వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌వ్యాగన్ పోలో
Style: హ్యాచ్‌బ్యాక్
6.31 - 10.00 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

వోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం 8 విభిన్న వేరియంట్లు మరియు 5 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. వోక్స్‌వ్యాగన్ పోలో ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, వోక్స్‌వ్యాగన్ పోలో ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా వోక్స్‌వ్యాగన్ పోలో మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి వోక్స్‌వ్యాగన్ పోలో గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్ మోడళ్లు

వోక్స్‌వ్యాగన్ పోలో మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 16.47

వోక్స్‌వ్యాగన్ పోలో రివ్యూ

Rating :
వోక్స్‌వ్యాగన్ పోలో Exterior And Interior Design

వోక్స్‌వ్యాగన్ పోలో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్లో ఉన్న స్మార్ట్ లుకింగ్ హ్యాచ్‌బ్యాక్. జర్మన్ కార్ల తయారీదారు అయిన ఫోక్స్‌వ్యాగన్ నుండి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సమర్పణ స్మార్ట్-స్టైలింగ్ మరియు అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అదే సిల్హౌట్ను కొనసాగిస్తూ పోలో ఇటీవల స్వల్ప నవీకరణను అందుకుంది.

ఈ ఫోక్స్‌వ్యాగన్ యొక్క ముందు నుంచి ప్రారంభించినట్లైతే, ఇది కొత్త హానీ కూంబ్ గ్రిల్ తో వస్తుంది. దిగువ భాగంలో క్రోమ్ యొక్క సన్నని స్ట్రిప్ ఉంటుంది. ఈ క్రోమ్ స్ట్రిప్ ఇరువైపులా గ్రిల్ చుట్టూ ఉన్న హెడ్‌ల్యాంప్ యూనిట్లను కలుపుతుంది. హెడ్‌ల్యాంప్‌లు డ్యూయల్-బీమ్ ప్రొజెక్టర్ యూనిట్లతో, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్లతో వస్తాయి. ఫ్రంట్ బంపర్ లో ఫాగ్ లాంప్స్ కార్నరింగ్ లైట్లతో ఉంచారు.

ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ హ్యాచ్‌బ్యాక్‌లో బాడీ-కలర్ ORVM లు మరియు డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ మినిమాలిస్టిక్ డిజైన్ థీమ్‌తో ముందుకు తీసుకువెళుతుంది, కేవలం బ్లాక్ రూప్ తో అమర్చిన స్పాయిలర్ మరియు పెద్ద టైల్ లైట్స్ బూట్-లిడ్ తో ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క లోపలి భాగంలో చక్కగా అమర్చిన క్యాబిన్ మరియు డాష్‌బోర్డ్‌తో స్మార్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. పోలో చుట్టూ సాఫ్ట్‌-టచ్ మెటీరియల్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా దీని మధ్యలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో ఇంజన్ మరియు పనితీరు

వోక్స్‌వ్యాగన్ పోలో Engine And Performance

ఫోక్స్‌వ్యాగన్ పోలో ఇటీవల బిఎస్ 6 అప్డేట్స్ అందుకుంది. ఈ నవీకరణలో భాగంగా, కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌లోని డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేసింది, పోలో ఇప్పుడు రెండు పెట్రోల్ యూనిట్ అప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇందులో 1.0-లీటర్ త్రీ సిలిండర్ ఎంపిఐ పెట్రోల్ ఇంజన్ 6200 ఆర్‌పిఎమ్ వద్ద 73 బిహెచ్‌పి మరియు 3800 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇందులో ఉన్న రెండవ ఇంజిన్ 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ రూపంలో ఉంది, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద 110 బిహెచ్‌పి మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

