భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను శాశిస్తోన్న టాటా మోటార్స్ వారి లగ్జరీ కార్ల బ్రాండ్ జాగూర్ ల్యాండ్ రోవర్ ఈ ఏడాదిలో మంచి లాభాలను ఆర్జిస్తూ ముందుకు పోతోంది. గత నెలలో ముగిన త్రైమార్షికానికి గననీయంగా లాభాలను ఆర్జించింది. ఈ ఏడాది రెండవ త్రైమార్షికంలో జాగూర్ కంపెనీ 12.7% వృద్ధిని నమోదు చేసింది. యు.కె. దక్షిణ-పశ్చిమ ప్రాంతాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ఈ కంపెనీ ఈ వృద్ధిని నమోదు చేసింది.
ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 153% శాతం పెరిగి కంపెనీ లాభాలను 906.85 (1.2 బిలియన్ యూరోలు) కు పెంచుకొంది. ఆర్థిక మాంద్యం నడుస్తున్న ఈ సమయంలో కూడా కంపెనీ లాభాల బాటన నడవడం ఆనందంగా వుందని, దీని కోసం కష్టపడిన వారందరూ అభినందనీయులని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.