లగ్జరీ కార్లు రూపొందించే బ్రిటీష్ కంపెనీ రోల్స్-రాయ్స్ తాజాగా ఓ లగ్జరీ కారు 'ఘోస్ట్' ను రూపొందించింది. ఇతరత్రా దేశాల్లో ఇప్పటికే విడుదలయిన ఈ కారు భారతీయమార్కెట్ లోకి గత శుక్రవారం విడుదలయింది. 2.5 కోట్ల రూపాయలు విలువచేసే ఈ కారుని ఢిల్లీలో లాంఛనంగా ఆవిష్కరించారు. భారతదేశంలో పెరుగుతున్న ఆటోమొబైల్ మార్కెట్ ను దృష్టిలో వుంచుకొని వచ్చే ఏడాది రోల్స్-రాయ్స్ 75 కార్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రోల్స్-రాయ్స్ ఆసియా పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ కొలిన్ కెల్లీ తెలిపారు. ఇందులో 50 నుండీ 60 కార్లు 'ఘోస్ట్' కార్లు వుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
భారతీయ, చైనా మార్కెట్ లలో పెరుగుదల కారణంగా ఆసియా పసిఫిక్ విభాగంలో కంపెనీకి 4% వృద్ధి రావడంతో, స్థూలంగా కంపెనీ వృద్ధి రేటు 22% పెరిగింది. దీంతో కంపెనీ భారతీయమార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలిపింది. కాగా ఈ కారు బుకింగులు ఇప్పటికే మొదలయ్యాయి... కానీ కారు డెలివరీ మాత్రం వచ్చే ఏడాది 2010లో కానీ మొదలు కాదు... మరెందుకు ఆలస్యం వెంటనే ఈ లగ్జరీ కారుని ఆర్డర్ చేయండి.