'చిన్న'దాని పై పెరుగుతున్న మక్కువ..!!

By

Ford Figo
ఇప్పుడు భారత్ లోని ఆటోమొబైల్ రంగంలో ఎక్కడ విన్నా వినిపిస్తున్న హాట్ టాపిక్ 2010 జనవరి 5న మొదలవబోతున్న ఢిల్లీ ఆటో షో. భారతదేశంలో ఎంతో ఆదరణ పొందుతున్న ఈ ఆటో షోలో ప్రతీ ఏడాదీ ఎదో ఒక మెగా కారు ఆవిష్కరణ చోటు చేసుకోనుంది. 2008 లో జరిగిన ఆటో షోలో "లక్ష రూపాలకే కారు యజమానులు కండి" అంటూ సంచలనం సృష్టించిన టాటా నానో ఆవిష్కరణ ప్రధాన ఆకర్షణ కాగా ఈ ఏడాది ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు విడుదల చెయ్యనున్న చిన్న కార్లు అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి.

ఇందులో చరిత్రలో ఇంతవరకూ చోటు చేసుకోని ఓ విశేషం చోటు చేసుకోనుంది. టయోటా కిర్లోస్కార్ చరిత్రలో ఇంత వరకూ ఎప్పుడూ జపాన్ దేశం బయట ఏ కారునీ విడుదల చెయ్యలేదు. కానీ తొలిసారిగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం రూపొందించనున్న చిన్న కారును ఇక్కడ ఆవిష్కరించనుంది. కాగా ఈ కారు ప్రొడక్షన్ 2010 చివర్లో కానీ మొదలవదు. దీంతో పాటు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు రూపొందించిన చిన్న కార్లను ప్రదర్శనకు వుంచనున్నాయి.

వీటిలో ప్రధానమైనవి వోక్స్ వ్యాగన్ రూపొందించిన చిన్న కారు పోలో కాంపాక్ట్. దీంతో పాటు పోలో సేదన్ వెర్షన్ ను కూడా ప్రదర్శనకు ఉంచనున్నారని సమాచారం. హమ్మర్ వంటి భారీ కార్లను రూపొందించిన జనరల్ మోటార్స్ తన రూటు మార్చుకొని రూపొందించిన చిన్న కారు బీట్ కూడా ఈ ఆటో షోలో ప్రదర్శనకు రానుంది. వీటితో పాటు ఫోర్డ్ సంస్థ రూపొందించిన చిన్న కారు ఫిగో కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ రూపొందించనున్న చిన్న కారు కూడా ఇక్కడ ప్రదర్శనకు రానుంది. కాగా ఈ కారు 2012 లో మార్కెట్ లోకి రానుంది.

ఇలా ఎన్నో కంపెనీలు చిన్న కార్లను రూపొందించేందుకు ప్రేరణగా నిలిచిన టాటా మోటార్స్ వారి నానో కారు డీజల్ వెర్షన్, ఎకో ఫ్రెండ్లీ వెర్షన్ కార్లను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారని సమాచారం. కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు. అంతే కాకుండా ఇంకా హుందాయ్ మోటార్స్ రూపొందించిన 'సాంతా ఫీ' suv తో పాటు i30, i40 కార్లు కూడా చూపరులను ఆకట్టుకోవడానికి ప్రదర్శణకు రానున్నాయి. జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ వారు కూడా తాము రూపొందించిన చిన్న కారు మిక్రా ను ప్రదర్శనలో వుంచడానికి సన్నాహాలు పూర్తి చేసారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సారి జరుగనున్న న్యూఢిల్లీ ఆటో షోలో చిన్న కార్లకే అగ్రతాంబూలం దక్కింది. నేడు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలో చిన్న కారే ముద్దు అనుకున్నారో లేక ధర తక్కువ అని మధ్యతరగతి వారు కూడా ఆశక్తి చూపుతున్నారో కానీ ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం చిన్న కార్లే ముద్దు అనే తరహాలో వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ పరిణామాలన్నింటికీ టాటా నానో కారుకు వస్తున్న ఆదరణే మూలం అనడంలో అతిశయోక్తి లేదు...!!

More from DriveSpark

Article Published On: Tuesday, December 22, 2009, 11:56 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+