టాటా, మహీంద్రాల మధ్య ప్రత్యక్ష యుద్ధం..!!

మినీ ట్రక్కు విభాగంలో ఒక టన్ను కెపాసిటీ గల టాటా ఏస్ ఈ విభాగంలో 90% మార్కెట్ ను ఆక్రమించింది. ఈ మినీ ట్రక్కు ధర కూడా అందరికీ అందుబాటులో 2.8 లక్షలు కావడంతో మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ విభాగంలో ఏకైక యూనిట్ గా బహుళజనాదరణ పొందింది. దీంతో ఈ విభాగం పై కన్నేసిన మహీంద్రా సంస్థ త్వరలోనే 0.7 టన్నుల కెపాసిటీ గల మినీ ట్రక్కు 'మ్యాక్సిమో' ను మార్కెట్ లోకి తీసుకురానుంది.
ప్రస్తుతం నెలకు 10,000 మినీ ట్రక్కుల అమ్మకం జరుగుతుండగా, త్వరలోనే ఇది మరో 20 నుండీ 25 శాతం పెరగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విభాగం మీద పలు సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. కాగా ఈ మ్యాక్సిమో మినీ ట్రక్కును మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ వచ్చే నెలలో జరిగే న్యూఢిల్లీ ఆటో షో లో ప్రదర్శనకు తీసుకురానుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications








