చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ కారు వేగంలో జెట్ విమానంతో పోటీ పడగలదంటే నమ్మసక్యం కాని విషయమైనా ఇది అక్షరసత్యం. ఇంతకీ ఈ కారు ఎంటో తెలుసా అల్టిమేట్ ఏరో. ఏరో అనే పేరుకు తగ్గట్టుగానే ఈ కారు వేగంలో గాలితో పోటీగలదు. గంటకు 413 కి.మీ. వేగంతో పరుగుతీయగల ఈ కారు ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి వేగవంతమయిన కారుగా రికార్డులకెక్కింది. అమెరికాకు చెందిన షెల్ బై సంస్థ తయారు చేసే ఈ వేగవంతమయిన కార్లు వచ్చే నెలలో భారతీయ రహదారి పై పరుగుతీయడానికి సిద్ధమవుతున్నాయి. కేవలం 2.78 సెకెన్లలో 60 మైళ్ల వేగాన్ని అందుకొనే ఈ కారును భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు విలాసవంతమైన కంపెనీ కార్లను పంపిణీ చేసే దుబాయ్ కు చెందిన అల్టిమేట్ మోటార్స్ తెలిపింది.
ఇంత వేగంతో దూసుకుపోగల ఈ కారు ధర 2.4 నుండీ 5.4 కోట్ల మధ్య నిర్ణయించారు. వచ్చే ఏడాదికి మూడు షెల్ బై ఏరో కార్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అల్టిమేట్ మోటార్స్ ప్రకటించింది. కానీ ఇంత వేగంగా దూసుకుపోగల ఈ కారు మన రోడ్ల మీద ఎలా మనగలదో అనేది అప్పుడు మినియన్ డాలర్ల ప్రశ్న...!!