అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ బ్రాండ్ చెవ్రోలెట్ నుండీ ఓ చిన్న కారు భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది. 'చెవ్రోలెట్ బీట్' పేరుతో రూపొందించబడిన ఈ కారు 2007లో జరిగిన న్యూయార్క్ మోటార్ షోలో రివీల్ చేసారు. కాగా ఈ ఏడాది ఈ కారు భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది. దక్షిణ కొరియా లో డిజైన్ రూపొందించబడిన ఈ కారు 1.2 లీటర్ టర్బోచార్జడ్ పెట్రోల్ ఇంజన్ తో రూపొందించబడింది.
సుమారు 3 లక్షల రూపాలు ధర పలికే ఈ కారు జనరల్ మోటార్స్ నుండీ రాబోతున్న చిన్న కారు. డిసెంబరు చివరి వారానికి ఈ కారు మన రోడ్ల మీద పరుగుతీయనుంది. ఈ కారు ఇక్కడ విడుదలయితే భారతీయ మార్కెట్ లో జనరల్ మోటార్స్ పుంజుకుంటుందని కంపెనీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేసాయి.