ఫ్రాన్స్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ రినాల్ట్ వారి 'సాండిరో' కారుని ఇండియాలో మహీంద్రా రినాల్ట్ కంపెనీ వారు మార్కెట్ లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ కారు విడుదను అడ్డుకొనేందుకు హుందాయ్ మోటార్స్ ప్రయత్నాలు ఆరంభించింది. దీనికి కారణం ఈ కారు పేరు సాండిరో, హుందాయ్ వారి సాంట్రో కారు పేరుకు చాలా దగ్గరగా వుందట. దాంతో ఈ కారు విడుదలను ఆపివేయాలని హుందాయ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టు లో దావా వేసింది. సాంట్రో కారు బహుళజనాదరణ పొందిన కారని, ఇప్పుడదే పేరుతో రినాల్ట్ వారు ఈ కారుని విడుదల చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని హుందాయ్ ఆరోపించింది.
దీనిపై ప్రతిస్పందించిన మహీంద్రా రినాల్ట్ సిఇవొ నలిన్ మెహతా "సాండిర్ కారు పై తమకు ఎలాంటి హక్కులు లేవని, దీనిపై పూర్తి హక్కులు రినాల్ట్ కంపెనీవే అని దీన్ని పరిగణలోకి తీసుకొని కారు విడుదలకు అనుమతి ఇవ్వాలని" కోర్టుకు విన్నవించుకొంది. దీనపై తీర్పు ఇంకా పెండింగ్ లో వుంది.