ధరలు పెంచనున్న టయోటా మోటార్స్, అదే బాటలో ఫోర్డ్...!!

By

Cars
ఆర్థిక సంక్షోభం దృష్ట్య గత సంవత్సరం పాటుగా అమ్మకాలు లేక బేజారెత్తిపోయిన ఆటోమొబైల్ కంపెనీలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండటంతో కార్ల ధరలను పెంచేందుకు సంసిద్ధమవుతున్నారు. దీనికి తోడు పెరిగిన ముడి సరుకుల ధరలు కూడా వీటిపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పట్లో కొన్ని కంపెనీలు ధైర్యం చేసి రేట్లను పెంచనున్నామని ప్రకటించగా, మరి కొన్ని కంపెనీలు బయటకు పడకపోయినా ధరలను పెంచే ఆలోచనలో మాత్రం ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఈ కంపెనీలు ధరల పెరుగుదల ఏ విధమయిన ప్రభావాన్ని చూపుతాయో తెలుకోవాలని పరిస్థితులని చాలా నిశితంగా గమనిస్తున్నాయి.

వీటిలో జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టయోయా మోటార్స్ ధైర్యం చేసి జనవరి నుండీ ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. టయోటా మోటార్స్ లో బహుళజనాధరణ పొందిన కొరోలా ఆల్టిస్, ఇన్నోవా, ఫార్ట్యూనర్ మోడళ్ల ధరలను 1.5% నుండీ 2.0% పెంచనున్నారని ప్రకటించింది. కాగా మారుతి సుజుకి, హుందాయ్ వంటి కంపెనీలు ధరల పెరుగుదల ఏ విధమయిన ప్రభావాన్ని చూపనుందోనని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. టయోటా తర్వాత ఫోర్డ్ కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో ధరలను పెంచనుందని విశ్వసనీయ సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, December 4, 2009, 16:02 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+