జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల ఉత్వాదన కంపెనీ ఆడీ కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. క్రిందటి ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు రెట్టింపు అయ్యాయని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఈ ఏడాది సెపెంబరు నెలలో 205 కార్ల అమ్మకం అయ్యాయని, ఇది క్రితం ఏడాది సెపెంబరు నెలలో జరిగిన అమ్మకానికి రెట్టింపు అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా వుంటే క్రితం ఏడాది సెపెంబరులో 81 కార్లు అమ్మకం అయినట్టు సమాచారం.
అంతే కాకుండా ఈ ఏడాది మొత్తం అమ్మకాలు, పోయిన ఏడాదితో పోల్చితే 71.56 శాతం పెరిగాయట. పోయిన ఏడాది జనవరి - సెపెంబరు మధ్యకాలంలో 777 కార్ల అమ్మకం జరిగితే ఈ ఏడాది 1,333 కార్లు అమ్ముడు పోయాయి. దీన్ని బట్టి ఇండియాలో ఆడీ కార్లు మంచి ఆదరణపొందుతున్నాయని కంపెనీ వర్గాల్లో ఆనందం నెలకొంది.