మారుతీ సుజుకి తొలి ప్రీమియర్ సేదన్ 'సుజుకి కిజాషి'..!!

ఇంతకు ముందు మారుతీ సుజుకి స్విఫ్ట్ ఢిజైర్ అనే సేదన్ ను విడుదల చేసి విజయవంతం అయిన మారుతీ సుజుకి ఇప్పుడు ఈ ప్రీమియర్ సేదన్ కారును కూడా విజయవంతం చెయ్యాలని ప్రయత్నిస్తోంది. 'సుజుకి కిజాషి' పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియర్ సేదన్ ను వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్-పో లో ప్రదర్శించడానికి మారుతి సుజుకి సన్నాహాలు చేస్తోంది.
జపాన్, అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే విడుదలయిన ఈ కారు 2.4 లీటర్ DOHC ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ తో రూపొంది, 180 హార్స్ పవర్ తో దూసుకుపోనుంది. కాగా ఈ ప్రీమియర్ సేదన్ కారు ధర సుమారు 15 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications








