2011లో టాటా ఇండికా ఎలక్ట్రిక్ వెర్షన్ కారు...

తాజాగా టాటా మోటార్స్ లో బహుళజనాదరణ పొందిన టాటా ఇండికా కారు ఎలక్ట్రిక్ వెర్షన్ ను త్వరలోనే మార్కెట్ చెయ్యనున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. 2009లో జరిగిన ఆటో ఎక్స్-పో లో రివీల్ చేసిన ఈ కారు 2011లో భారతీయ మార్కెట్ తో పాటు, అంతర్జాతీయలోకి విడుదుల కానుందని కంపెనీ వర్గాల విశ్వసనీయ సమాచారం. కాగా ఈ కారు ధర పెట్రోల్ లేదా డీజల్ ఇండికా కారు కన్నా అధికంగా వుంటుందని, ఈ కారును భారతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యడానికి ముందుగా ఓ సర్వే నిర్వహిస్తామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ యం. తెలంగ్ స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications








