కారు కొనాలనుకుంటున్నారా..?? మరేం ఫర్లేదు డిసౌంట్లు వున్నాయి..!!

By

Hyundai
మీరు ఈ కొత్త సంవత్సరాన్ని ఓ కొత్త కారుతో స్వాగతించాలనుకుంటున్నారా...?? మీ లాంటి వారికోసమే ఈ సమాచారం. మీరు మారుతీ కంపెనీకి చెందిన వ్యాగనర్, 800, స్విఫ్ట్ మరియు SX4 కానీ హుందాయ్ కంపెనీకి చెందిన i1o, సాంత్రో కానీ స్కోడా కంపెనీకి చెందిన ఫ్యాబియా లేదా చెవ్రోలెట్ స్పార్క్ మరియు ఏవియో U-VA కానీ కొనాలనుకుంటున్నారా...?? అయితే ఈ సంవత్సరాంతం వరకూ మీకు సరికొత్త డిస్కౌంట్లలో ఈ కార్లు లభ్యం కానున్నాయి.

ఒక్కో కారు మీద రూ.5,000 నుండీ రూ.60,000 వరకూ డిస్కౌంట్ పొందే అవకాశం వుంది. కొన్ని డీలర్ సంస్థలయితే కారు కొంటే మొదటి సంవత్సరం మెయిన్టెయినస్ ఉచితం గా అందిస్తాం అని చెబుతుండగా, మరి కొన్ని డీలర్ సంస్థలయితే కారు సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ కేవలం రూ.1 కే అందిస్తాం అని వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

కార్ వేల్ ప్రాడక్ట్ అసిస్టెంట్ వైస్-ప్రెసిడెంట్ బన్వారీ లాల్ శర్మ మాట్లాడుతూ "స్కోడా ఎక్స్-షోరూం ధర 12.75 లక్షలు కాగా ఇప్పుడు కేవలం 12 లక్షలకే లభ్యమవుతోంది. హోండా సిటీ, హోండా సివిక్, హుందాయ్ i1o మరియు హుందాయ్ సాంత్రో కార్లు రూ.35,000 వరకూ డిస్కౌంట్ కు లభ్యమవుతున్నాయి. మారుతీ వ్యాగనర్ మీద రూ.30,000 డిస్కౌంట్ లభిస్తోందని" తెలియజేసారు.

కాగా మహీంద్రా లోగన్ కారు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో రూ.10,000 వరకూ డిస్కౌంటుకు లభిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15న కొత్త స్టాకు రాబోవుతుండటంతో పాత స్టాకును క్లియర్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో డీలర్లు ఈ తరహా డిస్కౌంట్ల ద్వారా వినియోగదారున్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వియం మోటార్స్ కు చెందిన జస్పాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. కొంత మంది డీలర్లు అయితే మీ దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేదా అయినా పర్లేదు మీకు తక్కువ వడ్డీకే బ్యాంకు లోను ఇప్పించే పూచీ మాది అంటూ లోను ఇప్పించంలో కూడా సాయం చేస్తున్నారు.

ఏదైతేనేం కారు కొనాలనుకుంటున్న వారికి ఇది తీపికబురే. కానీ ఈ కార్లను ఇప్పుడు కొని తిరిగి లాభాలకు అమ్ముదామని అనుకొనే వారు, 2009వ సంవత్సరం మోడళ్లకు 2010వ సంవత్సరంలో డిమాండ్ వుండదని, వాటి విలువ పడిపోతుందనే విషయాన్ని దృష్టిలో వుంచుకోవడం మంచిది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 22, 2009, 14:25 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+