లాభాల బాటలో ఆటోమొబైల్ రంగం

అదే ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో సెప్టెంబర్ నెలలో 6.56 శాతం పెరిగి 6,73,891 మోటార్ వాహనాలు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. ఇదే నిరుడు సెప్టెంబర్ నెలకు 6,32,369 అమ్ముడైనట్లు సియామ్ సంస్థ తెలిపింది. సెప్టెంబర్ నెలలో జరిగిన ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 7.67 శాతం పెరిగి 8,38,150 వాహనాలు అమ్ముడైనాయని, అదే నిరుడు ఇదే కాలానికి 7,78,424 వాహనాలు అమ్ముడైనట్లు సంస్థ పేర్కొంది.
ఇదిలావుండగా కమర్షియల్ వాహనాల అమ్మకాల్లోనూ పెరుగుదల కనపడిందని, ఇది సెప్టెంబర్ నెలలో 6.46 శాతం వృద్ధి జరిగి 45,451 వాహనాలు అమ్ముడైనాయి. అదే నిరుడు ఇదే కాలానికి 42,693 వాహనాలు అమ్ముడైనట్లు సియామ్ వివరించింది. కాగా దేశంలోని అన్ని కంపెనీలకు చెందిన పలు వాహనాల అమ్మకాలలో 9.6 శాతం వృద్ధి చెంది 10,92,262 వాహనాలు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. ఇదే నిరుడు సెప్టెంబర్ నెలలో 9,96,586 వాహనాలు అమ్ముడైనట్లు సియామ్ సంస్థ పేర్కొంది.


Click it and Unblock the Notifications








