ఢిల్లీలో సందడి చెయ్యనున్న ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కార్లు..!!

By

Auto Expo-2010
ఆర్థిక మాంద్యంలో కూడా లాభాల బాటన నడిచిన భారతీయ ఆటోమొబైల్ రంగం ప్రపంచం మొత్తాన్ని తన వైపు దృష్టి మరల్చేలా చేసింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు భారతీయ ఆటోమొబైల్ రంగం పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జరుగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్-పో అందరిలోనూ ఆశక్తిని రేపుతోంది. వచ్చే ఏడాది జనవరి 5వ తారీఖున న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో జరుగనున్న ఈ ఆటో షోలో ప్రముఖ కంపెనీలు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి.

ఈ ఏడాది జరిగిన ఢిల్లీ ఆటో షోలో టాటా మోటార్స్ వారి చౌక కారు నానో ప్రధాన ఆకర్షణ కాగా, వచ్చే ఏడాదిలో జరిగే ఈ ఆటో షోలో టయోటా మోటార్స్ చౌక కారు, జనరల్ మోటార్స్ వారి బీట్ కాంపాక్ట్, వోక్స్ వ్యాగన్ పొలో కార్లు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆర్థిక మాంద్యం సమయంలో నష్టాల బాటను పట్టని ఏకైక అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ కూడా ఈ ఆటో షోలో ఫిగో కాంపాక్ట్ కారుని విడుదల చేసి తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.

మరో లీడింగ్ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ కూడా మారుతీ కాన్సెప్ట్ చిన్న కారుని ఈ ఆటో షోలో రివీల్ చెయ్యాలని భావిస్తోంది. ఈ కారు 2012లో మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ కాన్సెప్ట్ కారుతో పాటు మరో డజన్ మోడళ్లను ఈ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచాలని మారుతీ సుజుకీ భావిస్తున్నట్టు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఐవి రావ్ తెలియజేసారు. వీటితో పాటు మరిన్ని ఆటోమొబైల్ కంపెనీల కార్లు ఈ ఆటో షోలో ప్రదర్శనకు రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 16, 2009, 14:07 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+