) సరికొత్త యారిస్ కారును మేము టెస్ట్ డ్రైవ్ చేశాము

మరి టయోటా యారిస్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ కార్లను కాకుండా కస్టమర్లు యారిస్‌ను ఎంచుకునేలా ఆకట్టుకుంటుందా....? అసలు ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లతో పోలిక ఉందా... లేకపోతే అంతకు మించి పరిజ్ఞానం దీని సొంతమా...? ఇలాంటి ఎన్నో సందేహాలకు నివృత్తితో పాటు టయోటా యారిస్ గురించి మరియు దాని తీరు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి యారిస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూద్దాం రండి.

టయోటా యారిస్ రివ్యూ

టయోటా కంపెనీకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చిన మోడళ్లలో యారిస్ ఒకటి. కానీ, యూరోపియన్ మార్కెట్లో ఉన్న యారిస్‌తో పోల్చుకుంటే ఇండియన్ వెర్షన్ టయోటా యారిస్ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో డీజల్ కార్లకు డిమాండ్ పడిపోవడంతో ఇండియాలో కేవలం పెట్రోల్ వెర్షన్ యారిస్‌ను మాత్రమే అందిస్తోంది.

డిజైన్ మరియు స్టైలింగ్

ఇప్పటి వరకు ఉన్న టయోటా కార్లతో పోల్చుకుంటే యారిస్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. టయోటా యారిస్ సెడాన్ కారును తొలుత ఇండియన్ ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది, తొలుత డిజైన్‌ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, వ్యక్తిగత ప్రాధాన్యత విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. దీనికి తోడు టయోటా మీద ఇండియన్స్‌కు ఉన్న నమ్మకం కూడా కలిసిరానుంది.

టయోటా యారిస్ రివ్యూ

కారు ఫ్రంట్ డిజైన్ అత్యంత కీలకమైన భాగం. ఇప్పటి వరకు ఉన్న కార్లలో రకాల డిజైన్‌లలో ఉన్న ఫ్రంట్ గ్రిల్స్ చూసుంటాం. యారిస్ ఫ్రంట్ డిజైన్‌లో తిరగేసిన అర్ధ సమాంతర చతుర్బుజాకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ బంపర్ అంచువరకు ఉంటుంది. బంపర్‌కు మధ్యలో చివరంచున బాడీ కలర్‌లో ఉన్న అతి చిన్న ఫినిషింగ్ గుర్తించవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ బంపర్‌కు ఇరువైపులా అందివ్వడం జరిగింది.

టయోటా యారిస్ రివ్యూ

దగ్గరగా చూస్తే, హెడ్ ల్యాంప్స్ క్రింద దాగి ఉన్న పగటి పూట వెలిగే పలుచటి ఎల్ఇడి లైట్లు మరియు టయోటా లోగోకు ఇరువైపులా కొనసాగింపుగా ఉన్న హెడ్‌ల్యాంప్ క్లస్టర్ డిజైన్ గమనించవచ్చు. అదే విధంగా లోగోకు ఇరువైపులా ఉన్న హారిజంటల్ స్టాట్లను కూడా చూడవచ్చు.

టయోటా యారిస్ రివ్యూ

యారిస్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులో 15-అంగుళాల పరిమాణంలో ఉన్న 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో ఉన్న వేరియంట్ ఆధారంగా అభివృద్ది చేశారు కాబట్టి, అందుకు తగ్గట్లుగానే చిన్న వీల్స్‌కు బదులుగా పెద్ద వీల్స్ అందివ్వడం జరిగింది.

టయోటా యారిస్ రివ్యూ

టయోటా యారిస్‌లోని అత్యంత ఆకర్షణీయైన భాగాల్లో రియర్ డిజైన్ ఒకటిగా చెప్పుకోవచ్చు. కోణీయంగా జరిగిన డిజైన్‌లో పలుచటి సెమీ-ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ చాలా చక్కగా ఇమిడిపోయింది. రియర్ బంపర్ చివరి అంచుల్లో బాక్సీ డిజైన్‌లో కాకుండా మలుపులను చాలా చక్కగా వంచేశారు.

ఇంటీరియర్‌

మీకు ఫీచర్లంటే ఇష్టమైతే, టయోటా యారిస్ బెస్ట్ ఛాయిస్. భారీగా ఉన్న బాడీ డిజైన్‌ లోపలి వైపున విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంది. సౌలభ్యమైన మరియు సుందరమైన డిజై న్ఎలిమెంట్లు ఇంటీరియర్‌లో ఎన్నో ఉన్నాయి.

