జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా ఓ చిన్న కారుని విడుదల చెయ్యాలనే యోచనలో వుంది. హోండా జాజ్(Jazz) జూన్ నెలలో ఇండియాలో విడుదలయ్యి మంచి ఆదరణ పొందుతున్న సమయంలో ఇండియా, థాయ్ ల్యాండ్ లను దృష్టిలో వుంచుకొని ఓ చిన్న కారుని విడుదల చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారు జాజ్ కన్నా చిన్న సైజులో రూపొందబోయే ఈ కారు ఇంకో రెండు మూడేళ్లలో విడుదల కానుంది. థాయ్ ల్యాండ్ లో తయారయ్యే ఈ కారు మిగతా దేశాలకు ఎగుమతి చెయ్యాలని చూస్తున్నారు.
కానీ టాటా నానో కు పోటీగా ఎలాంటి కారుని బరిలోకి తీసుకొచ్చే ఆలోచనలు లేవని కంపెనీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ప్రపంచంలోనే అతి తక్కువ ధర పలికే నానో ఇప్పటికే కొంత మంది సొంతం చేసుకున్నారు. నానో తో పోల్చితే హోండా జాజ్ ఐదు రెట్లు ఎక్కువ ధర పలుకుతోంది. ఇలాంటి సమయంలో నానోకు పోటీ ఇచ్చే అవకాశాలు లేవని కంపెనీ ప్రకటించింది.