జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీని ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటులు పెంచిపోషిస్తున్నారని చెప్పవచ్చు. ఇండియాలో తమ కంపెనీ లాభాల శాతాన్ని 50% వరకూ పెంచుకోవాలనే ఆడీ ఆశలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై నగరంలో ఈ కార్ల అమ్మకం ఈ మధ్య జోరందుకుంటోందట. దీనికి కారణం 'బిగ్ బి' అమితాబ్, 'బాలీవుడ్ బాద్షా' షారూఖ్ ఖాన్, సెక్సీ స్టార్ బిపాషా, కత్తి లాంటి కత్రినా, కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాంటి వారు ఈ కారులోనే రయ్ మంటూ దూసుకుపోతుండటంతో ఈ కారును కొనడానికి ముంబై వాసులు ఆశక్తి చూపుతున్నారు.
ఆడీ Q7, స్పోర్ట్స్ కారు ఆడీ R8 లాంటి మోడళ్లు యువతని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే జరిగిన విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న ఆడీ, ఇందులో Q7, R8 వంటి కార్లను ప్రదర్శనకు వుంచింది. ఈ మోడల్ కార్లు ప్రదర్శనకు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.