కార్లు అయిపోయాయి...ఇక బస్సుల వంతు..!!

By

Tata Motors
భారతీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా మోటార్స్ తాజాగా పర్యావరణానికి ఏ మాత్రం హాని తలపెట్టని కార్లను రూపొందిస్తున్నారు. టాటా మోటార్స్ లో బహుళజనాధరణ పొందిన టాటా ఇండికా ఎకో-ఫ్రెండ్లీ వెర్షన్ ను విడుదల చేసిన టాటా మోటార్స్ ఇప్పుడు హైబ్రిడ్ సిటీ బస్సులను రూపొందించే పనిలో పడింది.

ఈ విషయాన్ని టాటా మోటార్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ యం. తెలంగ్ వెళ్లడించారు. ఈ బస్సు రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు అందజేస్తామని ఆయన వెళ్లడించారు. కానీ ఈ ప్రాజెక్టు ఎంత వరకూ వచ్చింది, ఈ బస్సు ఎప్పుడు విడుదల కానుంది అనే విషయాలను వెళ్లడించేందుకు ఆయన నిరాకరించారు. పని ప్రోగ్రెస్ లో వుంది, సాధ్యమయినంత త్వరలో ఈ బస్సు ను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వచ్చే ఏడాది జనవరిలో జరిగే న్యూఢిల్లీ ఆటో షోలో ఈ బస్సును ప్రదర్శనకు వుంచనున్నారా అని అడిగిన ప్రశ్నకు "ఆటో ఎక్స్-పో లో టాటా మోటార్స్ గత ఏడాది నానో కారుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ ఏడాది ఏ మోడల్స్ ప్రదర్శనకు ఉంచనున్నామో ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ కొన్ని కాన్సెప్ట్ కార్లను, సిద్ధం అయిన మోడళ్లను మీ ముందుకు తీసుకురానున్నాము" అని తెలిపారు.

కాగా ప్రస్తుతానికి టాటా మోటార్స్ హైబ్రిడ్ ఇండికా కారుని యుకే, నార్వే, డెన్మార్క్ వంటి దేశాల్లో లాంచ్ చేసే పనిలో తలమునకలై వుంది. 2011వ సంవత్సరం నాటికి ఈ కారు అందుబాటులోకి రానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 23, 2009, 11:29 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+