భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ చిన్న కారు టాటా నానోకు విడుదలకు ముందు నుండే మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే ముందస్తు బుకింగ్ లలో రికార్డు సృష్టించిన ఈ కారు విడులయ్యాక ఇంకా ఆదరణను పెంచుకుంటూ పోతోంది. దీంతో ఈ కారు ఉత్పాదనను పెంచాలని టాటా మోటార్స్ భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది మార్చ్ నుండీ రోజుకు 200 కార్లను ఉత్పత్తి చెయ్యడానికి కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ప్రస్తుతం సనంద్ లోని నానో కారు ఇంజన్ ట్రయిల్ రన్ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి నుండీ రోజుకు 50-60 కార్లను ఉత్పత్తి చెయ్యనున్నారు. వచ్చే ఏడాదిలో సనంద్ నుండీ 72,000 నుండీ 80,000 కార్లను ఉత్పత్తి చెయ్యాలని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ నుండీ నానో కార్లను ఉత్పత్తి చేస్తోన్న టాటా మోటార్స్ ఇక్కడ రోజుకు 100-120 కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలో ఈ ప్లాంట్ నుండీ నెలకు 2,500-3000 కార్లను ఉత్పత్తి చెయ్యాలని కంపెనీ భావిస్తోంది. అడ్వాస్స్ బుకింగుల రూపంలో 200,000 నానో కార్లు రూపొందించాల్సి వుంది. దీంతో ఉత్పత్తిని వేగవంతం చెయ్యాలని భావించిన టాటా మోటార్స్ సనంద్ లో కార్ల ఉత్పత్తి పూర్తి స్థాయిలో మొదలైనా ఉత్తరాఖండ్ లో ఉత్పత్తి ఆపమని కంపెనీ వర్గాలు ప్రకటించాయి...