చిన్న కార్ల తయారీలో జపాన్ ను అధిగమించిన భారత్..!!

By

Volkswagen
ఈ ఏడాది భారత్ ఏ ముహోర్తాన న్యూఢిల్లీ ఆటో షోలో టాటా మోటార్స్ చిన్న కారు నానో ను విడుదల చేసి ఈ ఏడాదిని ప్రారంభించిందో కానీ అటుపైన చిన్న కార్లకు అన్నీ మంచి రోజులే వచ్చాయి. దీనికి తోడు ఈ కారు ఎన్నో చిన్న కార్ల రూపకల్పనకు నాంది పలికింది. ఒక విధంగా ఈ కారుకు వచ్చిన అనూహ్య స్పందన ఆటోమొబైల్ కంపెనీలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు. దీంతో మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు చిన్న కార్లను రూపొందించేందుకు ఆశక్తి చూపాయి.

వీటిలో ప్రధానమైనవి వోక్స్ వ్యాగన్ రూపొందించిన చిన్న కారు పోలో కాంపాక్ట్. ఆ తర్వాత హమ్మర్ వంటి భారీ కార్లను రూపొందించిన జనరల్ మోటార్స్ కూడా తన రూటు మార్చుకొని బీట్ అనే చిన్న కారును రూపొందించింది. వీటితో పాటు లగ్జరీ కార్ల కంపెనీ ఫోర్డ్ సంస్థ కూడా ఫిగో పేరుతో చిన్న కారును రూపొందించింది. ఆ తర్వాత SUV లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన నిస్సాన్ వారు కూడా తాము సైతం అంటూ ఓ చిన్న కారు మిక్రా రూపొందించారు. ఈ చిన్న కార్లు మొత్తం ప్రధానంగా భారతీయ మార్కెట్ ను టార్గెట్ చేసుకొని రూపొందించినట్టుగా స్వయంగా కంపెనీలే ప్రకటించాయి.

దీనికి భారత్ లో పెరిగిన ఆటోమొబైల్ అమ్మకాలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఆర్థికమాంద్యం కారణంగా ఇతర దేశాల్లో ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మొత్తం దివాలా తీసే పరిస్థితిలో వుంటే భారత్ లో మాత్రం ఆటోమొబైల్ అమ్మకాలు 62% వృద్ధిని సాధించాయంటే అన్ని చోట్లా ఆశ్చర్యం వ్యక్తం అయింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా భారతీయ మార్కెట్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీంతో చిన్న కార్ల రూపకల్పనలో భారత్ ఇంత వరకూ అగ్రస్థాయిలో వున్న జపాన్ ను వెనక్కు నెట్టి ప్రథమ స్థానంలో నిలిచింది.

More from DriveSpark

Article Published On: Thursday, December 24, 2009, 16:39 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+