ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్ లో కూడా మన సత్తాను చాటుతోంది. టాటా మోటార్స్ భాగస్వామ్య ఆటోమొబైల్ కంపెనీ జాగూర్ ల్యాండ్ రోవర్ సంస్థ గత నవంబరు నెలకు గాను అమ్మకాల్లో 30% వృద్ధిని నమోదుచేసుకుంది. జాగూర్ ల్యాండ్ రోవర్ లో గత నెల నవంబరుకు గాను 18,825 యూనిట్ల అమ్మకాలను సాధించినట్టు, ఇది గత సంవత్సరం అమ్మకాలతో పోల్చితే 2% తక్కువ కాగా, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 45% వృద్ధి చెంది 14,492 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తంగా టాటా మోటార్స్ అంతర్జాతీయ అమ్మకాలు గత సంవత్సరం నవంబరు నెలలోని అమ్మకాలతో పోల్చితే 62% వృద్ధి చెంది 75,775 యూనిట్ల అమ్మకాలు జరిగాయని కంపెనీ ప్రకటించింది.
టాటా మోటార్స్ కు సగానికి పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే జాగూర్ ల్యాండ్ రోవర్ సంస్థ లాభనష్టాలను ప్రభావితం చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాగా 2010 తొలి త్రైమార్షికానికి 328.78 కోట్ల నష్టాన్ని అంచనా వేసిన టాటా మోటార్స్ ను జాగూర్ ల్యాండ్ రోవర్ కంపెనీ సెప్టెంబరు 2010 నాటికి 21.78 కోట్ల లాభాలను ఆర్జించేలా అమ్మకాలను రాబట్టింది.