ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

భారత కార్ మార్కెట్లో కొనుగోలుదారుల ట్రెండ్ ఇప్పుడు ఎస్‌యూవీల నుండి సెడాన్ల వైపుకు మళ్లుతోందా..? మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో ఇప్పటికే మారుతి సియాజ్, హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ విభాగంలోకి ఇప్పుడు కొత్తగా స్కోడా స్లావియా వచ్చింది మరియు దానిని అనుసరించి ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) అనే సెడాన్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ జర్మన్ సెడాన్‌ను మేము ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేశాము. మరి ఇది ఏ విషయంలో గొప్పగా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

భారతదేశంలో ప్రీమియం కార్లను అభివృద్ధి చేయడం మరియు రిటైలింగ్ చేయడంలో అతి తక్కువ సమయంలో గొప్ప పేరు తెచ్చుకున్న కార్ బ్రాండ్‌లలో జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కూడా ఒకటి. ఈ బ్రాండ్ నుండి గతంలో వచ్చిన పోలో, అమియో, వెంటో, జెట్టా, పస్సాట్ వంటి ప్రీమయం కార్లు వాటి విభాగాల్లో అత్యుత్తమమైన పనితీరును కనబరచాయి. ఈ కార్ల బిల్డ్ క్వాలిటీ మరియు ఆకట్టుకునే పనితీరుతో ఇవి భారత కస్టమర్లను అలరించాయి. ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి గుర్తుండిపోయే కార్లలో వెంటో సెడాన్ కూడా ఒకటి. ఈ జర్మన్ బ్రాండ్ నుండి ఎంట్రీ-లెవల్ సెడాన్‌గా మార్కెట్‌లోకి వచ్చి చాలా విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కార్లలో వెంటో ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఈ సెగ్మెంట్‌కు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది మరియు మార్కెట్లో ఇతర కార్ల కొనుగోలుదారులను కూడా తనవైపుకు తిప్పుకునేలా చేసింది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2010లో తమ వెంటో సెడాన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఇప్పుడిక ఈ కారుకు గుడ్‌బై చెప్పే టైం వచ్చేసింది. మరి వెంటో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని ఎదురుచూస్తున్న సమయంలో, ఫోక్స్‌వ్యాగన్ తమ వర్త్యుస్ సెడాన్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మరియు ఈ కారుపై అంచనాలను పెంచేసింది. ఇది (వర్త్యుస్) వెంటో సెడాన్ కన్నా పెద్దది, మరింత శక్తివంతమైనది మరియు అధునాతనమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

వెంటో మరియు వర్త్యుస్ సెడాన్లను పక్కపక్కనే ఉంచి చూస్తే, వర్త్యుస్ ఎక్కువ ఆకట్టుకునేలా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇది 12 ఏళ్ల అనుభవం కలిగిన వెంటోకు సరైన ప్రత్యామ్నాయమేనా? దీని డ్రైవింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుత మార్కెట్ అభిరుచికి అనుగుణంగా ఉందా? ధరకు తగిన విలువను అందిస్తుందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను కనుగొనేందుకు మేము ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌ను నగర వీధుల్లో నడిపి చూశాము.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - డిజైన్ మరియు స్టైల్

ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను బట్టి తమ వాహనాలను డిజైన్ చేయడంలో ఫోక్స్‌వ్యాగన్ ఎల్లప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. ఇప్పటి వరకూ ఫోక్స్‌వ్యాగన్ అందించిన స్పోర్టీయర్ కార్లే అందుకు పెద్ద నిదర్శనం. ఇక కొత్తగా వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త ఫ్యామిలీ డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించబడింది. దూరం నుండి చూసినప్పుడు కూడా ఇది ఖచ్చితంగా ఫోక్స్‌వ్యాగన్ కారు అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

