ఈ ఏటి మేటి వ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్..!!

By

Nissan NV200
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో వుంచుకొని, వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల శాతాన్ని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో ఆటోమొబైల్ కంపెనీలు కూడా పాలుపంచుకోనున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి కాలుష్యాన్ని తక్కువగా వెలువరించే హైబ్రిడ్ వాహనాలను రూపొందిస్తున్నాయి. ఇటీవలే టాటా మోటార్స్ కూడా హైబ్రిడ్ నానో కారును రూపొందించనున్నట్టు తెలిపింది.

రేవా వంటి చిన్న కార్ల కంపెనీలు అయితే పెట్రోల్, డీజల్ అవసరం లేని ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తూ లాభాల బాటన పయణిస్తోంది. దీంతో మరి కొన్ని కంపెనీలు విజయవంతం అయిన తమ కారు మోడళ్ల కు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్ ను రూపొందిస్తున్నాయి.

తాజాగా ఈ ఏటి మేటి వ్యాన్ గా అవార్డును అందుకున్న నిస్సాన్ కంపెనీకి చెందిన నిస్సాన్ NV200 మోడల్ కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎంతో ఆదరణను పొందిన ఈ వ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా బహుళజనాధరణ పొందుతుందనే ఆశాభావాన్ని కంపెనీ వర్గాలు వ్యక్తం చేసాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 8, 2009, 16:55 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+