అమెరికా ఆటోమొబైల్ కంపెని ఫోర్డ్ నుండీ ఓ చిన్న కారు రాబోతోంది. ఎన్నో రాజులుగా ఎదురుచూస్తున్న ఈ "ఫోర్డ్ ఫిగో" కారుని బుధవారం న్యూ ఢిల్లీల్లో ప్రదర్శించారు. చెన్నైలోని ఫోర్డ్ ఫ్యాక్టరీలో ఈ కార్ల రూపకల్పన జరుగుతోంది. 2010వ సంవత్సరంలో ఈ కారు మార్కెట్ లోకి రానుంది. ఈ సంధర్భంగా ఫోర్డ్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ ములల్లి మాట్లాడుతూ తమ కంపెనీ ప్రారంభించిన ఈ ఫిగో కారు భారతదేశంలోని వినియోగదారులను దృష్టిలో వుంచుకొని రూపొందించినదని అన్నారు. ఈ కారు 60 శాతం మార్కెట్ ఇండియాలోనే జరగనుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఫోర్డ్ ఫిగో తమకు భారతీయ మార్కెట్ పై వున్న నమ్మకానికి ప్రతీక అని భారతీయ మార్కట్ ను ఆకాశానికి ఎత్తేశారు.
ఇక ఫిగో విశేషాలు ఓ సారి పరికిస్తే ఈ కారు నిర్మాణము చిన్న కారును పోలి వుండి, సాంకేతికంగా ఫోర్డ్ ఫిఎస్తా(ford fiesta) ను పోలివుంటుంది. నాలుగు డోర్లు గల ఈ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్లలో లభ్యం కానుంది. ఇంతా చెప్పి కారు ధర, ఇంజన్ సామర్థ్యం గురించి మాత్రం దాటవేశారు. హుందాయ్ i20, సుజికి స్విఫ్ట్ ను లక్ష్యంగా చేసుకొని మార్కెట్ లోకి వస్తున్న ఈ కారు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.