టెస్ట్ డ్రైవ్ కోసం మేము 1.0-లీటర్ టర్బో-పెట్రోల్‌ డైనమిక్ లైన్ వేరియంట్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్‌ పెర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్ రెండింటినీ కూడా నడిపాము మరియు ఈ రెండు వేరియంట్‌లు కూడా ఒకే విధమైన డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్ మాత్రం దాని ప్రత్యేకమైన GT బ్యాడ్జింగ్‌ మరియు స్పోర్టియర్ డిజైన్‌తో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఈ సెడాన్ ముందు భాగంలోని గ్రిల్ చాలా సన్నాగా మరియు స్పోర్టీగా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్ కారు మధ్యలో చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. నిజానికి, ఫోక్స్‌వ్యాగన్ లోగో దాని గ్రిల్ కంటే పెద్దదిగా అనిపిస్తుంది. ఈ గ్రిల్ క్రోమ్ స్ట్రిప్స్ మధ్య శాండ్‌విచ్ చేయబడినట్లుగా ఉండే బ్లాక్ హారిజాంటల్ స్లాట్స్ ఉంటాయి. ఈ క్రోమ్ స్ట్రిప్స్ రెండు హెడ్‌ల్యాంప్‌లను అనుసంధానిస్తున్నట్లుగా అనిపిస్తాయి. స్మోక్డ్ హెడ్‌ల్యాంప్‌ల కారణంగా, ఈ హెడ్‌ల్యాంప్‌ల లోపల ఉన్న క్రోమ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్ సెటప్ చాలా స్లిమ్‌గా మరియు చక్కగా డిజైన్ చేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫ్రంట్ బంపర్‌లో ఉండే దిగువ గ్రిల్ పెద్దదిగా ఉండి, మంచి కాంట్రాస్ట్‌ లుక్‌ని అందిస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇదే దిగువ గ్రిల్‌లో అమర్చబడి ఉంటాయి. ఓవరాల్‌గా ఇది ముందు వైపు నుండి స్పోర్టీ అండ్ ప్రీమియం అప్పీల్‌ను కలిగి ఉంటుంది. ఇకపోతే, ఇందులోని పెర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్ యొక్క గ్రిల్, సైడ్ ఫెండర్‌లు మరియు బూట్ లిడ్‌పై GT బ్యాడ్జ్‌ కనిపిస్తుంది, ఇది ఈ కారు యొక్క పెర్ఫార్మెన్స్ వేరియంట్ అని చెప్పకనే చెబుతుంది. ఇక సైడ్ ప్రొఫైల్ నుండి చూసినప్పుడు, ఇక్కడ ముందుగా అందరి దృష్టిని ఆకర్షించేది కారు యొక్క స్పోర్టీ, బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

సైడ్ ప్రొఫైల్‌లోని ఇతర డిజైన్ హైలైట్స్‌ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉండి టర్న్ ఇండికేటర్లతో అమర్చబడిన సైడ్ మిర్రర్స్ ఉంటాయి. అయితే, ఇవి పెర్ఫార్మెన్స్ లైన్ లేదా GT వేరియంట్‌కి మాత్రమే ప్రత్యేకమైన అంశాలుగా ఉంటాయి. వర్త్యుస్‌లో కనిపించే అన్ని బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ కూడా ఈ సెడాన్ ను చాలా స్పోర్టీగా కనిపించేలా చేస్తాయి. మేము డ్రైవ్ చేసిన ఫైరీ రెడ్‌ కలర్ ఆప్షన్‌లో ఈ బ్లాక్ డిజైన్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ హైలైట్‌గా కనిపిస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

వెనుక భాగంలో, మీరు ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క క్లాస్సీ డిజైన్‌ను కనుగొంటారు మరియు వెనుక వైపు నుండి కూడా ఈ సెడాన్ చాలా స్టైలిష్‌గా ఉందని గుర్తిస్తారు. వెనుక భాగంలో స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ బ్లాక్-అవుట్ స్టైల్‌ను కలిగి ఉంటాయి మరియు బూట్ లిడ్‌పై లిప్ స్పాయిలర్ కూడా నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇక్కడ కనిపించే ఫోక్స్‌వ్యాగన్ (VW) బ్యాడ్జ్ కూడా బ్లాక్ థీమ్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇకపోతే, బూట్ లిడ్ దిగువ భాగంలో Virtus బ్యాడ్జింగ్ మరియు పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో GT బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. ఓవరాల్‌గా ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ ఓ విశిష్టమైన స్టైల్‌ మరియు ప్రీమియం అప్పీరెన్స్‌తో చాలా యవ్వనంగా కనిపించే ఓ యూత్‌ఫుల్ ఎగ్జిక్యూటివ్ సెడాన్‌గా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

మనం ఇదివరకే చెప్పుకున్నాం వర్త్యుస్ సెడాన్ వెంటో కంటే పెద్దది అని. కాబట్టి, ఇందులో ఇంటీరియర్ స్పేస్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. డోరు ఓపెన్ చేయగానే మిమ్మల్ని ప్రధానంగా ఆకట్టుకునేది, దాని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్. మొత్తం సెడాన్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ థీమ్‌ను కలిగి ఉన్నప్పటికీ డ్యాష్‌బోర్డ్‌లో మాత్రం మీకు అనేక రంగులు కనిపిస్తాయి. ఇక్కడ డ్యాష్‌బోర్డ్‌లో రెడ్ ఎలిమెంట్స్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఇది యువ కార్ ప్రియులను మరియు ప్రత్యేకించి రెడ్ కలర్ అంటే ఇష్టపడే స్పోర్టీ కార్ ప్రియులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. కారులోని ఏసి వెంట్స్ మరియు స్క్రీన్‌ల చుట్టూ ఈ రెడ్ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. అంతేకాదు, డోర్ ప్యానెల్స్‌లో ఈ రెడ్ కలర్ ఫినిషింగ్స్ ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

డాష్‌బోర్డ్ ఎగువ భాగంలో మ్యాట్ బ్లాక్ కలర్ మరియు దిగువ భాగంలో బేజ్ కలర్ కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది. సెడాన్‌లోని మిగిలిన భాగం అంతా కూడా ఇదే కలర్ థీమ్‌లో ఉంటుంది. డ్రైవర్‌కు కుడివైపున ఓ బలమైన లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, ఇది మంచి హ్యాండ్ గ్రిప్‌ను కలిగి ఉంది. స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లతో చాలా ప్రీమియంగా మరియు ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఇక స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ఉంటే పెద్ద 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మీ కళ్లను కట్టిపడేస్తుంది. ఇది చాలా అద్భుతంగా కనిపించడమే కాకుండా డ్రైవర్‌కు అవసరమైన అనేక రకాల సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ డిస్‌ప్లే యూనిట్‌లోని గ్రాఫిక్స్ కూడా చాలా నీట్‌గా ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఇక ఈ డ్యాష్‌బోర్డ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది లేటెస్ట్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అంటే, యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌ను వైరుతో కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే, ఈ వైర్‌లెస్ కనెక్టింగ్ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చన్నమాట. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌‌తో స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానం చేసుకోవడం చాలా సులభం మరియు దీని పనితీరు కూడా వేగవంతంగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింది భాగంలో సెంటర్ AC వెంట్‌లు ఉంటాయి మరియు వాటి క్రింద ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్స్ ఉంటాయి. డ్రైవర్ తన చేతివేళ్ల సాయంతోనే సులువుగా ఈ కంట్రోల్స్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ కారులో ప్రీమియం అనుభవాన్ని అందించే అనేక అంశాలలో ఇది కూడా ఒకటి. గేర్ లివర్‌కు లెథర్ వ్రాపింగ్ ఉంటుంది మరియు గేర్ లివర్ చుట్టూ ఉన్న పియానో ​​బ్లాక్ ప్యానెల్‌లో ఫ్రంట్ సీట్ వెంటిలేషన్‌ను కంట్రోల్ చేసే కొన్ని బటన్‌లు కూడా ఉంటాయి. గేర్ లివర్‌కు ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడానికి ఓ చిన్న స్లాట్ కూడా ఉంది మరియు ఇది వైర్‌లెస్ ఛార్జర్‌గా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా ఇతర గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి ఇందులో USB టైప్-సి పోర్ట్‌లు కూడా ఉన్నాయి మరియు గేర్ లివర్ వెనుక భాగంలో రెండు కప్ హోల్డర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

కన్వర్టిబల్ కారు లాంటి అనుభూతి కోసం ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. కాగా, వాటి కంట్రోల్స్‌ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ సమీపంలో ఉంటాయి మరియు వీటిని ఆపరేట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కారు లోపల రూఫ్ లైనర్ లేత గోధుమరంగు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది మరియు ఇది ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం టచ్‌ను ఇస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్‌లో నలుపు రంగు లెదర్ సీట్లు ఉన్నాయి, వాటిపై ఎరుపు రంగు స్టిచింగ్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ స్టిచింగ్ లైన్స్ కారు ఇంటీరియర్‌కు మరింత స్పోర్టీ లుక్‌ని తెచ్చిపెడుతాయి. మొత్తం మీద, Volkswagen Virtus ప్రీమియం, క్లాసీ మరియు సొగసైన ఇంటీరియర్‌లను కలిగి ఉండే అద్భుతమైన ఎగ్జిక్యూటివ్ సెడాన్.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్

ఫోక్స్‌వ్యాగన్ కార్లలో కంఫర్ట్ గురించి ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అది పోలో అయినా సరే లేదా కొత్తగా వచ్చిన వర్త్యుస్ అయినా సరే. కారుకి తగిననట్లుగా కంఫర్ట్‌ను అందించడంలో ఫోక్స్‌వ్యాగన్ ఎల్లప్పుడూ ది బెస్ట్‌గా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌లో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కంఫర్ట్ కోసం ఫ్రంట్ సీట్లు వెంటిలేటెడ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. వేసవి వేడి సమయంలో ఈ వెంటిలేటెడ్ సీట్స్ ఫీచర్ చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, స్టీరింగ్ వీల్ వెనుక ఎంత సేపైనా కూర్చొని, హాయిగా డ్రైవ్ చేయవచ్చు. వెనుక భాగంలో సీట్లు కూడా విశాలంగా మరియు సౌకర్యంగా ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ 2,651 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది, ఇది ఈ సెగ్మెంట్‌లోనే అత్యధికం. కాబట్టి, అధిక వీల్‌బేస్ కారణంగా క్యాబిన్ లోపల ఎక్కువ స్థలం ఉంటుంది. ఫలితంగా, ప్రయాణీకులకు మెరుగైన లెగ్‌రూమ్, క్నీ రూమ్ లభిస్తుంది. వెడల్పు విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ 1,752 మిమీ వెడల్పు కలిగి ఉంటుంది మరియు ఇది కూడా ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యధికంగా ఉంటుంది. కారు లోపల ప్రయాణీకులు తమ ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి వెనుక వైపు రెండు టైప్-సి పోర్ట్‌లు ఉంటాయి మరియు వారి సౌకర్యం కోసం రియర్ ఏసి వెంట్స్ కూడా ఉంటాయి. వెనుక సీటులో ఇద్దరు మాత్రమే కూర్చోవాలనుకుంటే, వారి కంఫర్ట్ కోసం ఇందులో ఇంటిగ్రేటెడ్ కప్‌హోల్డర్‌లతో కూడిన ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ను కూడా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఈ ఎగ్జిక్యూటివ్ సెడాన్‌లో స్టోరేజ్ కోసం ఇబ్బందే లేదు. వాలెట్ వంటి చిన్న వస్తువులను నిల్వ చేయడానికి డ్రైవర్ సైడ్ డ్యాష్‌బోర్డ్‌లో చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అలాగే, సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్లు, ఆర్మ్‌రెస్ట్ కింద డీప్ పాకెట్, డీప్ డోర్ పాకెట్‌లు, సీట్ల వెనుక స్మార్ట్‌ఫోన్ పాకెట్లు మొదలైనవి ఉన్నాయి. వెనుక సీటులో ఉన్న హాచ్ ద్వారా కూడా బూట్‌ను యాక్సెస్ చేయవచ్చు. బూట్ స్పేస్ విషయానికి వస్తే, ఈ కారులో 521 లీటర్ల బూట్ స్పేస్‌ లభిస్తుంది మరియు ఇది కూడా సెగ్మెంట్‌లో కెల్లా అతిపెద్దది. వెనుక సీటును ముడుచుకునే సౌకర్యం ఉంటుంది, తద్వారా మరింత అదనపు నిల్వ స్థలం లభిస్తుంది. కాబట్టి, ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు స్పేస్ విషయాల్లో చాలా తెలివైనదిగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

ఇప్పటి వరకూ ఫోక్స్‌వ్యాగన్ అందించిన చాలా కార్లు బెస్ట్-ఇన్-క్లాస్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించాయి. వర్త్యుస్ మార్కెట్లోకి రాక ముందు ఉన్న వెంటో సెడాన్ కూడా ఈ విషయంలో జెమ్ అని చెప్పొచ్చు. కాబట్టి, వర్త్యుస్ సెడాన్‌ను తయారు చేసే సమయంలో కంపెనీ ఈ డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిగణించి, ఇందులో రెండు పవర్‌పుల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఇంజన్లను మనం ఇప్పటికే కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ ఎస్‌యూవీలలో చూశాం. కాబట్టి, ఈ ఇంజన్లు కొత్తవేమీ కాకపోయినప్పటికీ, వర్త్యుస్ బాడీ టైప్‌కి తగినట్లుగా కంపెనీ వీటిని స్వల్పంగా రీట్యూన్ చేసింది. వీటి పనితీరును తెలుసుకోవడానికి మేము రెండు వేరియంట్‌లను డ్రైవ్ చేసాము

