ఫోర్డ్ ఆస్పైర్

ఫోర్డ్ ఆస్పైర్
Style: Compact Sedan
7.28 - 8.73 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

ఫోర్డ్ ప్రస్తుతం 4 విభిన్న వేరియంట్లు మరియు 5 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. ఫోర్డ్ ఆస్పైర్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, ఫోర్డ్ ఆస్పైర్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా ఫోర్డ్ ఆస్పైర్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి ఫోర్డ్ ఆస్పైర్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

ఫోర్డ్ ఆస్పైర్ పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
Compact Sedan | Gearbox
7,28,000
Compact Sedan | Gearbox
7,63,000

ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
Compact Sedan | Gearbox
8,38,000
Compact Sedan | Gearbox
8,73,000

ఫోర్డ్ ఆస్పైర్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 18.5
డీజిల్ 24.4

ఫోర్డ్ ఆస్పైర్ రివ్యూ

Rating :
ఫోర్డ్ ఆస్పైర్ Exterior And Interior Design

ఫోర్డ్ ఆస్పైర్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారతదేశంలో ఫోర్డ్ కొత్త అప్డేటెడ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఇది అప్‌డేట్ ఎక్స్టీరియర్ డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో అందుబాటులో ఉంది. మునుపటి మోడల్స్ తో పోలిస్తే, ఈ కొత్త ఫోర్డ్ ఆస్పైర్ యొక్క ఫ్రంట్ ఫాసియా సూక్ష్మమైన మార్పులను పొందుతుంది.

క్రొత్త ఆస్పైర్ యొక్క ఫ్రంట్ ఎండ్‌లో క్రోమ్ సరౌండ్స్‌తో పునఃరూపకల్పన చేయబడిన గ్రిల్, కొత్త స్వెప్ట్బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, రౌండ్ ఫాగ్ లాంప్స్, ఫాగ్ లాంప్స్ హౌసింగ్ చుట్టూ సి-షేప్ క్రోమ్ ఇన్సర్ట్‌లు మరియు విస్తృత సెంట్రల్ ఎయిర్‌డ్యామ్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో, కాంపాక్ట్ సెడాన్ కొత్త 15 ఇంచెస్ అల్లాయ్ వీల్‌లను కలిగి ఉంది. కొత్త ఆస్పైర్ యొక్క వెనుక భాగంలో కొద్దిగా అడ్జస్టబుల్ టెయిల్ లైట్ క్లస్టర్ మరియు కొత్త బంపర్ వంటివి ఉన్నాయి.

కొత్త ఫోర్డ్ ఆస్పైర్ లోపలి భాగంలో బ్లాక్ అండ్ బీజ్ కలర్ డ్యూయల్ టోన్ థీమ్ కలిగి ఉంటుంది. ఇందులోని డాష్‌బోర్డ్ మొత్తం డిజైన్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. సీట్ అపోల్స్ట్రే మరియు డోర్ ట్రిమ్స్, క్యాబిన్ కి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగిస్తాయి.

ఫోర్డ్ ఆస్పైర్ ఇంజన్ మరియు పనితీరు

ఫోర్డ్ ఆస్పైర్ Engine And Performance

కొత్త ఫోర్డ్ ఆస్పైర్ కొత్త 1.2-లీటర్ త్రీ సిలిండర్, డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ నుండి 95 బిహెచ్‌పి మరియు 120 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ మోడల్ 1.5 లీటర్ ఇంజన్ ద్వారా 99 బిహెచ్‌పి మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. కొత్త ఆస్పైర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఇంధన సామర్థ్యం

ఫోర్డ్ ఆస్పైర్ Fuel Efficiency

కొత్త 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కొత్త ఫోర్డ్ ఆస్పైర్ యొక్క పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.4 కి.మీ మైలేజీ అందిస్తుంది. కాంపాక్ట్ సెడాన్ యొక్క డీజిల్ వేరియంట్ లీటరుకు 26.1 కి.మీమైలేజీని అందిస్తుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ముఖ్యమైన ఫీచర్లు

ఫోర్డ్ ఆస్పైర్ Important Features

కొత్త ఫోర్డ్ ఆస్పైర్ లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో 6.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్‌విఎం, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటివి ఉన్నాయి.

కొత్త ఫోర్డ్ ఆస్పైర్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్స్ ఉంటాయి. కొత్త ఆస్పైర్ యొక్క టాప్-స్పెక్ మోడల్ ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్-లాంచ్ అసిస్ట్ వంటి అడిషినల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఫోర్డ్ ఆస్పైర్ తీర్పు

ఫోర్డ్ ఆస్పైర్ Verdict

కొత్త ఫోర్డ్ ఆస్పైర్ సరికొత్త పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, అంతే కాకుండా ఇది కొత్త ఫ్రంట్ ఎండ్‌తో రిఫ్రెష్ లుక్‌తో వస్తుంది. కొత్త ఆస్పైర్ అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే అదనపు ఫీచర్లను పొందుతుంది. ఫోర్డ్ ఆస్పైర్ మార్కెట్లో ఉత్తమ కాంపాక్ట్ సెడాన్లలో ఒకటి మరియు మీరు ఈ విభాగంలో కారు కొనాలని చూస్తున్నట్లయితే ఫోర్డ్ ఆస్పైర్ ఉత్తమైన ఆప్సన్ అవుతుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఫోర్డ్ ఆస్పైర్ కలర్లు


Smoke Grey
Ruby Red
Moondust Silver
White Gold
Diamond White

ఫోర్డ్ ఫోర్డ్ ఆస్పైర్ ఫోటోలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X