బ్రిటీష్ ఆటోమొబైల్ కంపెనీ జాగూర్ మోటార్స్ సరికొత్త కన్వర్టబుల్ కారు జాగూర్ XKR మోడల్ వినియోగదారులని విశేషంగా ఆకట్టుకొంటోంది. భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సొంతం చేసుకున్న ఈ లగ్జరీ కార్ల కంపెనీ ప్రస్తుతం వరుసగా కొత్త మోడల్ కార్లను విడుదల చేసి తన మార్కెట్ ను విస్తరించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ సరికొత్త జాగూర్-XKR కారు 5.0లీటర్ V8 ఇంజన్ తో రూపొంది, 503 bhp హార్స్ పవర్ తో దూసుకుపోనుంది. కేవలం 4.8 సెకెన్లలో ఈ కారు 0-100 km/hr వేగాన్ని అందుకోగలదు.
అన్నింటికీ మించి ఈ కారు స్టయిలిష్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు స్టయిష్ గా కనిపించడమే కాకుండా అత్యాధునిక భద్రతాపరికరాలతో రూపొందింది. ఇన్ని ఆకట్టుకొనే అంశాలు గల ఈ కారు ఖచ్చితంగా వినియోగదారున్ని ఆకట్టుకొంటుందని, దీంతో కంపెనీ మార్కెట్ విస్తృతం అవుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.