ఢిల్లీ ఆటో షోలో కాన్సెప్ట్ కార్ల హవా..!!

వీటిలో ప్రధానమైనవి వోక్స్ వ్యాగన్ రూపొందించిన చిన్న కారు పోలో కాంపాక్ట్. దీంతో పాటు పోలో సేదన్ వెర్షన్ ను కూడా ప్రదర్శనకు ఉంచనున్నారని సమాచారం. హమ్మర్ వంటి భారీ కార్లను రూపొందించిన జనరల్ మోటార్స్ తన రూటు మార్చుకొని రూపొందించిన చిన్న కారు బీట్ కూడా ఈ ఆటో షోలో ప్రదర్శనకు రానుంది. వీటితో పాటు ఫోర్డ్ సంస్థ రూపొందించిన చిన్న కారు ఫిగో కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ రూపొందించనున్న చిన్న కారు కూడా ఇక్కడ ప్రదర్శనకు రానుంది. కాగా ఈ కారు 2012 లో మార్కెట్ లోకి రానుంది.
ఇలా ఎన్నో కంపెనీలు చిన్న కార్లను రూపొందించేందుకు ప్రేరణగా నిలిచిన టాటా మోటార్స్ వారి నానో కారు డీజల్ వెర్షన్, ఎకో ఫ్రెండ్లీ వెర్షన్ కార్లను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారని సమాచారం. కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు. అంతే కాకుండా ఇంకా హుందాయ్ మోటార్స్ రూపొందించిన 'సాంతా ఫీ' suv తో పాటు i30, i40 కార్లు కూడా చూపరులను ఆకట్టుకోవడానికి ప్రదర్శణకు రానున్నాయి. జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ వారు కూడా తాము రూపొందించిన చిన్న కారు మిక్రా ను ప్రదర్శనలో వుంచడానికి సన్నాహాలు పూర్తి చేసారు.


Click it and Unblock the Notifications