వోక్స్‌వ్యాగన్ పోలో ఇంధన సామర్థ్యం

వోక్స్‌వ్యాగన్ పోలో Fuel Efficiency

ఫోక్స్‌వ్యాగన్ పోలో 45-లీటర్ సామర్త్యం గల ఇంధన ట్యాంక్ తో వస్తుంది. కొత్త 1.0-లీటర్ MPi మరియు TSI ఇంజన్లు శక్తివంతమైనవి మరియు ఇంధన వినియోగం కూడా పొదుపుగా ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ ప్రకారం, MPI పెట్రోల్ ఇంజిన్ 17 / 75km / లీ ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. అయితే మరింత శక్తివంతమైన TSI ఇంజిన్ 18.24km / లీ మెరుగైన మైలేజీని అందిస్తుంది. ఏదేమైనా, వాస్తవ-ప్రపంచ ఇంధన ఆర్థిక గణాంకాలు అనేక బాహ్య కారకాల ప్రభావం వల్ల మారుతూ ఉంటాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో ముఖ్యమైన ఫీచర్లు

వోక్స్‌వ్యాగన్ పోలో Important Features

ఫోక్స్‌వ్యాగన్ పోలో అనేక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్-బీమ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో ORVM లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటోతో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్ లింక్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, MID డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడితో ఎబిఎస్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, హై-మౌంటెడ్ స్టాప్ లాంప్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, యాంటీ-పించ్ పవర్ విండోస్ వంటివి ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో తీర్పు

వోక్స్‌వ్యాగన్ పోలో Verdict

ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్లో ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్ సమర్పణ. ఫీచర్-ప్యాక్డ్ ఇంటీరియర్స్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మరియు శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, ముఖ్యంగా టిఎస్ఐ యూనిట్ నుండి, డ్రైవింగ్ ఔత్సాహికులకు ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో వోక్స్‌వ్యాగన్ పోలో కలర్లు


Carbon Steel
Reflex Silver
Sunset Red
Flash Red
Candy White

వోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్ కాంపిటీటర్స్

వోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • హ్యుందాయ్ ఐ20 హ్యుందాయ్ ఐ20
    local_gas_station పెట్రోల్ | 19.65
  • హోండా జాజ్ హోండా జాజ్
    local_gas_station పెట్రోల్ | 17.1

వోక్స్‌వ్యాగన్ వోక్స్‌వ్యాగన్ పోలో ఫోటోలు

వోక్స్‌వ్యాగన్ పోలో Q & A

ఫోక్స్‌వ్యాగన్ పోలోలో ఆఫర్‌లో ఉన్న రకాలు ఏవి?

ఫోక్స్‌వ్యాగన్ పోలో ట్రెండ్లైన్, కంఫర్ట్లైన్ ప్లస్, హైలైన్ ప్లస్, హైలైన్ ప్లస్ ఎటి మరియు జిటి అనే ఐదు వేరియంట్లలో అందించబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
ఫోక్స్‌వ్యాగన్ పోలోలో కలర్ ఆప్సన్స్?

ఫోక్స్‌వ్యాగన్ పోలో ఏడు పెయింట్ స్కిమ్స్ తో అందించబడుతుంది. అవి కాండీ వైట్, ఫ్లాష్ రెడ్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్, సన్సెట్ రెడ్, లాపిజ్ బ్లూ మరియు టోఫీ బ్రౌన్.

Hide Answerkeyboard_arrow_down
ఫోక్స్‌వ్యాగన్ పోలోకు ప్రత్యర్థులు ఏవి?

ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్ యొక్క ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో ఉంది. ఇది మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, హోండా జాజ్ మరియు టాటా ఆల్ట్రోజ్ వంటివారికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
ఫోక్స్‌వ్యాగన్ పోలోలో కొనడానికి ఉత్తమమైన వేరియంట్ ఏది?

1.0-లీటర్ టిఎస్‌ఐ పవర్డ్ జిటి వేరియంట్ ఉత్తమమైన మోడల్.

Hide Answerkeyboard_arrow_down
ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క స్పెషల్ ఫీచర్ ఏమిటి?

ఫోక్స్‌వ్యాగన్ పోలోలో ప్రత్యేకమైన లక్షణం దాని 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ మరియు దాని బలమైన నిర్మాణ నాణ్యత.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X