మారుతీ సుజుకి మరో 'ఫ్యామిలీ' కారు...'ఈకొ'..!!

పారిశ్రామిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కారు సి-సెగ్మెంట్ క్రిందకు వస్తుంది. దీని ధర నాలుగు లక్షలు, అంత కన్నా తక్కువగా వుండే అవకాశం వుంది. ఈ విషయమై మారుతి సుజుకి మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఐవి రావు ను సంప్రదించగా గత మూడేళ్లుగా మా ఇంజనీర్లు భారతీయ వినియోగదారులకు ఓ మంచి కారును అందించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. వారి శ్రమ ఫలితమే ఈ కారు, ఇది ఖచ్చితంగా భారతీయ ప్రమాణికాలను పెంచేదిగా వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భారతదేశంలో చిన్న కార్ల రూపకల్పనకు మరింత చేయూతనిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
కాగా ఈ కారును వచ్చే నెలలో జరిగే ఢిల్లీ ఆటో షో లో ప్రదర్శనకు తీసుకురానున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఈ ఆటో షో జనవరి 5 వ తేదీన ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








