లాభాలలో హోండా, స్కోడా, జనరల్ మోటార్స్

హీరో హోండా మోటార్స్ అక్టోబరు నెలకు గాను 354,156 వాహనాలను అమ్మినట్టు, గత ఏడాది అక్టోబరు నెలలో 352,449 వాహనాలను అమ్మినట్టు చేప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ యేటి అమ్మకాలు పెరగటం ఆనందంగా వుందని, ఇంకా పెరిగే అవకాశం వుందని కంపెనీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేసాయి.
ఇక స్కోడా ఆటో ఇండియా తమ ఆదాయంలో 98% వృద్ధిని చూపించాయి. ఈ ఏడాది అక్టోబరు నెలలో 1,753 వాహనాలు అమ్ముడుపోగా గత ఏడాది అక్టోబరులో ఈ సంఖ్య 887 గా వుంది.
అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ లాభాల్లో 15% వృద్ధిని సాధించింది. ఈ యేటి అక్టోబరుకు గాను 7,413 వాహనాలు అమ్ముడుపోగా, గత ఏడాది ఈ సంఖ్య 6,465 గా వుంది. జనరల్ మోటార్స్ చెవ్రొలెట్ బ్రాడ్ కార్లలో పెరిగిన అమ్మకాల వల్లే తామీ వృద్ధిని సాధించడానికి కారణమని జియం వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








