ఇండిగో మంజా పైనే టాటా ఆశలు

గత సంవత్సరం నుండీ టాటా ఇండిగో కార్ల అమ్మకం గననీయంగా తగ్గింది. గత ఏడాది అక్టోబరులో 4,000 కార్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది అక్టోబరుకు అది 3,000 కు పడిపోయింది. దీంతో ఇండిగోను సరికొత్తగా తయారుచేసి ఇండిగో నింజాను విడుదల చేసారు. ఇటీవలే విడుదలయిన ఈ కారుకు మంచి స్పందన వస్తోందని, త్వరలోనే ఈ కార్ల CNG మరియు LPG వెర్షన్ లను విడుదల చెయ్యనున్నట్టు కృష్ణన్ తెలిపారు. అలాగే టాటా ఇండికా CNG/LPG వెర్షన్ కార్లు ఇండికా అమ్మకాలని 15% నుండీ 18% వరకూ పెంచాయని, దీంతో నెలకు 10,000 నుండీ 11,000 కార్లు అమ్ముడుపోతున్నాయని, ఇదే విధంగా మంజా కూడా మార్కెట్ లో తన ప్రతాపాన్ని చూపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications








