కియా Seltos

కియా Seltos
Style: ఎస్‌యూవీ
10.90 - 20.35 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

కియా ప్రస్తుతం 26 విభిన్న వేరియంట్లు మరియు 7 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. కియా Seltos ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, కియా Seltos ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా కియా Seltos మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి కియా Seltos గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

కియా Seltos పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
10,89,900
ఎస్‌యూవీ | Gearbox
12,23,900
ఎస్‌యూవీ | Gearbox
14,05,900
ఎస్‌యూవీ | Gearbox
15,29,900
ఎస్‌యూవీ | Gearbox
15,41,900
ఎస్‌యూవీ | Gearbox
15,44,900
ఎస్‌యూవీ | Gearbox
16,71,900
ఎస్‌యూవీ | Gearbox
18,72,900
ఎస్‌యూవీ | Gearbox
19,39,900
ఎస్‌యూవీ | Gearbox
19,64,900
ఎస్‌యూవీ | Gearbox
19,72,900
ఎస్‌యూవీ | Gearbox
19,99,900
ఎస్‌యూవీ | Gearbox
20,34,900

కియా Seltos డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
12,34,900
ఎస్‌యూవీ | Gearbox
13,67,900
ఎస్‌యూవీ | Gearbox
15,54,900
ఎస్‌యూవీ | Gearbox
16,79,900
ఎస్‌యూవీ | Gearbox
16,91,900
ఎస్‌యూవీ | Gearbox
16,99,900
ఎస్‌యూవీ | Gearbox
18,21,900
ఎస్‌యూవీ | Gearbox
18,69,900
ఎస్‌యూవీ | Gearbox
18,94,900
ఎస్‌యూవీ | Gearbox
19,39,900
ఎస్‌యూవీ | Gearbox
19,64,900
ఎస్‌యూవీ | Gearbox
19,99,900
ఎస్‌యూవీ | Gearbox
20,34,900

కియా Seltos మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 17.9
డీజిల్ 19.1

కియా Seltos రివ్యూ

Rating :
కియా Seltos Exterior And Interior Design

కియా Seltos ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారతదేశంలో కియా సెల్టోస్ 2019 ఆగస్టు నెలలో ప్రారంభించింది. దేశంలోని కొరియా కార్ల తయారీ సంస్థ నుండి సెల్టోస్ మొట్టమొదటి ఉత్పత్తి. ఇది ప్రస్తుతం అధిక పోటీ కలిగిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో చేరింది. కియా సెల్టోస్ పూర్తిగా సరికొత్త డిజైన్‌ను అందిస్తుంది. వీటితో పాటు మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో చాలా ఆకర్షణీయమైన సమర్పణగా నిలిచింది.

కియా సెల్టోస్ ఎస్‌యూవీ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది స్పోర్టి అప్పీల్‌ను అందిస్తుంది. సెల్టోస్ ముందు భాగంలో బ్లాక్-అవుట్ మెష్ గ్రిల్ ఉంది, ఇరువైపులా ఒక జత ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

సెల్టోస్‌లోని హెడ్‌ల్యాంప్ యూనిట్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో వస్తుంది. ఇది ఫ్రంట్ గ్రిల్‌పై మరింత విస్తరించి ఉంటుంది. టర్న్ ఇండికేటర్లు కూడా హెడ్‌ల్యాంప్ యూనిట్ క్రింద ఎల్‌ఈడీగా ఉంచబడతాయి. మరింత క్రిందికి, సెల్టోస్ యొక్క ముందు బంపర్లలో ఐస్ క్యూబ్ ఎల్ఈడి ఫాగ్ లాంప్స్ కూడా ఇరువైపులా ఉంటాయి.

కియా సెల్టోస్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, షార్ప్ షోల్డర్ లైన్స్ అండ్ క్రీజెస్ కలిగి ఉంటుంది. సెల్టోస్ డ్యూయల్-టోన్ క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. వెనుక ప్రొఫైల్ కూడా అదే స్పోర్టి థీమ్‌తో ముందుకు తీసుకువెళుతుంది. సెల్టోస్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు మరియు బూట్ లిడ్ మధ్యలో సన్నని క్రోమ్ స్ట్రిప్‌తో వస్తుంది. ఇందులో కియా బ్యాడ్జింగ్ ఉంటుంది. బంపర్ ఇరువైపులా రిఫ్లెక్టర్లతో వస్తుంది, అదే సమయంలో స్కఫ్ ప్లేట్లు కూడా ఉంటాయి.

కియా సెల్టోస్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో చక్కగా రూపొందించిన డాష్‌బోర్డ్‌తో వస్తుంది. చుట్టూ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉంటాయి. సెంటర్ కన్సోల్‌లో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు యువిఓ కనెక్టివిటీ యాప్ కలిగి ఉంది. సెల్టోస్ 7 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

కియా Seltos ఇంజన్ మరియు పనితీరు

కియా Seltos Engine And Performance

కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఎంపికలతో పనిచేస్తుంది. ఇవన్నీ బిఎస్-VI ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఉత్పత్తి చేసే 115 బిహెచ్‌పి మరియు 144 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. ఇక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ అందిస్తుంది.

ఇందులో ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు ఇంజిన్ ఎంపికలు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. కియా మూడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో అందిస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఆప్సనల్ సివిటి యూనిట్‌తో వస్తుంది మరియు డీజిల్ ఐవిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది.

కియా Seltos ఇంధన సామర్థ్యం

కియా Seltos Fuel Efficiency

కియా సెల్టోస్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది లీటరుకు 12 నుండి 18 కి.మీ మైలేజ్ అందిస్తుంది. డీజిల్ వేరియంట్ ఇంధన సామర్థ్య గణాంకాల విషయానికి వస్తే, ఇది 14 నుంచి 18 కి.మీ మైలేజ్ అందిస్తుంది. అదేవిధంగా ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 13 నుంచి 16 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 12 నుంచి 15 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

కియా Seltos ముఖ్యమైన ఫీచర్లు

కియా Seltos Important Features

కియా సెల్టోస్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ చుట్టూ ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది, ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్ మరియు టెయిల్ లైట్లు ఉన్నాయి. వీటితోపాటు 17 ఇంచెస్ క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్, జిటి-లైన్ వేరియంట్లలో రెడ్ యాక్సెంట్స్ ఉన్నాయి.

సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క లోపలి భాగంలో, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు యువిఓ కనెక్టివిటీతో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్ ఎసి వెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.

కియా సెల్టోస్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ఆరు-ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్-వ్యూ మానిటరింగ్ ఎల్‌సిడి క్లస్టర్, ఎబిఎస్ విత్ ఇబిడి వంటివి ఉన్నాయి.

కియా Seltos తీర్పు

కియా Seltos Verdict

కియా సెల్టోస్ ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో చాలా ఆకర్షణీయమైన ఆఫర్. ఈ కారు మంచి ఫీచర్స్, భద్రతా పరికరాలతో నిండి ఉంది. అంతే కాకుండా ఇది మంచి పనితీరుని అందిస్తుంది. కియా సెల్టోస్ దాదాపు ప్రతి కస్టమర్ అవసరాలకు అనుగుణంగా వేరియంట్ల హోస్ట్‌తో వస్తుంది.

కియా Seltos కియా Seltos కలర్లు


Aurora Black Pearl
Gravity Grey
Imperial Blue
Pewter Olive
Intense Red
Sparkling Silver
Glacier White Pearl

కియా Seltos పెట్రోల్ కాంపిటీటర్స్

కియా Seltos డీజిల్ కాంపిటీటర్స్

కియా Seltos పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • హ్యుందాయ్ అల్కాజర్ హ్యుందాయ్ అల్కాజర్
    local_gas_station పెట్రోల్ | 0
  • ఎంజి హెక్టర్ ప్లస్ ఎంజి హెక్టర్ ప్లస్
    local_gas_station పెట్రోల్ | 0
  • మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్
    local_gas_station పెట్రోల్ | 0

కియా Seltos డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • హ్యుందాయ్ అల్కాజర్ హ్యుందాయ్ అల్కాజర్
    local_gas_station డీజిల్ | 18.1
  • జీప్ కంపాస్ జీప్ కంపాస్
    local_gas_station డీజిల్ | 0
  • టాటా సఫారీ టాటా సఫారీ
    local_gas_station డీజిల్ | 16.3

కియా కియా Seltos ఫోటోలు

కియా Seltos Q & A

కియా సెల్టోస్ లోని వేరియంట్లు ఏవి?

కియా సెల్టోస్ రెండు ప్రధాన ట్రిమ్లలో అందించబడుతుంది. అవి జిటి-లైన్ మరియు టెక్-లైన్. వీటిలో చాలా రకాలు ఉన్నాయి.

Hide Answerkeyboard_arrow_down
కియా సెల్టోస్‌లో కలర్ ఆప్సన్స్ ఏవి?

కియా సెల్టోస్ 13 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్, గ్లాసియర్ వైట్ పెర్ల్, పంచ్ ఆరెంజ్, ఇంటెలిజెన్సీ బ్లూ, గ్రావిటీ గ్రే, స్టీల్ సిల్వర్, క్లియర్ వైట్, ఇంటెన్స్ రెడ్ / అరోరా బ్లాక్ పెర్ల్, గ్లాసియర్ వైట్ పెర్ల్ / అరోరా బ్లాక్ పెర్ల్, స్టీల్ సిల్వర్ / అరోరా బ్లాక్ పెర్ల్, స్టీల్ సిల్వర్ / పంచ్ ఆరెంజ్ మరియు గ్లాసియర్ వైట్ పెర్ల్ / పంచ్ ఆరెంజ్.

Hide Answerkeyboard_arrow_down
కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ఎంత?

కియా సెల్టోస్ ప్రస్తుతం వేరియంట్ మరియు రంగును బట్టి 2 నుండి 3 నెలల మధ్య వేచి ఉండాల్సి వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా సెల్టోస్‌కు ప్రత్యర్థులు ఏవి?

కియా సెల్టోస్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, ఎంజి హెక్టర్, టాటా హారియర్ & జీప్ కంపాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా సెల్టోస్ లో బిఎస్ 6-కంప్లైంట్ ఉందా?

అవును, కియా సెల్టోస్‌లోని మూడు ఇంజన్ ఎంపికలు BS-VI కంప్లైంట్.

Hide Answerkeyboard_arrow_down
కియా సెల్టోస్ బుకింగ్ మొత్తం ధర ఎంత?

కియా సెల్టోస్‌ను రూ. 25 వేలకు బుక్ చేసుకోవచ్చు.

Hide Answerkeyboard_arrow_down
కియా సెల్టోస్ లేదా ఎంజి హెక్టర్ లలో ఏది మంచిది?

ఈ రెండింటిలో కియా సెల్టోస్ మంచి ఎంపిక.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X