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఇందులో మొదటిది బేస్ డైనమిక్ లైన్ వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్. ఈ ఇంజన్‌ను మనం ఇప్పటికే స్కోడా కుషాక్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మొదలైన వాటిలో చూసాము. ఇదొక 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు గరిష్టంగా 113bhp పవర్‌ను మరియు 178Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ చాలా సైలెంట్‌గా దాని పని అది చేసుకుంటూ పోతుంది. కొన్ని సందర్భాల్లో క్యాబిన్‌లో ఉన్నప్పుడు అసలు ఇంజన్ ఆన్‌లో ఉందా లేదాని అని కూడా తెలియదు. అంత సైలెంట్‌గా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఈ ఇంజన్ సాధారణ 3-సిలిండర్ శబ్ధాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఓవరాల్ పనితీరు బాగానే అనిపించింది మరియు యాక్సిలరేషన్ కూడా క్విక్‌గానే అనిపించింది. ఈ ఇంజన్ టర్బోలోకి మారినప్పుడు దాని కిక్ చాలా బాగా అనిపిస్తుంది మరియు సెడాన్ వేగంగా ముందుకు నెడుతున్నట్లు అనిపిస్తుంది. మొదటిసారిగా టర్బో కారును కొనేవారిని ఈ చిన్న ఇంజన్ ఎట్టిపరిస్థితిల్లోనూ నిరుత్సాహపరచదు. అయితే, కాస్తంత శక్తివంతమైన వేరియంట్‌ను నడిపే వారి దృష్టిలో మాత్రం ఇది అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అందుకే, ఫోక్స్‌వ్యాగన్ అలాంటి వారికోసం ఈ కారులో మరింత శక్తివంతమైన 1.5-లీటర్ TSI EVO టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఇది 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 148bhp పవర్‌ను మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. సాంప్రదాయ పెట్రోల్ హెడ్‌లు ఇప్పటికీ 6-స్పీడ్ మాన్యువల్‌తో కూడిన కార్లను నడపడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే, కొత్త-తరం పెట్రోల్ హెడ్‌ల కోసం కంపెనీ ఇందులో అధునాతన 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. మేము కూడా 7-స్పీడ్ DSG వేరియంట్‌ను నడిపి చూశాము. ఈ గేర్‌బాక్స్ ఖచ్చితంగా మార్కెట్లోని ఇతర గేర్‌బాక్స్‌ల కన్నా గొప్పగా అనిపిస్తుంది మరియు దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

సెవన్ స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని సమానంగా చక్రాలకు పంపిణీ చేస్తుంది. కారు యొక్క పవర్ టాప్-ఎండ్‌కు చేరుకున్నప్పుడు, ఇంజన్ కొద్దిగా శబ్దం చేస్తుంది. పట్టణాల్లోని స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో ఈ కారు సులువుగా ముందుకు సాగిపోతుంది. ఈ DSG గేర్‌బాక్స్ ఓపెన్ రోడ్స్ మరియు మలుపులతో కూడిన రోడ్లపై కూడా చాలా సరదాతో కూడిన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది గేర్‌లను చాలా త్వరగా మారుస్తుంది మరియు ఈ 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ శక్తివంతమైన 1.5-లీటర్ ఇంజన్‌తో సరిగ్గా సరిపోతుందనేది మా అభిప్రాయం. డ్రైవ్ మోడ్‌లో కూడా గేర్ మార్పులు త్వరగా మరియు సున్నితంగా అనిపిస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ స్పోర్ట్ మోడ్‌లో చాలా అగ్రెసివ్‌గా మారుతుంది. ఇక మాన్యువల్ మోడ్ విషయానికి వస్తే, ఇందులో గేర్లు దాదాపు ఓ స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లాగానే పనిచేస్తాయి. ఇందులోని ప్యాడిల్ షిఫ్టర్‌ల సాయంతో డ్రైవర్ సులువుగా తన చేతివేళ్లతోనే గేర్లను మార్చుకోవచ్చు. ఇది ఓ మంచి అద్భుతమైన అనుభూతిని మరియు కార్ ఔత్సాహికులు ఇష్టపడే డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారులోని స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది. అయితే, ఈ సెడాన్ ఎలాంటి సందేహం లేకుండా పరిమిత వేగంతో గుంతల మీదుగా దూసుకుపోతుంది. ఇక దీని బాడీ రోల్ గురించి ఫిర్యాదు చేయాల్సిన పనే లేదు, మలుపుల వద్ద దీని పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఈ కారును తక్కువ వేగంతో నడుపుతున్నప్పుడ స్టీరింగ్ వీల్ చాలా తేలికగా ఉంటుంది, కాబట్టి పట్టణ ప్రాంతాల్లో డ్రైవ్ చేయడం సులుభంగా ఉంటుంది. అయితే వేగం పెరిగేకొద్దీ స్టీరింగ్ వీల్ కూడా బలంగా మారుతుంది, ఫలితంగా డ్రైవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వర్త్యుస్ సెడాన్ NVH (నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్) స్థాయిలను చాలా బాగా కంట్రోల్ చేయడంలో ఫోక్స్‌వ్యాగన్ తన పనితనాన్ని కనబరించింది. ఇందులోని పెద్ద 1.5-లీటర్ ఇంజన్ కారణంగా, త్వరగా వేగాన్ని అందుకోవడానికి ఈ ఇంజన్ ఎక్కువగా కష్టపడదు. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఈ రెండు ఇంజన్లు కూడా మంచివే. కాకపోతే, ఇందులో 1.0 లీటర్ ఇంజన్ కన్నా 1.5 లీటర్ ఇంజన్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - సేఫ్టీ మరియు కీలకమైన ఫీచర్లు

