గట్టి పోటీకి సిద్ధమవుతోన్న టాటా మోటార్స్

టాటా సఫారీ లాంటి మల్టీపర్పస్ వెహికల్ గ్రాండ్ సక్సెస్ తర్వాత రాబోతున్న ఈ కారు మీద మంచి అంచనాలే వున్నాయి. టాటా సఫారీకి ఉపయోగించిన 2.2 లీటర్ డైకోర్ డీజిల్ ఇంజన్ నే ఈ వాహనానికి కూడా ఉపయోగించారు. ఏడుగురు సౌకర్యంగా కూర్చోడానికి వీలుగా ఈ కారును డిజైన్ చేసారు. కాగా ఈ ఏడాది జూన్ లో ఈ కారు వినియోగదారుడికి అందుబాటులోకి వస్తుందని తొలుత అందరూ భావించినా ఇంకా కారు విడుదల గురించి టాటా మోటార్స్ ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడంతో అసలు ఈ కారు ఈ ఏడాది విడులకానుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదెలా వున్నా ఈ కారు విడుదలయితే మిగితా కంపెనీల వారికి ఇబ్బందే అనడంలో అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications








