టాటా ల్యాండ్ రోవర్ 'పవర్ ఫుల్ SUV'

అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ నుండీ జాగూర్ ల్యాండ్ రోవర్ ను టాటా మోటార్స్ $2.3 బిలియన్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కంపెనీ వార్షిక నివేదికలో రతన్ టాటా జాగూర్ ల్యాండ్ రోవర్ నుండీ మరిన్ని మోడళ్లు రూపొందుతున్నాయని, వచ్చే ఏడాది అవి మార్కెట్ లోకి రానున్నాయని తెలిపారు. ఈ ఏడాది ల్యాండ్ రోవర్ నుండీ డిస్కవరీ-4, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ కార్లు విడుదలయ్యాయి. కాగా నేడు విడుదలయిన ఈ సరికొత్త SUV ఎక్స్ షో-రూం ధర ముంబైలో 98.5 లక్షలుగా నిర్ణయించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ SUV ని మీ సొంతం చేసుకొని ఠీవీగా రోడ్డు మీద పరుగులు తీయండి.


Click it and Unblock the Notifications