పోక్స్‌వ్యాగన్ తయారు చేసే కార్లు సురక్షితంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ బ్రాండ్ ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలతో తమ కార్లను తయారు చేస్తుంది. ఈ వర్త్యుస్ సెడాన్‌లో కూడా కంపెనీ అనేక యాక్టివ్ మరియు పాసివ్ సేఫ్టీ ఫీచర్‌లను జోడించింది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సేఫ్టీ ఫీచర్లు:

- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

- హిల్-హోల్డ్ కంట్రోల్

- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)

- మల్టీ కొల్లైజన్ బ్రేక్‌లు

- ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్ (EDS)

- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)

- EBD తో కూడిన ABS

- ట్రాక్షన్ కంట్రోల్

- ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్

- పార్క్ డిస్టెన్స్ కంట్రోల్

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - కీలక ఫీచర్లు:

- స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

- 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

- క్రూయిజ్ కంట్రోల్

- కీలెస్ ఎంట్రీ అండ్ గో

- 8 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

- టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ - వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లు

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ రెండు వేరియంట్లు మరియు ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వేరియంట్‌లు:

- డైనమిక్ లైన్

- పెర్ఫార్మెన్స్ లైన్

కలర్ ఆప్షన్లు:

- వైల్డ్ చెర్రీ రెడ్

- కర్కుమా యల్లో

- రైజింగ్ బ్లూ మెటాలిక్

- రిఫ్లెక్స్ సిల్వర్

- కార్బన్ స్టీల్ గ్రే

- కాండీ వైట్

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

పైన పేర్కొన్న విధంగా, పెర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్‌లోని బ్లాక్ అవుట్ ఎలిమెంట్‌లు ప్రత్యేకంగా నిలబడటానికి కాంట్రాస్టింగ్ కలర్ అవసరం మరియు దీనికి సరైన రంగు వైల్డ్ చెర్రీ రెడ్ అనేది మా అభిప్రాయం. అయితే, కంపెనీ అందిస్తున్న కార్బన్ స్టీల్ గ్రే మరియు రైజింగ్ బ్లూ మెటాలిక్ కూడా అద్భుతమైన కలర్ ఆప్షన్లుగా ఉంటాయి. కలర్ అనేది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి, ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం మీదే.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీన్ని డ్రైవ్ చేస్తుంటే 'గూస్ పింపుల్స్' రావడం పక్కా..!

మరి 'గూస్ పింపుల్స్' వచ్చాయా?

ఖచ్చితంగా వచ్చాయనే చెప్పాలి.. ఎందుకంటే ఈ కార్ అలాంటిది మరి. మీరు కూడా ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ కారును నడిపిన తర్వాత.. స్పోర్టీ, క్లాసీ, స్టైలిష్, ప్రీమియం, అగ్రెసివ్, క్వైట్, యూత్‌ఫుల్, మెచ్యూర్డ్ అంటూ దానిని ప్రశంసలతో ముంచెత్తుతారు. ఈ కారు వెంటో సెడాన్‌ను రీప్లేస్ చేయడమే కాదు, దానికి మించిన ఫీచర్లను మరియు టెక్నాలజీని కలిగి ఉండి, అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. మా అభిప్రాయం ప్రకారం, ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా బెస్ట్‌గా ఉంది.

Most Read Articles

English summary
Volkswagen virtus test drive review design specs features and driving impressions
Story first published: Thursday, May 5, 2022, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X