టయోటా యారిస్ రివ్యూ

ప్రపంచ శ్రేణి డిజైన్ అంశాలతో పోటీపడే సిల్వర్ ఫినిషింగ్ గల డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్ కలదు. అంతే కాకుండా, సాఫ్ట్-టచ్ క్లైమేట్ కంట్రోల్ బటన్స్ వెనుక ప్రత్యేకమైన లైటింగ్ కలదు, దీంతో క్లైమేంట్ కంట్రోల్ సిస్టమ్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. వాటర్ ఫాల్ డిజైన్ ఆధారంగా టయోటా యారిస్‌లోని సెంటర్ కన్సోల్‌ను రూపొందించింది.

టయోటా యారిస్ రివ్యూ

డ్యాష్‌బోర్డు మధ్యలో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఈ సిస్టమ్‌లో ఉన్న ప్రధాన ప్రత్యేకతల్లో, గెస్చర్ కంట్రోల్ ఫంక్షన్ ఒకటి. అంటే, మన అరచేతిని డిస్ల్పే ముందర అటు ఇటు కదపడం ద్వారా పాటలను మార్చడం మరియు సౌండును పెంచడం మరియు తగ్గించుకోవడం టచ్ చేయకుండా చేసుకోవచ్చు. అయితే, అతి ముఖ్యమైన ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లు ఇందులో మిస్సయ్యాయి.

టయోటా యారిస్ రివ్యూ

మ్యాన్యువల్ గేర్ రాడ్ ప్రీమియం బ్లాక్ లెథర్ ఫినిషింగ్‌లో ఉంది మరియు అరచేతిలోకి చక్కగా సరిపోతుంది. కప్ హోల్డర్లు గేర్ లీవర్‌కు ముందు వైపున ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్ విషయానికి వస్తే, గేర్ స్టిక్ లెథర్, మెటల్ ఫినిషింగ్ మరియు క్రోన్ మేళవింపులతో వచ్చింది.

టయోటా యారిస్ రివ్యూ

త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌లో ఇరువైపులా బటన్ కంట్రోల్స్ వచ్చాయి. అదనంగా క్రింది వైపుకు ఉన్న సిల్వర్ ఫినిషింగ్ స్టీరింగ్ వీల్ మీద గమనించవచ్చు. బ్లాక్ లెథర్ ఫినిషింగ్ ఉండటంతో డ్రైవింగ్‌లో మంచి గ్రిప్ ఇస్తుంది. ఆటోమేటిక్ యారిస్ సెడాన్ ఎంచుకుంటే స్టీరింగ్ వీల్ వెనుక సిల్వర్ పెడల్ షిఫ్టర్స్ పొందుతారు.

టయోటా యారిస్ రివ్యూ

అనలాగ్ మరియు డిజిటల్ సమ్మేళనంలో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ చూడటానికి మోడ్రన్‌గా ఉంది. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ యారిస్ మైలేజ్ గురించిన రియర్ టైమ్ డాటా అందిస్తుంది. బ్లాక్ డయల్స్ కాకుండా వైట్ డయల్స్ మరియు ట్రిప్పీ బ్లూ బ్యాక్‌లైట్ ప్యానల్‌లో పూర్తి సమాచారాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా గేర్‌షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంది.

టయోటా యారిస్ రివ్యూ

యారిస్ వెనుక సీటులో ప్రయాణించే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడానికి విశాలంగా మరియు అత్యంత సౌకర్యవంతగా తీర్చిదిద్దింది. సీట్లు చాలా వెడల్పుుగా ఉండటంతో, తొడలు మరియు వీపుకు మంచి సపోర్ట్ లభిస్తుంది. అదనంగా, రూఫ్ టాప్‌ వద్ద ఉన్న ఏ/సి వెంట్స్ మరియు ఫ్లాట్ ఫ్లోర్ మధ్య సీటుకు మరింత సౌకర్యాన్ని కల్పించాయని చెప్పవచ్చు.

ఇంజన్, పనితీరు మరియు డ్రైవింగ్ అనుభవం

టయోటా యారిస్ కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 1.5-లీటర్ ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల డ్యూయల్ వేరిబుల్ వాల్వ్ టైమింగ్ ఇంటెలిజెన్స్ (VVT-i) ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా యారిస్ రివ్యూ

యారిస్ డ్రైవింగ్, నిజానికి ధృడమైన యారిస్‌కు సరిపోలేదని చెప్పాలి, మరియు గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని కూడా కాస్త ఆలస్యంగా అందుకుంది. పెట్రోల్ ఇంజన్ చాలా నెమ్మదిగా స్పందిస్తుంది మరియు 4000 నుండి 6000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద మాత్రమే దీని పనితీరు కాస్త మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది.

