టాటా మోటార్స్ లో ఎక్కడ లోపం జరుగుతోంది...??

By

Tata Motors
టాటా మోటార్స్ కు నానో కారు ఇచ్చిన షాక్ మరువక ముందే న్యూఢిల్లీలోని డిటిసి సర్వీసు బస్సు మరో షాక్ ఇచ్చింది. గత వారం వరుసగా మూడు బస్సులు అగ్ని ప్రమాదానికి గురవగా దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ ప్రకారం బస్సు CNG లో ఎలాంటి లోపం లేదని, బ్రేక్ షూలో జరిగిన షార్ట్ సర్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని నిపుణులు తేల్చారు. ఈ ప్రమాదం లో డ్రైవరు చాకచక్యంతో ఎవరూ గాయపడకుండా భయటపడ్డారు.

దీనిపై స్పందించిన ప్రభుత్వం టాటా మోటార్స్ కు జరిమానా విధించినట్టు సమాచారం. దీని పై టాటా మోటార్స్ కూడా ప్రత్యేక విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. కాగా దీనిపై స్పందించిన టాటా మోటార్స్ ఇదేమీ పెద్ద ప్రమాదం కాదని, ఇందులోని లోపం చాలా చిన్నదని, తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణతో ఖచ్చితంగా ఈ లోపాన్ని సరిచేయగలమని ధీమా వ్యక్తం చేసారు.

కాగా ఇంతకు ముందు టాటా బుల్లి కారు నానోలో కూడా షార్ట్ సర్యూట్ వల్ల్ అగ్ని ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా టాటా మోటార్స్ ఇదేమీ పెద్ద లోపం కాదని వెంటనే సవరించినా, ఇక పై ఇలాంటి ప్రమాదాలు జరగరాదని తమ ఉద్యోగులను గట్టిగా ఆదేశించినట్టు తెలిసింది. కానీ మరో సారి ప్రమాదం సంభవించడం పై కంపెనీ చాలా సీరియస్ గా తీసుకుందట.

More from DriveSpark

Article Published On: Monday, December 14, 2009, 17:04 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+