LCV లను రూపొందించే ఆలోచనలో ఫియెట్

ఫియెట్ డీజిల్ ఇంజన్ మరియు ఫియెట్ వాహనాలని దేశవ్యాప్తంగా ప్రమోట్ చెయ్యడానికి నిర్వహించిన 'ఫియెట్ డీజిల్ డ్రైవ్స్ ఇండియా' ను ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఫియెట్ ఆటోమొబైల్స్ చీఫ్ ఆపరేటర్ సిల్వరియో బోన్ ఫిగ్లియోలీ ఈ ప్రకటన చేసారు. ఈ LCV ని రూపొందించగలిగే అన్ని సౌకర్యాలు తమకు వున్నాయని, కానీ ఇది కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పడుతుందని, ఈ లోపు ఫియట్ ఓ చిన్న కారుని భారతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యనుందని, దీని ధర మూడు నుండీ నాలుగు లక్షల మధ్య వుండవచ్చని తెలివపారు.


Click it and Unblock the Notifications