టయోటా యారిస్ రివ్యూ

అదే విధంగా ఓవర్‌టేకింగ్ విషయంలో టయోటా ఇంకా బాగా ప్లాన్ చేసుంటే బాగుండేది. కఠినమైన ఓవర్‌టేకింగ్ సందర్భాల్లో గేర్లను మార్చుతూ, దానికనుగుణంగా యాక్సిలరేషన్ మీద ప్రతాపం చూపించాల్సిందే. ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఇంజన్ నుండి వచ్చే సౌండ్ కారు లోపల కూర్చున్న మన వరకు వస్తుంది. కానీ, నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్ లెవల్స్ మితంగా ఉండటంతో అదుర్లు మరియు కుదుపులు క్యాబిన్‌ దరి చేరవు.

టయోటా యారిస్ రివ్యూ

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గేర్లు మారినపుడు వాటి కలయిక చాలా తేలికగా మరియు సులభంగా ఉంటుంది. క్లచ్ కూడా చక్కటి బరువునే కలిగి ఉంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ విషయానికి వస్తే, చాలా చక్కగా పనిచేస్తుంది మరియు పవర్ డెలివరీ అదే విధంగా మంచి డ్రైవింగ్ అనుభవంతో అకట్టుకుంటుంది. యాక్సిలరేషన్ ఆపరేట్ చేయడంలో మీరు కింగ్ అయితే, యారిస్ ఏఎమ్‌టి వెర్షన్ పర్ఫెక్ట్.

టయోటా యారిస్ రివ్యూ

స్టీరింగ్ పనితీరు విషయానికి వస్తే, స్టీరింగ్ చాలా ఖచ్చితంగా ఉంటుంది మరియు అంతే తేలికగా కూడా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిలో సస్పెన్షన్ సిస్టమ్, దాదాపు అన్ని మార్గాల్లో అత్యుత్త బ్యాలెన్సింగ్ మరియు చక్కటి కంఫర్ట్ కలిగిస్తుంది. హైవేల మీద, ఎదురయ్యే చిన్న చిన్న గుంతలు మరియు స్పీడ్ బ్రేకర్లను ఎదుర్కొని వెంటనే సాధారణ స్థాయిని చేరుకుంటుంది. బ్రేకింగ్ పరంగా, యారిస్ అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి (వి మరియు విఎక్స్ వేరియంట్లలో). బ్రేకులు చాలా ధృడంగా మరియు తేలికగా ఉన్నాయి. అద్భుతమైన స్టాపింగ్ పవర్ దీని సొంతం.

టయోటా యారిస్ వేరియంట్లు, ధరలు, మైలేజ్ మరియు కలర్స్

టయోటా యారిస్ లభించే నాలుగు వేరియంట్లు ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతున్నాయి. అవి, సూపర్ వైట్, పర్ల్ వైట్, సిల్వర్, వైల్డ్‌లైఫ్ రెడ్ (రివ్యూ చేసిన కారు), ఫాంటమ్ బ్రౌన్ మరియు గ్రే.

టయోటా యారిస్ రివ్యూ

టయోటా యారిస్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 42-లీటర్లుగా ఉంది. ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం, మ్యాన్యువల్ వెర్షన్ మైలేజ్ 17.1కిమీ/లీ మరియు ఆటోమేటిక్ వెర్షన్ మైలేజ్ 17.8కిమీ/లీటర్లుగా ఉంది.

Variant Manual

CVT

J ₹ 8,75,000 ₹ 9,95,000
G ₹ 10,56,000 ₹ 11,76,000
V ₹ 11,70,000 ₹ 12,90,000
VX ₹ 12,85,000 ₹ 14,07,000
టయోటా యారిస్ రివ్యూ

భద్రత మరియు ఇతర ప్రధాన ఫీచర్లు

మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఏడు ఎయిర్ బ్యాగులతో లభ్యమయ్యే ఏకైక కారు టయోటా యారిస్. ఇప్పటి వరకు మరే ఇతర సి-సెగ్మెంట్ కార్లలో ఏడు ఎయిర్ బ్యాగులు రాలేదు. ఇవి, డ్రైవర్, ప్యాసింజర్స్, సైడ్, కర్టన్ ఎయిర్‌బ్యాగులు మరియు మోకాలి కోసం ఇలా మొత్తం ఏడు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.

మరిన్ని ఇతర సేఫ్టీ ఫీచర్లు

  • అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు**
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్***
  • ఇంపాక్ట్-సెన్సింగ్ డోర్ లాక్*
  • హిల్ స్టార్ట్ అసిస్ట్***
  • ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు*
  • రివర్స్ కెమెరా*
  • క్రూయిజ్ కంట్రోల్**
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్**
  • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్
  • పై ఫీచర్లు వేరియంట్ల వారీగా లభ్యత: *G, **V, ***VX

    ఈ సెగ్మెంట్లో తొలిసారిగా యారిస్ ద్వారా పరిచయమైన ఫీచర్లు

    • 60:40 నిష్పత్తిలో మడిపే అవకాశం ఉన్న సీట్లు
    • 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు
    • న్యావిగేషన్ మరియు గెస్చర్ కంట్రోల్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • రియర్ ప్యాసింజర్ల కోసం రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండీషనింగ్
    • ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
    • వీటికి అదనంగా, యారిస్ అంతర్జాతీయ వేరియంట్ ఆసియన్ ఎన్‌సిఎపి సేఫ్టీ క్రాష్ టెస్ట్ ఫలితాల్లో ఐదు స్టార్ల రేటింగ్ పొందింది.

      ప్రస్తుతం సి-సెగ్మెంట్లో ఉన్న కార్ల వివరాలు

      Petrol (Manual) Displacement (cc) Power/Torque Mileage (km/l)
      Toyota Yaris 1496cc 106/140 17.1
      Honda City 1497cc 117/145 17.4
      Hyundai Verna* 1396cc 99/132 17.4
      Maruti Ciaz 1373cc 91/130 20.73
      Petrol (Automatic) Displacement (cc) Power/Torque Mileage (km/l)
      Toyota Yaris (CVT)

      1496cc 106/140 17.8
      Honda City (CVT)

      1497cc 117/145 18

      Hyundai Verna (AT)

      1591cc 121/151 17.1
      Maruti Ciaz (AT)

      1373cc 91/130 19.12

      *హ్యుందాయ్ వెర్నా 1.4-లీటర్ పెట్రోల్(మ్యాన్యువల్) వేరియంట్ ఇవ్వడం జరిగింది. కానీ, దీనితో పాటు 1.6-లీటర్ పెట్రోల్ (మ్యాన్యువల్) పెట్రోల్ వేరియంట్లో కూడా ఇది లభ్యమవుతోంది.

      టయోటా యారిస్ రివ్యూ

      బుకింగ్స్ మరియు విడుదల వివరాలు

      యారిస్ సెడాన్ మీద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టయోటా అధీకృత డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 లు చెల్లించి యారిస్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని మే 18, 2018 న ఖరారు చేశారు. విడుదలకు ముందే బుక్ చేసుకున్న కస్టమర్లకు విడుదల రోజున డెలివరీ ఇవ్వనున్నట్లు టయోటా పేర్కొంది.

      తీర్పు

      పరిమితమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు అంతంత మాత్రం డ్రైవింగ్ అనుభవం యారిస్‌ను ఎంచుకోవడానికి అడ్డుపడుతున్నాయి. అత్యంత పోటీతత్వంగా యారిస్ ధరలను నిర్ణయించినప్పటికీ, ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్ల నుండి దీనికి కఠినమైన పోటీ తప్పదనిపిస్తోంది.

      Model Manual (Petrol) Automatic (Petrol)
      Toyota Yaris ₹ 8,75,000 ₹ 9,95,000 (CVT)
      Honda City ₹ 8,91,000 ₹ 9,95,000 (CVT)
      Hyundai Verna ₹ 7,80,000 ₹ 10,56,000 (AT)
      Maruti Ciaz ₹ 8,04,000 ₹ 9,64,000 (AT)

      అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

      టయోటా యారిస్ రివ్యూ

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      టయోటా యారిస్ ఫ్యామిలీ కారు అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. కానీ, దీనిని ఇష్టపడటమనేది కాస్త కష్టమే. విభిన్న ఇంజన్ ఆప్షన్స్ మరియు వేరియంట్లలో లభ్యమవుతున్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి ఆల్ రౌండర్ కార్లను ఎదుర్కోవడం యారిస్‌కు పెద్ద సవాల్ అనే చెప్పాలి.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Yaris Review — A Family Sedan That’s Easy To Like But Difficult To Love
Story first published: Monday, April 30, 2018, 10:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X